Wednesday, January 29, 2020

పరాశర మునిచే రచించబడిన కృషి పరాశర గ్రంథ విశేషాలు farming from krushiparasura

 *  మాఘఫాల్గుణ మాసములలో విత్తనములు అన్ని ఒకచోట చేర్చి ఎండలో ఎండబెట్టవలెను . ఎండబెట్టుటకు భూమిపైన ఏదన్నా ఉంచవలెను .సరాసరి భూమి తగలరాదు.

 *  సమాన ఆకారము లో ఉన్న విత్తనాలు మంచిఫలితాలను ఇచ్చును. అందువలన ఒకేరూపములో ఉన్న విత్తనాలను భద్రపరచవలెను.

 *  బీజముల సంచులను పుట్టలపైన , చీమల బొరియల పైన , గోశాలలో , ప్రసూతి గృహములలో , వంధ్య స్త్రీ ఉన్న స్థలములలో ఉంచరాదు.

 *  బీజములను ఎంగిలి చేయరాదు . రజస్వల, వంధ్యస్త్రీ, గర్భిణీస్త్రీ , బాలింత బీజములను తాకరాదు.

 *  వ్యవసాయదారుడు పొరపాటున కూడా నెయ్యి, నూనె , మజ్జిగ, దీపము బీజముల పైన ఉంచరాదు.

 *  దీపము , అగ్ని, పొగతో ఎండిన , వర్షములో
తడిచిన బీజములను పొలములో చల్లరాదు.

 *  విత్తనములు వృక్షరూపములో పెద్దవైన తరువాత వాటిని తీసివేయరాదు. ఫలితాన్ని ఇవ్వవు.

 *  శ్రావణములో హస్త ప్రమాణ దూరములో భాద్రపదములో హస్తానికి ప్రమాణానికి సగం దూరంలో , కన్యలో నాలుగంగుళాల దూరంలో పంటలను నాటవలెను.

 *  ఆషాడ , శ్రావణ మాసములలో పంటలను కోయవలెను . ఆ సమయంలో కోయకున్న బీజాలు అలానే ఉండును.

 *  శ్రావణ మాసములో పంటని కోసిన వర్షము వలన పంట నష్టం జరగదు. భాద్రపదములో పంటని కోసిన సగం పంట మాత్రమే మిగులును. ఆశ్వయుజ మాసములో పంటని కోసిన ఆ పంట పైన ఆశలు వదుకోవలసివచ్చును.

 *  పొలమును రోగముల నుండి రక్షించుటకు భాద్రపద మాసములో పొలములోని జలమును బయటకి తీయవలెను. కేవలం వరిమొక్క మొదళ్ళలో మాత్రమే నీరు ఉండునట్టు చేయవలెను .  భాద్రపదములో జలముతో నిండిన పంట వివిధరోగములతో నాశనం అగును.

 *  రైతు మార్గశిర మాసము వచ్చినపుడు శుభదినములలో పొలం దగ్గరకి వెళ్లి రెండు ముష్టిల ధాన్యం కోయవలెను . కోసిన ధాన్యపు దుబ్బులకు గంధపుష్పములతో నైవేద్యం తగినవిధముగా చేసి పూజించి ఈశాన్య కోణము నుంచి కోయడం మొదలు పెట్టవలెను.

 *  కోసిన ధాన్యపు కట్టను శిరస్సుపైన ఉంచి దారిలో ఎవరిని ముట్టుకోకుండా రైతు మౌనముగా గృహమునకు రావలెను. ఇంటిలో నున్న గదిలో ఏడడుగులు నడిచి పూర్వదిశలో ధాన్యపు కట్టని ఉంచి పూజించవలెను.

 *  ధాన్యము కొలిచే ఆడకము ఆకారములో పన్నెండు అంగుళములు ఉండవలెను . ఆడకముతో ధాన్యపు రాశిని ఎడమవైపు నుండి కొలవవలెను. దక్షిణము నుండి ధాన్యమును కొలిచిన వ్యయకారకం అగును. ఎడమవైపు నుండి కొలిచిన ధాన్యము వృద్ధిని పొందును.

 *  ధాన్యము కొలుచు ఆడకము మామిడి, పున్నాగము కర్రతో చేసినది ఉత్తమముగా ఉండును. వెలగచెట్టు , జువ్విచెట్టు కర్రతో చేసిన ఆడకముతో కొలిచిన పేదరికము వృద్ది అగును.

 *  హస్త, శ్రవణ, ధనిష్ట, మృగశిర, శతబిషం , పుష్యమి, రేవతి , రోహిణి , భరణి, మూల, ఉత్తరాత్రయం , మఘ , పునర్వసు నక్షత్రములలో గురు, శుక్ర, సోమవారాలలో సూర్యుడు మీనలగ్నములలో ఉన్నప్పుడు ధాన్యస్థాపనం చేయవలెను . నిధన సమయములు అనగా ఆది , మంగళ , శని, బుధవారములలో ధాన్యస్థాపనం చేయకూడదు . ధాన్యస్థాపనం అనగా పండిన ధాన్యాన్ని నిలువచేయడం


ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో వివరించిన వ్యవసాయ ముహుర్తాలు  -


ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో వివరించిన వ్యవసాయ ముహుర్తాలు  - 

 *  శ్రవణ , ధనిష్ట, శతభిష , చిత్త, స్వాతి , విశాఖ , అనూరాధ , రేవతి , అశ్వని , పునర్వసు, మృగశిర, పుష్యమి నక్షత్రముల యందు తారాబలం చూసి డబ్బులు చెల్లించవలెను.

 *  మూల, అనూరాధ , రేవతి , స్వాతి , ఉత్తర, ఉత్తరాషాఢ , ఉత్తరాభాద్ర, పుష్యమి, శ్రవణం , విశాఖ  ఈ నక్షత్రముల యందు విత్తనాలు విత్తుకొనవలెను.

 *  బుధవారం 3 భాగములు , మంగళవారం 8 భాగములు , అదివారం 10 భాగములు, సోమవారం 16 భాగములు , శనివారం 20 భాగములు ఆయా వారాలలో గింజల రాసిని కొలిచిన నశించును. కావున గురు, శుక్రవారములలో గింజల రాసిని కొలవవలెను.

 *  స్వాతి , పుష్యమి, అశ్విని, విశాఖ, శ్రవణము, ధనిష్ట , శతభిషము, పునర్వసు ఈ నక్షత్రముల యందు ఆది, సోమ , గురు, శుక్ర, శనివారముల యందు  5 , 8 , 9 ఈ స్థానములలో పాపగ్రహములు లేని లగ్నముల యందు వ్యవసాయ  ఋణము చేసిన త్వరగా తీరిపోవును.

 *  నంద పూర్ణ తిధులు గల, గురుశుక్ర వారములు , మూల , మృగశిర, పుబ్బ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర , ఆశ్రేష , మఖ, రేవతి , విశాఖ , అనూరాధ , పునర్వసు  నక్షత్రముల యందు భూములు కొనుగోలుచేయుట , అమ్ముట శుభకరం.

 *  రేవతి , ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాబాద్ర, రోహిణి , హస్త, పుష్యమి, మూల, మృగశిర, స్వాతి , జ్యేష్ఠ, అశ్విని నక్షత్రముల యందు , గురు,శుక్ర, సోమ , బుధవారముల యందు , కన్య , కర్కాటక , మిథున, మీన , మకర లగ్నముల యందు ఏరువాక , వృక్షచేధన , బీజాలను నాటుట కార్యక్రమాలు శుభప్రదం .

 *  నంద, భద్ర తిథుల యందు , సింహ, ధనుర్లగ్నముల యందు , భరణి, హస్త, చిత్త, స్వాతి , విశాఖ , అనూరాధ , మఖ, ఆశ్రేష , ఆర్ధ , అశ్విని , పూర్వత్రయ నక్షత్రముల యందు పశువులు పశుశాలలో ప్రవేశించుట శుభకరం.

 *  ఆది , సోమ , గురువారముల యందు ఆర్ద్ర , మృగశిర , మూల, పూర్వాభాద్ర, కృత్తికా నక్షత్రముల యందు పశువులును కట్టుట శుభకరం.

 *  భరణి, ఆశ్రేష , శ్రవణము, చిత్తా నక్షత్రముల యందు , శనివారం నాడు, అమావాస్య , అష్టమి,
 షష్టి తిథుల యందు ఎద్దులు కట్టవలెను.

 *  భరణి, ఆరుద్ర, కృతిక, అనూరాధ , మూల, మఖ, పునర్వసు , చిత్త, మృగశిర ఈ నక్షత్రముల యందు , మంగళ , ఆది , శనివారముల యందు పశువులను కొనుటకు వెళ్లవలెను.

 *  స్వాతి , మూల, విశాఖ, రేవతి , శ్రవణము, జ్యేష్ట, ధనిష్ట ఈ నక్షత్రముల యందు పశువులను కొనుట శుభకరం.

 *  ధనిష్ట, జ్యేష్ట, మృగశిర, రేవతి , విశాఖ , ఆశ్రేష , మఖ, అశ్విని , పూర్వత్రయ ఈ నక్షత్రముల యందు పశువులను అమ్మినవారికి మరియు కొన్నవారికి శుభప్రదం.

 *  గురువారంతో కూడిన పుష్యమి నక్షత్రము నందు వృషభ లగ్నము నందైనను , వృషభాoశం  యందైనను  పశుశాల నిర్మించినచో మృగ, చోర బాధలు లేకుండా ఆ పశుశాల యందు ఉండు పశువులు సుఖంగా ఉంటాయి.

 *  అశ్విని, భరణి, రోహిణి , పునర్వసు , హస్త, విశాఖ , జ్యేష్ట, శతభిష , రేవతి ఈ నక్షత్రముల యందు , ఆది , గురువారముల యందు గిత్తలచే కొత్తగా దున్నించవచ్చు .

 *  8 , 4 , 9 , 14 ఈ తిథుల యందు , శనివారం నందును, భరణి, రోహిణి , చిత్త, శ్రవణము , ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాడ, ఆశ్లేష ఈ నక్షత్రముల యందు దున్నపోతులచే దుక్కి దున్నించడం మంచిది .

 *  అశ్విని, రోహిణి , మఖ, ఉత్తరాత్రయ , హస్త, చిత్త , స్వాతి , అనూరాధ , మూల, ధనిష్ట, రేవతి ఈ నక్షత్రముల యందు ఆది , మంగళ , బుధ , శుక్ర వారముల యందు 2 , 3 , 5 , 7 , 10 , 11 తిథుల యందు కొత్తభూమిలో వ్యవసాయ పని ప్రారంభించుటకు శుభకరం.

 *  విత్తనములు చల్లుట ఆరంభించిన మేషలగ్నము నందు పశునాశనం , కర్కాటకం నందు, బహుఫలం , తుల యందు ప్రాణహాని, మకరం నందు సస్యహాని, సింహ లగ్నం అందు చోరభయం , కుంభం నందు అధిక భయం , కన్య , వృషభ , మీన , మిథున , వృశ్చిక , ధనుర్లగ్నముల యందు ధాన్యసమృద్ధి , శుభప్రదం కలుగును.

 *  ఆదివారము సింహ లగ్నం నందు సర్వబీజములు చల్లవచ్చు . సోమవారం మిథున లగ్నం నందు రాజనపు ధాన్యం విత్తనాలు చల్లవచ్చు. మంగళవారము మేష , వృశ్చిక లగ్నముల యందు కొర్ర ధాన్యములను , బుధవారం మిధున, కన్య లగ్నముల యందు పోక చెట్లు తోట స్థాపించవలెను.

 *  గురవారం , ధనుర్మాసముల యందు మామిడి మొదలగు ఫలవృక్షములు నాటవలెను. శుక్రవారమున , తుల , వృషభముల యందు మల్లె మొదలగు పూలచెట్లు నాటవలెను.

 *  శనివారమున మకర , కుంభముల యందు నువ్వులు మొదలగునవి చల్లవలెను.

  ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో వివరించిన వ్యవసాయ ముహుర్తాలు  - 2 . 

 *  మూల, శ్రవణము, మృగశిర, పునర్వసు , ధనిష్ట , రేవతి , రోహిణి , అనూరాధ , స్వాతి , ఉత్తరత్రయ  ఈ నక్షత్రముల యందును, కర్కాటక, ధనుస్సు, తుల, వృషభము, సింహము, వృశ్చికం, కుంభం ఈ లగ్నముల యందు , బుధ , గురు, శుక్రవారముల యందు సెనగ, గోధుమ, కంది విత్తనములు చల్లుట ఫలప్రదము.

 *  శుభతిథుల యందు బుధ , గురు, సోమవారముల యందు , రోహిణి , అశ్విని, పుష్యమి, పునర్వసు , హస్త, మూల, స్వాతి, శతభిషము , ఉత్తరాత్రయము , రేవతి నక్షత్రముల యందు , కన్య, కర్కాటక, వృషభ, మిథున, మీన , మకర లగ్నముల యందు సమస్త ఫల వృక్షములు నాటవచ్చు. వివిధ విత్తనములు నాటవచ్చు , పొలము దున్నవచ్చు,  భూమి సంపూర్ణ ఫలప్రదం అగును.

 *  హస్త, చిత్త, విశాఖ , మూల, శతబిషం , స్వాతి , ఉత్తరాబాద్ర, ఉత్తరాషాడ, రోహిణి , జ్యేష్ట, అశ్విని, పునర్వసు , పుష్యమి, అనూరాధ , కృత్తిక , పుబ్బ, పూర్వాషాఢ , పూర్వాభాద్ర ఈ నక్షత్రముల యందు గురు, సోమ , బుధ , శుక్రవారముల యందు సమస్తమైన తోటలు వేయవచ్చు.

 *  పుష్యమి, అశ్విని, హస్త, మృగశిర, అనూరాధ , మూల ఈ నక్షత్రముల యందు చెరుకు తోటలు వేసిన ఫలవంతములు అగును.

 *  పుష్యమి, ఉత్తరాబాద్ర, మఖ, అశ్విని, రేవతి , అనూరాధ , ఉత్తర ఈ నక్షత్రముల యందు మేష, వృశ్చిక, వృషభ , కన్యా లగ్నముల యందు 3 , 5 , 7 , 15 తిథుల యందు , బుధ , గురు, శుక్ర వారముల యందు రేగు , అరటి, పనస , మామిడి తోటలు వేయవలెను .

 *  భరణి, శ్రవణము, స్వాతి , మఖ, మూల, రేవతి , ధనిష్ట, అశ్విని, ఈ నక్షత్రముల యందు వంగ నారు నాటినచో మంచిఫలితం కలుగును.

 *  హస్త, అశ్విని, పుష్య, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర, రోహిణి , చిత్త, అనూరాధ , మృగశిర, రేవతి , స్వాతి , ధనిష్ట, మఖ, మూల ఈ నక్షత్రముల యందు అంట్లు కట్టినచో బాగుగా ఫలించును.

 *  స్వాతి , పుష్యమి, అశ్విని, శతబిషం , మూల, విశాఖ ఈ నక్షత్రముల యందు సమస్తమైన తీగలు పాదులు పెట్టిన బాగుగా కాయును .

 *  రేవతి , ఉత్తర, రోహిణి , పుష్య, హస్త, పునర్వసు, మూల, స్వాతి , శతబిషం , అశ్విని ఈ నక్షత్రముల యందు , సోమ , బుధ , గురు, శుక్రవారముల యందు , కన్య, కర్కాటక, మిథున,మీన , ధనస్సు , వృషభ లగ్నముల యందు , శుభ తిథుల యందు సమస్తమైన చెట్లు నాటవచ్చు. సమస్త బీజములు చల్లుటకు , పొలం దున్నుట ప్రారంభించుటకు శుభప్రదం .

 *  మృగశిర, పుష్యమి, ఆరుద్ర, అశ్విని, భరణి, స్వాతి ఈ నక్షత్రముల యందు , శుభతిథుల యందు , ఆది , మంగళ , గురువారం ల యందు పొగాకు తోటలు వేసిన చక్కగా ఫలించును.

 *  రేవతి , అశ్విని , అనూరాధ , స్వాతి , శతబిషం, పునర్వసు, జ్యేష్ట, శ్రవణం , పుష్యమి, మూల, హస్త, ఉత్తర, మృగశిర నక్షత్రముల యందు , ఆది , సోమ , బుధ , గురు , శుక్రవారముల యందు , సూర్యోదయ కాలం నందు , ఉల్లితోట, కంది తోటలు పైరు పెట్టుటకు  మంచిది .

 *  పునర్వసు , భరణి, హస్త, పుష్యమి, స్వాతి , అశ్విని, రేవతి , మూల ఈ నక్షత్రముల యందు , 2 , 3 , 5 , 7 , 10 , 13  తిథుల యందు , సోమ , బుధ , గురు, శుక్రవారముల యందు , గురు, బుధులు కేంద్రముల యందు ఉండగా ప్రత్తిపైరు పెట్టుట మేలు .

 *  పుష్యమి, అశ్విని, హస్త, మృగశిర, అనూరాధ , మూల నక్షత్రముల యందు , బుధ , గురు, శుక్రవారముల యందు , స్థిరలగ్నముల యందు , శుభతిథుల యందు ఖర్జూర,పోక , కొబ్బరితోటలు వేసినచో ఫలప్రదం అగును.

 *  మూల, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర, శ్రవణము,మృగశిర, పునర్వసు, ధనిష్ట, రేవతి , రోహిణి , అనూరాధ , స్వాతి ఈ నక్షత్రముల యందు , స్థిర లగ్నముల యందు బుధ , గురు, శుక్ర వారముల యందు చేనుకోసి కోసిన సస్యములను కుప్పలు వేయవచ్చు .

 *  కృత్తిక , మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, హస్త, మూల , శ్రవణము , ధనిష్ట ఈ నక్షత్రముల యందు కుప్పలు నూర్చుట మంచిది .

 *  చిత్త, రేవతి , మృగశిర, అనూరాధ , అశ్విని, పుష్యమి, హస్త ఈ నక్షత్రముల యందు , సోమ , గురు, శుక్రవారముల యందు , పూర్ణ తిథుల యందు , చంద్రతారాబల యుక్తమును చూచి కొత్తగింజలు ఇంటికి తెచ్చుకొనుట మంచిది .

 *  మఖ, పుబ్బ, అనూరాధ , జ్యేష్ట, మూల, రేవతి ఈ నక్షత్రముల యందు సింహ లగ్నము నందును ధాన్యము దంచుట ఫలప్రదము .

 *  రోహిణి , ధనిష్ట, శతబిషం, ఉత్తర, ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర ఈ నక్షత్రముల యందు ధాన్యం అమ్ముట మంచిది .

 *  మంగళ , శుక్రవారములు, పూర్ణిమ, అమావాస్య , నవమి, చవితి తిథులు , గ్రహాదినములు పనికిరావు . ఈ దినములలో కాయలు కోసిన పాదులు చెడిపోవును.

 *  అశ్విని, రేవతి , అనూరాధ , హస్త, పుష్యమి, మృగశిర ఈ నక్షత్రముల యందు గానుగ మొదలుపెట్టవచ్చును.

 *  2 , 3 , 5 , 7 , 8 , 10 , 12 , 13 , 15  ఈ తిథుల యందు , గురు, శుక్రవారముల యందు, ఉత్తరత్రయ , పూర్వత్రయ, రోహిణి , మృగశిర, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ , రేవతి , అశ్విని నక్షత్రముల యందు , వృషభ, మిథున, సింహ, కన్య,ధనస్సు , కుంభ , మీన లగ్నముల యందు కొత్తగింజల రాశి కొలుచుటకు మంచిది .

 *  గురువారం , శుక్ర వారం నందు రాశి కొలుచుట మంచిది .


No comments:

Post a Comment