* ద్రాక్షపళ్ళు -
కేన్సర్ , గుండెజబ్బులు ఉన్నవారికి ఇది చాలా మంచిది . దాదాపు ఇరవై రకాల యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి గుండెజబ్బులు రాకుండా నివారిస్తాయి. ద్రాక్షారసం తాగడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది . ద్రాక్ష నుంచి మెగ్నీషియం , సోడియం , పొటాషియం , ఐరన్ , థయామిన్ , ఫాస్ఫరస్ , B6 విటమిన్ కూడా లభించును. పిల్లలకు ద్రాక్షారసం ఇవ్వడం వలన చురుకుదనం పెరిగి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. జ్వరం , శ్వాసకి సంబంధించిన సమస్యలకు , కామెర్లకు , రక్తస్రావం సమస్యలకు హితకరం.
* యాపిల్ -
యాపిల్ నుండి C విటమిన్ , సెల్యూలోజ్ , చక్కెర , పిండిపదార్దాలు , పెక్టిన్లు లభిస్తాయి. వందగ్రాముల యాపిల్ నుండి 1 మి. గ్రా ఐరన్ పొందొచ్చు. అలాగే శరీరానికి అవసరం అయిన ఇతర పోషక పదార్ధాలు ఫైబర్ కూడా యాపిల్ తొక్క తీయకుండా తినడం వలన దేహానికి అందుతాయి. ఒక పెద్ద యాపిల్ తింటే 125 కేలరీల శక్తి మనకి వస్తుంది. యాపిల్ నుండి లభించే పెక్టిన్ సూక్ష్మ జీవులను నశింపచేస్తుంది. అజీర్ణం , అతిసారం , పెప్టిక్ అల్సరుతో బాధపడేవారు క్రమం తప్పక యాపిల్ తింటే ఎంతో ప్రయోజనం దంతాలు శుభ్రపడటమే కాదు దంతవ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 2 .
* అరటిపండు -
అరటిపండులో పొటాషియం , మాంసకృత్తులు ఎక్కువుగా ఉండటం వలన ఇది తీసుకోగానే నీరసం , వికారం తగ్గి ఉత్సాహం వస్తుంది. గుండె పనితీరు క్రమబద్దం అవుతుంది. ఒక పెద్ద అరటిపండు తింటే 150 కేలరీల శక్తి వస్తుంది. అరటిపండు తినడం వలన జీర్ణశక్తి పనితీరు కూడా మెరుగవుతుంది. గుండెనొప్పి నివారించవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు అరటిపండు తింటే ఇందులో ఐరన్ ఉండటం వలన హిమోగ్లోబిన్ శాతం పెరుగును .
* మామిడిపండు -
మామిడిపండు శరీరపుష్టిని కలిగించును. వేగముగా శక్తిని ప్రసాదించును. మామిడిపళ్ళలో A , B , C , D విటమిన్లు కూడా ఉన్నాయి. మామిడి పండ్లలో ఉండే కెరొటిన్ శరీరంలో చేరాక విటమిన్ A గా మారును . మామిడికాయలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. రెండింటిని తినడం వలన ఐరన్ , విటమిన్ C లను పొందవచ్చు. ఇతర ఖనిజ లవణాలు మాత్రం మామిడికాయ , మామిడిపండు రెండింటిలోనూ సమపాళ్లలో ఉంటాయి.
* సీతాఫలం -
శీతాకాలం ప్రారంభంలో కడుపులో నులిపురుగులు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఈ సీజన్లోనే సీతాఫలాలు లభిస్తాయి. ఇవి తీసుకోవడం వలన నులిపురుగులు పోతాయి . సీతాఫలాలు కడుపులోని క్రిములను బయటకు నెట్టివేస్తుంటే సీతాఫలాలు తినటం వలన పురుగులు వచ్చాయి అనుకుంటాము. ఇది కేవలం భ్రమ మాత్రమే . సీతాఫలానికి జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్నది. సీతాఫలం వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నది. రక్తవిరేచనాలకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది .
* దానిమ్మ పండు. -
రక్తహీనతతో బాధపడేవారు రోజూ దానిమ్మపండు తినడంగాని లేదా దానిమ్మపండు రసం తాగడం గాని చేయాలి . ఆహారాన్ని జీర్ణం చేయడంలో దానిమ్మ ఒక ఔషధముగా పనిచేయును . అంతేకాకుండా కీళ్లనొప్పులు , ఉబ్బసం , కఫాలను పోగొట్టును . శరీరంలో మంట, జ్వరం , గుండెజబ్బులు , గొంతుకు సంబంధించిన సమస్యలకు ఇది చాలా మంచిది . అరుగుదల సరిగా లేనివారు దానిమ్మని తినటం అలవర్చుకోవాలి.

No comments:
Post a Comment