Monday, January 20, 2020

మెంతులు, మెంతి ఆకు ఉపయోగాలు methi usages


🍀మెంతులు కాస్తంత చేదు ఆనిపిస్తాయి. అయితే వీటిలో చాలా ఔషధ గుణాలున్నాయి.

 🍀మెంతికూర, మెంతులు కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి.

🍀అజీర్తికి విరుగుడుగా పనిచేస్తాయి. మెంతిలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.

 🍀కామెర్లు, రక్తక్షీణత వంటి వాటికి మెంతులు విరుగుడుగా పనిచేస్తాయి.

 🍀లోబీపీ ఉన్నవారికి మెంతులు బాగా ఉపయోగ పడుతాయి. రక్తప్రసారాన్ని పెంచుతాయి.

 🍀వెంట్రుకలు రాలకుండా ఉండడానికి ఉపయుక్తంగా ఉంటుంది. మెంతుల్ని నానబెట్టి రుబ్బి పేస్టులా తయారు చేసి తలకు పట్టిస్తే వెంట్రులు రాలకుండా ఉంటాయి.

 🍀 వెంట్రుకలు నల్లబడతాయి. చుండ్రు తగ్గిపోతుంది.

🍀వేడిగడ్డలు, చీముగడ్డలు లేస్తే నొప్పి భరించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితులలో మెంతులు నూరి గడ్డలకు కడితే ఉపయోగం చాలా ఉంటుంది. గడ్డ పరిపక్వానికి వస్తుంది. పగిలిపోవడానికి దోహదపడుతుంది. అప్పుడు చాలా ఉపశమనం కలుగుతుంది. ఫలితంగా నొప్పి పోటు తగ్గుతుంది.

🍀మెంతిగింజల కషాయం జ్వరానికి బాగా పనిచేస్తుంది.

🍀మెంతులు, మావన శరీరంలోని విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, మానవ శరీరం ఎల్ల వేళలా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగ పడతాయి.

🍀మెంతి ఆకు లాలాజల గ్రంధులు పనితీరును పెంచుతుంది.

🍀రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ, మజ్జిగతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధి, కొలెస్టరాల్ తగ్గుతాయి.

🍀నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.

🍀శ్వాస సంబంధిత సమస్యలకు తొలిదశలోనే మెంతులు ఉపయోగించినట్లయితే సులభంగా తగ్గించుకోవచ్చును.

🍀బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇన్‌ఫ్లుయంజా, న్యూమొనియా, వంటి జబ్బులకు మంచి మందుగా మెంతులు పనిచేస్తాయి.

🍀మెంతి టీ (మెంతులతో తయారుచేసిన తేనీరు)తీసుకోవడంవల్ల శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకోవచ్చును.

🍀మెంతులతో చేసిన పానీయాన్ని, నీటితో పుక్కిలిస్తే, గొంతులో ఉన్న గర గర తగ్గిపోతుంది. పాటలు పాడేవారికి, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు ఈ మెంతుల పానీయం వర ప్రసాదమే. చాలా తక్కువ సమయంలో, మెంతి పానీయాన్ని తయారుచేసుకోవచ్చును.

 🍀కిడ్నీ, మూత్రనాళ సంబంధిత సమస్యలకు మెంతులు చక్కని మందు.

 🍀రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వీటికివే సాటి. అందుకని మెంతికూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యానికి మంచిది.

🍀కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుద్ధి చేస్తాయి.

🍀చక్కర వ్యాధి ఉన్నవాళ్లు రోజూ పరగడుపున మజ్జగలో spoon మెంతి పొడి, నిమ్మరసం వేసుకుని తాగితే మంచిది.

No comments:

Post a Comment