Monday, January 20, 2020

చనుబాలు వృద్ది అగుటకు సులభ యోగాలు - how to improve mother milk

చనుబాలు వృద్ది అగుటకు సులభ యోగాలు -

 * ఆవుపాలలో బియ్యం వేసి వండి అందు పటికబెల్లం పొడి కూడా కలిపి ప్రతినిత్యం తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును. నాటు ఆవుపాలు శ్రేష్టం .

 * గోధుమ పిండితో చేసిన పూరీలను నేతిలో ఉడికించి తీసి పాలలో నానబెట్టి తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును. ఆవునెయ్యి శ్రేష్టం.

 *  వాము కషాయం ఇచ్చిన రొమ్ములలో చనుబాలు సిద్ధం అగును.

 * ఆకుపత్రి కషాయం సేవించిన చనుబాలు పడును .

 * చిట్టాముదపు ఆకులకు ఆముదం రాసి రొమ్ములపై వేసి కట్టిన రొమ్ములలో చనుబాలు సిద్దం అగును.

 * బొప్పాయి కాయ కూరగా చేసుకుని తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును.

 * ముళ్లతోటకూర ఆకులను పప్పులో వేసుకొని తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును.

 * తెల్ల జీలకర్ర చూర్ణం , పటికబెల్లం చూర్ణం రెండింటిని సమానంగా తీసుకుని కలిపి ఉదయం , సాయంత్రం 10 గ్రాముల చూర్ణమును అరకప్పు మంచినీటిలో కలుపుకుని తాగుచుండిన యెడల 15 రోజుల్లొ చనుబాలు వృద్ది అగును.

 *  అతిమధురం చూర్ణం 5 గ్రాములు తీసుకుని అరకప్పు ఆవుపాలలో కలిపి 20 గ్రాములు పటికబెల్లం పొడిని కలిపి ప్రతినిత్యం తాగుచుండిన యెడల చనుబాలు వృద్ది చెందును .

      పైన తెలిపిన యోగాలలో మీకు సులభమైన వాటిని ఉపయోగించుకుని సమస్యని పరిష్కరించుకోగలరు.

No comments:

Post a Comment