కడుపులో మంట తగ్గించు ఔషధ యోగములు -
ఒక స్పూన్ పుల్లటి దానిమ్మ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి తాగిన కడుపుమంట తగ్గును.
* దేశివాళి టమాటా రసంలో ఉప్పు , మిరియాల చూర్ణం కలిపి త్రాగిన కడుపులో మంట తగ్గును.
* బాగుగా కాచిన గ్లాసు వేడి నీటిలో 25ml నేతిని కలిపి తాగుచున్న కడుపుమంట తగ్గును.
* శిలజిత్ చూర్ణమును మూడు చిటికెలు మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న కడుపుమంట తగ్గును.
* తులసి ఆకులను ఎండించి చూర్ణం చేసి ఒక గాజు సీసా యందు భద్రపరచుకొని ఆ చూర్ణం 3 గ్రాములు ఉదయాన్నే పావు లీటరు పచ్చి ఆవుపాలలో కలిపి సేవించుచున్న కడుపుమంటలు తగ్గును.
No comments:
Post a Comment