Monday, January 20, 2020

థైరాయిడ్ సమస్య ఉందా..? వీటిని తీసుకోండి. thyroid

థైరాయిడ్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -

థైరాయిడ్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -

  ఈ థైరాయిడ్ వ్యాధి నందు రెండు రకాలు కలవు.  అవి .

  *  హైపో థైరాయిడిజం .

  *  హైపర్ థైరాయిడిజం .

      ముందుగా మీకు హైపో థైరాయిడిజం గురించి వివరిస్తాను.

 హైపో థైరాయిడ్  -

      థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువుగా ఉండటం వలన హైపొ థైరాయిడ్ వస్తుంది.  ఇది  T3 ( Tridothyronine) , T4 (Thyroxine) ను థైరాయిడ్ గ్రంథి తక్కువుగా స్రవించడం మూలాన  ఈ సమస్య వచ్చును.

 లక్షణాలు  -

 *  వీరి చర్మం పొడిగా ఉంటుంది. ముఖం ఉబ్బుగా , గుండ్రంగా అవుతుంది. త్వరగా అలిసిపోవడం , బలహీనంగా ఉండి చలికి తట్టుకోలేరు.

 *  చెమట తక్కువుగా వస్తుంది. జుట్టు ఎక్కువుగా రాలిపోతుంది. మానసికపరమైన ఆందోళన ఎక్కువుగా ఉండును.

 *  గుండె పెరుగుతుంది . గొంతులో మార్పు వస్తుంది. కళ్ల కింద ఉబ్బుగా ఉంటుంది. మాటల స్పష్టత తగ్గును. కండరాల శక్తి క్షీణిస్తుంది. మలబద్దకం , పొట్ట ఉబ్బుగా ఉండును. రక్తహీనత కలిగి ఉండి దేనిమీద ఆసక్తి లేకపోవటం , కోపం , చిరాకు , విసుగు ఎక్కువుగా ఉండును. జుట్టు రంగు తగ్గును. శరీరం ఉదయం ఒకలాగా సాయంత్రం ఒకరకంగా ఉండును.

 *  ఈ సమస్య ఎక్కువుగా స్త్రీలలో కనిపిస్తుంది. 30 నుంచి 40 సంవత్సరాల మధ్యవయస్సు ఉన్నవారికి వస్తుంది. ఉదయం పూట వదులుగా ఉన్న జాకెట్లు సాయంత్రం అయ్యేసరికి బిగుతుగా అగును. బరువు పెరుగుతారు.

 *  మలబద్దకం ఎక్కువుగా ఉండును. ఋతువు సరైన సమయానికి రాదు . ఋతు సమయంలో కడుపులో నొప్పి ఉండును.

 *  కండరాలు మరియు జాయింట్ నొప్పులు అధికంగా ఉండును. భుజాలు , చేతులు , కాళ్లు నొప్పి ఎక్కువుగా ఉండును.

 *  శరీరం నందు బద్ధకం ఎక్కువుగా ఉండును. ఎక్కువుగా జలుబు చేయును .

 *  చేతి మరియు కాలు వేళ్ళ గోళ్లు పగుళ్లు రావచ్చును. సీరం సోడియం తక్కువుగా ఉండును. రక్తహీనత ఉండును.

 *  లివర్ ఎంజైమ్స్ ఎక్కువుగా ఉండును. శరీర ఉష్ణోగ్రత తక్కువుగా ఉండును. గుండెవేగం తక్కువుగా ఉండును. రక్తపోటు తక్కువుగా ఉండును.

 *  హైపో థైరాయిడిజం ఉన్నప్పుడు క్యాబేజి , సోయాబీన్స్ , వేరుశనగ , మొక్కజొన్న , బఠాణి , ముల్లంగి మెదలైనవి వాడకూడదు.

 *  విటమిన్ - C , విటమిన్ - E  , విటమిన్ - B2 , జింక్ , నియాసిన్ , B3 , B6 మరియు టైరోసిన్ ఉన్న ఆహారపదార్ధాలు వాడాలి. ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయ ను కూడా బాగా తీసుకోవాలి .

 *  థైరాయిడ్ బాగా పనిచేయాలి అంటే ముఖ్యంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు ఎక్కువుగా తీసుకోవాలి . పసుపుపచ్చ రంగులో ఉండే పండ్లు ఎక్కువుగా తీసుకోవాలి . డ్రై ఫ్రూట్స్ , పచ్చికొబ్బరి తినవలెను .

  హైపర్ థైరాయిడ్  -

     థైరాయిడ్ గ్రంథి అతిగా హార్మోన్ ను ఉత్పత్తి చేయుచున్న హైపర్ థైరాయిడిజం అంటారు. T3 మరియు T4 లను ఎక్కువుగా స్రవించును.

 లక్షణాలు  -

 *  రోజురోజుకి బరువు తగ్గుట.

 *  గుండె వేగం పెరగటం .

 *  చెమట ఎక్కువుగా పట్టడం .

 *  వేడి వాతావరణాన్ని భరించలేకపోవడం .

 *  ఆకలి ఎక్కువుగా ఉంటుంది.

 *  వికారంగా ఉండును.

 *  మలబద్దకం లేదా విరేచనాలు , అతిమూత్రం , నీరసం , అలసట ఉంటుంది.

 *  మతిమరుపు , దుఃఖం , శరీరం వేడిగా ఉంటుంది. జుట్టురాలడం , నిద్ర సరిగా లేకపోవటం వంటి లక్షణాలు కనపడును.

 *  దేని మీద శ్రద్ధ లేకపోవటం , అసహనంగా ఉండటం , కోపంతో కేకలేయడం , చేతులు వణుకుతుంటాయి .

 పాటించాల్సిన నియమాలు  -

 *  వీరు ఆహరంలో ఎక్కువుగా క్యాబేజి , చిక్కుడు , సోయాబీన్స్ , వేరుశనగ వాడాలి. ముల్లంగి కూడా వాడవచ్చు .

 *  విటమిన్ - C , E , B2 , B6 , జింక్ , నియాసిన్ లు థైరాయిడ్ గ్రంథికి శక్తిని ఇస్తాయి . ఇవి టమాటా , నారింజ , ఉసిరి వంటి పండ్లలో ఎక్కువుగా ఉండును.

 *  మెడకు సంబంధించిన వ్యాయామం చేయాలి . ధ్యాన సాధన చేయడం మంచిది .

 *  రోజుకి 30 నిమిషాలపాటు వ్యాయామం చేయుట మంచిది . సర్వాంగాసనం , హలాసనం , మత్స్యసనం , భుజంగాసనం , ధనురాసనం వేయడం మంచిది .

         కొన్ని ప్రాంతాలలో ఆహారం , నీటిలో అయొడిన్ లవణం తక్కువుగా ఉండటం వలన "గాయిటర్" అనే వ్యాధి వస్తుంది. గాయిటర్ వ్యాధి ఉన్నవారిలో మీద ముందు థైరాయిడ్ గ్రంథి కణిత వలే పెద్దగా కనపడును. అయోడిన్ లవణం అధికంగా తీసుకోవడం వలన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు . సహజ ఆహారపదార్దాల ద్వారానే దీనిని పొందడం ఉత్తమం . అయొడిన్ ప్రతిరోజు పెద్దవారు 150 మి.గ్రా , గర్భిణి స్త్రీలు 175 మి.గ్రా తీసికొనవలెను . ఇది ముఖ్యంగా కూరగాయలలో అధికంగా ఉండును.

       ఆయుర్వేదం నందు దీనిని "గళగండ " వ్యాధిగా పిలుస్తారు . ఆయుర్వేదం నందు అత్యద్భుతమైన మరియు సంపూర్ణంగా వ్యాధిని నివారించు ఔషధాలు కలవు.


థైరాయిడ్ వ్యాధి.:-.

 థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇది ఇస్తుంది.


❇ ఇందులో రెండు రకాలు ఉన్నాయి. హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని వీటిని పిలుస్తారు.


❇ థైరాక్సిన్ తక్కువగా ఉత్పత్తి అయితే వారికి హైపో థైరాయిడిజం వస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు. జీవక్రియలు నెమ్మదిగా జరుగుతాయి. బద్దకంగా ఉంటారు.


❇ ఇక థైరాక్సిన్ అవసరానికి మించి ఉత్పత్తి అయితే అలాంటి వారికి హైపర్ థైరాయిడిజం వస్తుంది. దీని వల్ల బరువు త్వరగా తగ్గుతారు. విపరీతమైన ఆకలి వేస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటంది. ఎప్పుడూ కంగారుగా, ఆందోళనగా ఉంటారు.


❇ అయితే ఏ రకమైన థైరాయిడ్ వచ్చినప్పటికీ డాక్టర్ వద్దకు కచ్చితంగా వెళ్లాల్సిందే. దాంతో డాక్టర్ పరీక్ష చేసి అందుకు అనుగుణంగా మందులు రాస్తారు.


❇ దాంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహారాలను తరచూ తింటుంటే థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


🔳 1. అయోడిన్:-...

🔷 థైరాయిడ్ సమస్య రావడానికి ముఖ్య కారణం అయోడిన్ లోపం. అయోడిన్ లోపం కారణంగా థైరాయిడ్ వస్తుంది. కాబట్టి అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. ముఖ్యంగా అయోడిన్ ఉప్పునే వాడాలి. దీంతోపాటు సముద్రపు చేపలు, రొయ్యలు తినాలి. ఆలుగడ్డలు, అరటిపండ్లను తిన్నా అయోడిన్ శరీరానికి అందుతుంది.


🔳 2. అల్లం:-...

🔷 థైరాయిడ్ సమస్య ఉన్న వారు అల్లంను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం తేనెతో సేవించాలి. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది.


🔳 3. అవిసె గింజలు:-...

🔷 వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగు పరుస్తాయి. థైరాక్సిన్ కావల్సినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. నిత్యం అవిసె గింజలను లేదా పొడిని ఏదో ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకుంటే చాలు, ఫలితం కనిపిస్తుంది.


🔳 4. వాల్‌నట్స్:-..

🔷 వీటిలో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. అది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో థైరాక్సిన్ అవసరం ఉన్నంత మేర శరీరానికి అంది థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.


🔳🌴 5. కొబ్బరినూనె:-..

🔷 ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.


🔳 🐟6. ఫిష్ ఆయిల్:-..

🔷 మార్కెట్‌లో మనకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు వాడుకోవాలి. వీటిని వాడితే మన శరీరానికి అవసరం ఉన్న ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ముఖ్యంగా విటమిన్ డి3 అందుతుంది. దీంతో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది.


🔳 🍎7. యాపిల్ సైడర్ వెనిగర్:-

🔷 యాపిల్ పండ్లతో తయారు చేసే ఈ వెనిగర్‌ను నిత్యం తీసుకున్నా చాలు దాంతో థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఒక గ్లాస్ వేడి నీటిలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజుకు ఒకసారి ఏదో ఒక సమయంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది.


🔳 8. బి విటమిన్స్:-...

🔷 థైరాయిడ్ గ్రంథి పనితీరును బి విటమిన్స్ ప్రభావితం చేస్తాయి. కనుక బి విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు.


🔳 9. అశ్వగంధ:-...

🔷 అశ్వగంధ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది.



No comments:

Post a Comment