గాయత్రి జపము గురించి సంపూర్ణ వివరణ -
హిందూ సంస్కృతికి వరప్రసాదం గాయత్రి మంత్రం . ఇది మన మహర్షులు మానవజాతికి అనుగ్రహించిన మంత్రము . దీనిని ప్రతినిత్యము జపమాచరించిన సకలపాపములు నాశనమయ్యి పుణ్యం వచ్చునని శాస్త్రం చెప్పును.
గాయత్రి అన్న పదానికి వివిధార్ధాలు చెప్పబడ్డాయి. సోమలత అను పేరు ఉన్నది. ఈ చరాచర సృష్టిలో మొత్తం 24 రకాల సోమలత జాతులు కలవు. ఈ 24 రకాల సోమలత జాతులలో "గాయత్రి " అన్న పేరు గల సోమలత శ్రేష్టమైనది అని ఆయుర్వేదం చెబుతుంది. రెండోవది గాయత్రి అను పేరుతో వేదములలో ఒక ఛందస్సు కూడా కలదు. సంధ్యావందనములో చెప్పబడిన గాయత్రిలో 24 అక్షరాలు ఉన్నాయి. కాలంలోని 24 గంటలకు గాయత్రిలోని 24 అక్షరాలకు సంబంధం ఉన్నట్టు చెబుతుంది.
లోకములో సాంప్రదాయంగా ఉపాసింపబడునది త్రిపాద గాయత్రి అనగా మూడు పాదములు మూడు వాక్యములు కలిగినటువంటిది. ఒకొక్క పాదమునకు 8 అక్షరములు మూడు పాదములను విడివిడిగా ఆపుచూ జపించవలెను . కలిపిగాని , మధ్యలో ఆపిగాని జపించరాదు. అనగా
"తత్స వితర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ " అని విడివిడిగా చెప్పవలెను. ఇక్కడ ణి , యం అని విడదీసి లెక్కించిన 8 అక్షరాలు ఉండును.
గాయత్రి ఒక దేవతగా భావించుటమైనది. ఈ దేవతకు 5 శిరస్సులు , 10 హస్తములు ఉండును. గాయత్రి మాత యొక్క పంచ శిరస్సులు ఒక సంకేతం అనగా మానవ శరీరం పంచభూతాలతో తయారయినది అని శాస్త్రం చెప్పుచున్నది. అవి
1 -
చర్మం , వెంట్రుకలు , ఎముకలు , నరము , మాంసం ఇవి భూ తత్వానికి చెందినవి .
2 -
శుక్లము , లాలాజలం , చెమట , మూత్రం , రక్తం ఇవి జల తత్వానికి చెందినవి.
3 -
ఆకలి , నిద్ర , దప్పిక , కాంతి , ఆలస్యము ఇవి అగ్నితత్వానికి చెందినవి.
4 -
పరిగెట్టుట , విస్తరించుట , సుళ్ళు తిరుగుట , ప్రయాణం చేయుట , ముకుళించుట ఇవి వాయు తత్వానికి చేరినవి.
5 -
శోకం , కామం , క్రోధము , మోహము , భయము ఇవి ఆకాశ తత్వానికి చెందినవి.
ఈ పంచభూతములకు సంకేతములే గాయత్రి మాత యొక్క పంచ శిరస్సులు . బ్రమ్మాండం నుండి అనగా దశదిక్కుల నుండి బహిర్గతమగు శక్తి ( Cosmic Rays ) మానవునిపై ప్రభావం కలిగించును. ఈ శక్తి మానవుని ఆరోగ్యమునకు అనుకూలం గాని ప్రతికూలం గాని కావచ్చు. ఇలా దశదిక్కుల నుండి విడుదలగు శక్తిని మానవుని ఆరోగ్యమునకు అనుకూలమగునట్లు చూపించునట్లు మరియు చేయునవి గాయత్రి మాత యొక్క పది హస్తములు . ఈ దశదిక్కుల నుండి ప్రసారం అగు శక్తి , నవగ్రహముల నుండి ప్రసారం అయ్యే కిరణాలు (Cosmic Rays ) ఇవి మానవునిపై సదా ప్రభావం చూపుచుండును. ఇలా పంచభూతములు (5 ), దశదిక్కులు (10 హస్తములు ) , నవగ్రహములు (9 శక్తులు ) కలిపి మొత్తము 24 మంత్రపు అక్షరముల సంకేతం. ఈ అక్షరముల ఉచ్చారణ వలన దేహము నందలి 24 ముఖ్య అంగముల మీద ప్రభావం చూపించును. ఈ శక్తులన్నింటిని , నియంత్రణము గావించి మనవుని ఆరోగ్యముకై కావలసిన ముఖ్యమైన త్రిధాతువులు సరైన రీతిలో ఉండునట్లు చేయు మంత్రపు అధిదేవతకు మూడు అక్షరముల నామమును (గాయత్రి ) ఇచ్చినారు. త్రిధాతువులు అనగా వాత ( వాయువు ) , పిత్త ( అగ్ని ) , కఫ ( జలం ) ఈ మూడు ధాతువులు ఎంతవరకు సరిగ్గా ఉండునో అంతవరకు మానవుడు సంపూర్ణ ఆరోగ్యముతో ఉండును. ఈ త్రిధాతువులు మానవుని పంచేంద్రియముల ద్వారా దేహము నందలి అంగాగములను నియంత్రించుచుండును. ఈ పంచేంద్రియములు ( కన్ను , ముక్కు , చెవి , నాలుక , చర్మం ) ఎంతవరకు సరిగ్గా ఉండునో అంతవరకు మానవునకు ఎలాంటి రోగబాధ ఉండదు. దీనిని సాధించుటకే గాయత్రి మంత్ర జపము చేయు ఉద్దేశం.

గాయత్రి మంత్రమును జపమాచరించు మొదట మూడుమార్లు ప్రాణాయామం ఆచరించి అనంతరం జపమాచరించవలెను.
ఈ మంత్రము నందు ముఖ్యమైనవి 24 అక్షరాలు .
" తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి ధియో యోనః ప్రచోదయాత్ " అనునవి 24 అక్షరాలు . ఈ 24 అక్షరములకు 24 అక్షర దేవతలను చెప్పినారు. జపమాచరించునప్పుడు ఈ అక్షరములను స్మరించి , స్మరించుటను చెప్పిన ప్రకారం అంగములను ముట్టుకొని జపమాచరించవలెను.
* తత్ - అగ్ని - పాదము యొక్క బొటనవ్రేళ్లు .
* స - వాయువు - పాదము .
* వి - సోమ - పిక్క .
* తు - అంతరిక్ష - మోకాలి మధ్యన .
* వ - యమ - హృదయము .
* రే - వరుణ - గుహ్యప్రదేశం .
* ణ్య - బృహస్పతి - వృషణములు .
* మ - మేఘము - నడుము.
* భ - ఇంద్ర - నాభి .
* ర్గో - గంధర్వ - కడుపు భాగం .
* దే - సూర్యుడు - స్తనముల ప్రదేశం .
* వ - మిత్ర - హృదయము .
* స్య - బ్రహ్మ - కంఠం .
* ధీ - ఇంద్రుడు - ముఖము .
* మ - మరుత్తు - దవడ .
* హి - సోమ - ముక్కుకొన .
* ధి - అంగీరసుడు - కన్నులు .
* యో - అశ్విని దేవతలు - నెత్తి.
* నః - ప్రజాపతి - ముఖం నందలి భాగం .
* ప్ర - సర్వదేవుడు - ముఖానికి వెనక .
* చో - రుద్ర - తల పశ్చిమ భాగం .
* ద - బ్రహ్మ - తల ఉత్తర భాగం .
* యాత్ - విష్ణు - తలపైభాగం .
జపమాచరించు సమయమున పైన చెప్పిన 24 అక్షరపు దేవతలను అంగన్యాస ,కరన్యాసములలో ఉంచుకుని వారిని ధ్యానించి వారి యందు ఐక్యం కావలెను.ఇలా విన్యాసము చేసుకొన్న బ్రహ్మ , విష్ణు , శివాత్మకుడు అగును. మహాయోగియు , జ్ఞానియు అయి ఉత్తమమైన మోక్షప్రాప్తి పొందును.
సంధ్యాకాలం నందు చేయవలసిన అంగన్యాసం "ఓం భూ: "అని చెప్పి హృదయము నందు , "ఓం భువః " అని తల యందు స్పర్శించవలెను . " ఓం స్వ :" అని తలపైన స్పర్శించవలెను. "తత్స వితుర్వరేణ్యం " అని కళేబరము నందు " ఓం భర్గో దేవస్య ధీమహి " అని కన్నులను , " ఓం థియో యోనః ప్రచోదయాత్ " అని చేతులందు ఉంచవలెను. "ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరొమ్ " అని నీటిని పుచ్చుకొనవలెను. ఇంతటితోనే మానవుడు పవిత్రుడై పాపములను పోగొట్టుకుని మోక్షమును పొందుడు అని చెప్పబడి ఉన్నది.
గాయత్రి మంత్ర జపము గురించి సంపూర్ణ వివరణ - 4 .
అంతకు ముందు పొస్టులలో గాయత్రి మంత్రం యొక్క విశిష్టత తెలియచేశాను. ఇప్పుడు మీకు గాయత్రి మంత్రంలోని ఒక్కో అక్షరం మానవుని శరీరంలోని ఏయే అంగాల మీద ప్రభావం చూపుతుందో వివరిస్తాను.
* తత్ -
ఈ అక్షరమునకు పాదముల బొటనవేళ్లు . అగ్ని అధిదేవత . మానవుని దేహము నందు అగ్ని అంగుష్ఠం నుండి మొదలయ్యి దేహం మొత్తం వ్యాపించును. మానవుడు రోగముచే బాధపడునప్పుడు అవసానదశలో వాని శరీరం అంతయు చల్లబడిన సమయంలో అరికాలికి బూడిద రుద్ది వేడిని ఉత్పత్తి చేసి శరీరం అంతయు ఉష్ణం వచ్చునట్లు చేయు చివరిప్రయత్నం చేయుదురు. ఇదేవిధంగా అగ్నిజ్వాల పైకి జ్వలించునే గాని కిందకి జ్వలించదు. ఇదేవిధముగా శరీరం నందు ఉండు ఉష్ణము శరీరం నందు పైనుంచి కింది వరకు సమస్తం వ్యాపించి ఉండును. దేహము నందు ఉండు అగ్నికి మూలస్థానం అయిన అంగుష్టం నందు ఉండు నరములను ఉత్తేజింప జేయునదే "తత్ " అను అక్షరపు ఉచ్చారణ ఉద్దేశ్యము.
* స -
ఈ అక్షరమునకు పాదములు . వాయువు అధిదేవత . మనుష్యుని శరీరం పంచభూతాల నుండి తయారుకాబడినది.అని శాస్త్రం చెప్పుచున్నది. ఇందు వాయుతత్వానికి సంభంధించునవి నడుచుట , పరిగెత్తుట , వంగుట మొదలైనవి . "స " అక్షరం ఉచ్చరించిన పాదములకు సంబంధించిన నరములు ఆ అక్షర ఉచ్చారణ వలన ఉద్భవించు తరంగాల మూలకంగా ఉత్తేజితం పొందును.
* వి -
ఈ అక్షరం చీలమండకు పైన ఉండు పిక్క. సూర్యుడు అధిదేవత . దేహము నందు పాదము నుంచి పైకి వచ్చునప్పుడు చీలమండకు పైభాగం ఎముక చాలా ముఖ్యమైంది. మొత్తము దేహపు భారమును ఇది మోయవలెను . ఆస్థి భూతత్వమునకు చెందినది. భూమి అనగా జగత్తు . జగత్తుకు కన్ను సూర్యుడు . ఈ సూర్యుడు అస్థి కారకుడు. ఈ శబ్ద ఉచ్చారణ వలన ఎముకలు బలపడును.
* తు -
ఈ అక్షరమునకు మోకాలు మద్యభాగం . అంతరిక్షం అధిదేవత. అంతరిక్షం అనగా శూన్యప్రదేశం . దేహంలోని మోకాలు నందు ఎటువంటి అంగములు లేవు . ఈ ప్రదేశం బలవంతం అగుటకు "తు " అక్షరాన్ని ఉచ్చారణ చేయవలెను .
* వ -
ఈ అక్షరమునకు హృదయం . యముడు అధిదేవత . యమ అనగా సంయమనం అని అర్థం . అనగా తన ఆధీనములో ఉంచుకొనుట. యమునకు ఎట్లు ధర్మాధర్మములను తన అధీనములో ఉంచుకొనగల బాధ్యత కలదో అలాగే హృదయము కూడా రక్తచలనమును తన అధీనములో ఉంచుకొనవలెను. రక్తచలనం వికృతమైన శరీరముకు వెంటనే అనారోగ్యం కలిగి అనేక ఉపద్రవములు వచ్చును. దీనిని ఆధీనములో ఉంచుకుని హృదయము సరిగ్గా తనపని చేసుకొనుటకు "వ"అక్షరమును ఉచ్చరించవలెను.
* రే -
ఈ అక్షరమునకు గుహ్యప్రదేశము . వరుణుడు అధిదేవత . దేహపు ఈ భాగమందే జలవర్గమునకు చెందిన ముఖ్యమైన అంగములు మూత్రకోశములు . జననాంగము మొదలైనవి ఉండును. ఈ అంగములు సరిగ్గా పనిచేసిన వీటికి సంబంధించిన ఎటువంటి రోగములు రావు . ఈనాడు మూత్రపిండములు , జననాంగ రోగములు ఎక్కువ అగుట గమనించగలరు . ఈ గుహ్యప్రదేశ రోగములన్నింటికీ "రే " అక్షరమును ఉచ్చరించవలెను.
ణ్య -
ఈ అక్షరమునకు వృషణము . అధిదేవత బృహస్పతి . మనుష్యుని దేహము నందు గర్భోత్పత్తికి కారణం అయిన శుక్రధాతువు వృషణము నందు ఉండు చిన్న గ్రంథుల యందు ఉత్పత్తి అగును. ఈ గ్రంథులను బలపరుచునదే ఈ అక్షరం ఉచ్చారణ ముఖ్యోద్దేశము . గర్భోత్పత్తి జరిగిన తరువాత జననమొందు శిశువు బృహస్పతి వలె అనగా దేవతల గురువువలె బుద్ధిశాలిగా ఉండవలెను అని మాతాపితల కొరిక . అందుచేత ఈ అక్షరమునకు మరియు ఈ అంగమునకు బృహస్పతి అధిదేవతగా ఉన్నారు .
* మ -
ఈ అక్షరమునకు నడుము . అధిదేవత మేఘము అధిదేవత. దేహము నడుము భాగము జలవర్గమునకు చెందినది. జఠరము , పిత్తకోశం , చిన్నప్రేగులు ,పెద్దప్రేగులు మెదలైనవి ఈ భాగమునందే ఉండును. వర్షము లేనిచో పైర్లు ఎలా పండవో అట్లే ఈ అంగములు నిర్దిష్ట ప్రమాణములో రసములు ( జలరూపము) ఉత్పత్తి సరిగ్గా జరగనిచో వాటి విధులు నిర్వర్తించలేవు . ఈ ప్రదేశమునందలి అంగములును బలవత్తరం చేయుటకు " మ" అను అక్షరమును ఉచ్చరించు ఉద్దేశం అయి ఉన్నది.
* భ -
ఈ అక్షరమునకు నాభి బొడ్డు . అధిదేవత ఇంద్రుడు . ఇంద్ర అనగా వర్షము అని అర్థం అగును. వర్షము లేనిచో మొలకెత్తిన మొక్కలు ఎలా వృక్షములు కాలేవో అలాగే తల్లిగర్బము నందలి పిండమునకు నాభి మూలకంగా ఆహారం అందును. దీనిచేత గర్భస్థ శిశువు ఆరోగ్యముగా పరిపూర్ణముగా అభివృద్ది చెందును . ఇది ప్రకృతినియమము . అందుకే ఈ ప్రదేశమునకు ఇంద్రుడు అధిదేవత .
* ర్గో -
ఈ అక్షరమునకు కడుపుభాగం . అధిదేవత గంధర్వుడు. సంగీతము గాంధర్వవిద్య . నాదము నాభి నుండి మొదలగును. అందుచేత ఈ నాభిప్రదేశమునకు కడుపుభాగమునకు గంధర్వుడు అధిదేవత . ఈ అక్షరమును ఉచ్చరించుట చేత కడుపుభాగము నందలి నరములు బలముగా తయారగును.
* దే -
ఈ అక్షరమునకు స్థనముల ప్రదేశము . అధిదేవత పూషుడు అనగా సూర్యుడు . ఎద యందు శ్వాసకోశములు , హృదయము ఉన్నవి. ఈ ప్రదేశమునకు సూర్యుడి నుంచి ఉత్పత్తి అగు కిరణములు పడిన ఇందునుండు అంగములు బలపడును. అందుచే జపము ఆచరించు సమయమున ఈ ఎద ప్రదేశమునకు సూర్యకిరణాలు తగులునట్లు చూసుకోవలెను. ఈ అక్షరమును ఉచ్చరించుట వలన ఈ ప్రదేశము నందలి అంగములు బలపడును.
* వ -
ఈ అక్షరమునకు హృదయము . అక్షర అధిదేవత . అక్షర అనగా సూర్యుడు . సూర్యుని చలనము సదాకాలములో ఎలా నడుచుచుండునో అదే రీతిగా హృదయ చలనం కూడా ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా నడుచుచుండవలెను. చలనము నిలిచిన జీవితం ముగిసిపోయినట్లే . దీనిని సదా నియంత్రించునది ఈ అక్షర ఉచ్ఛారణే ఈ సందర్భమున అంతకు ముందు చెప్పిన 5వ అక్షరం అయిన "వ" ను కూడా పరిగణలోనికి తీసికొనవలెను.
* స్య -
ఈ అక్షరమునకు కంఠము . అధిదేవత త్వష్ట . అనగా విశ్వకర్మ . బ్రహ్మ అని కూడా పిలుస్తారు . బ్రహ్మము అనగా నాదబ్రహ్మము . ఈ నాదము ( స్వరం ) కంఠము నుండి పుట్టును . కంఠము ఆరోగ్యముగా లేనిచో స్వరము బాగుగా ఉండదు. అందుచేత ఈ ప్రదేశమునకు విశ్వకర్మ అనగా బ్రహ్మ అక్షర అధిదేవత అని తెలిపినారు. ఈ కంఠమును నియంత్రించి బలవత్తరము చేయునదే "స్య " అక్షరమును ఉచ్చరించు ఉద్దేశ్యము.
* ధీ -
ఈ అక్షరమునకు ముఖము . అక్షరదేవత ఇంద్రుడు . ఇంద్రుడు స్ఫూరద్రూపి . మంచి వర్చస్సు లేక తేజస్సు ముఖము నుండి తెలియును. ముఖము నందు మంచి తేజస్సు ఉన్న అదే భాగ్యము . ఈ దృష్టితోనే యజ్ఞోపవీతము వేసుకొనునప్పుడు చెప్పు మంత్రము నందు ..........బలమస్తు తేజః అని చెప్తారు . అనగా బలమును మరియు తేజస్సును ప్రసాదించమని అర్థము. కేవలం యజ్ఞోపవీతం ధరించినంత మాత్రమునే తేజస్సు , బలం రాదు . దానికి అంగముగా గాయత్రి జపము ఆచరించవలెను. ఈ జపము నందు "ధీ " అక్షరమును ఉచ్చరించునప్పుడు ముఖము నందలి నరములపైన ఆ అక్షర తరంగముల మూలకంగా ప్రభావం పడును. దీనిచే కాలక్రమేణా మంచి తేజస్సు కలుగును. ఎప్పుడు తేజస్సు కలుగునో అప్పుడు స్ఫూరద్రూపము వచ్చి తీరును . ఇంద్రుడు ఎంత స్ఫురద్రూపియో అంత తేజస్సు ముఖము పైన వచ్చును.
* మ -
ఈ అక్షరమునకు దవడ . అధిదేవత మరుత్తులు. దవడకు మరుత్తులకు సంబంధం ఏమిటో మీకు వివరిస్తాను. మరుత్తులు ఏడు (సప్త మరుత్తులు ) పుట్టినది మొదలు ఏడు సంవత్సరాల కొకమారు దైహికముగా , మానసికముగా మానవుని శరీరము నందలి మార్పు కలుగుచుండును. ఇది ప్రకృతినియమము. శిశువు జన్మించిన 7 సంవత్సరములకు పాలపళ్ళు పోయి నిలకడ పళ్లు (Permanent Teeth ) వచ్చును. 14 సంవత్సరముల వయస్సు యుక్తవయస్సు. ఇలానే ప్రతి 7 సంవత్సరములకు ఒక ఆవృత్తముగా శారీరకం మరియు మానసికము అయిన మార్పు జరుగుచుండును. శిశువుకి 7 వ సంవత్సరం నుండే సంపూర్ణ గ్రాహ్యకశక్తి వచ్చును. ఈ దృష్టితోనే 7 వ సంవత్సరం దాటి 8 వ సంవత్సరం ప్రారంభమున ఉపనయన సంస్కారం చేయుట ఆచారము. ఇవి 7 సంవత్సరాల (సప్త ) వయస్సు గడించిన తరువాత కలుగు మార్పులు కనుక దీనికి సప్తమరుత్తులు అధిదేవత అన్నారు . అల్లాడుట ,పారాడుట మొదలగునవి మానవుని దేహము నందలి పంచభూతాలలో వాయు తత్వమునకు చెందినవి. ఈ దృష్టితో వేదాధ్యయనము , మంత్రోచ్ఛారణలు కొరకు దవడ యొక్క చలనము (కదలిక ) మంచిగా ఉండవలెను అని ఈ అంగమునకు మరుత్తులు కారణం అని తెలిపినారు . వీనిని బలముగా చేయుటయే "మ " అక్షర ఉచ్చారణ ఉద్దేశము .
* హి -
ఈ అక్షరమునకు ముక్కుకొన . అధిదేవత సోముడు (చంద్రుడు) . జపము చేయునపుడు కొనముక్కు నందు దృష్టిని కేంద్రీకరించవలెను. దీనితో కనుగుడ్లకు , కన్నులకు సంబంధించిన నరములకు మంచి వ్యాయామం జరిగి చంద్రుడి వంటి నేత్రములు కలిగి నేత్రసంబంధమైన ఎటువంటి దోషములు కలగవు. దృష్టి బాగుండును. ఈ దృష్టితో ఈ అంగమునకు చంద్రుని అధిదేవతగా చెప్పినారు . ఈ "హి " అక్షరమును ఉచ్చరించిన నేత్రసంబంధ నరములు ఉత్తేజితం పొందును.
గాయత్రి మంత్ర జపము గురించి సంపూర్ణ వివరణ - 7 .
* ధి -
ఈ అక్షరం కన్నులకు సంబంధించినది . అధిదేవత అంగీరసుడు . అంగీరసుడు అనగా అగ్ని. కంటి దృష్టి యందు మంచి , చెడు రెండూ ఉంటాయి. మనిషి యొక్క నేత్రము నుండి కనపడని అగ్నికిరణాలు బహిర్గతం అగును. ఈ అగ్నిని బలవత్తరముగా చేయుటకు , దీనితో చెడు పరిణామాలు కలగకుండా ఉండుటకు దీనికి సంబంధించిన నరములు బలపడుటకు " ధి " అక్షర ఉచ్చారణ ఉపయోగపడును.
* యో -
ఈ అక్షరం కనుబొమ్మల మధ్యన ఉండు స్థలం . దీనికి అధిపతి విశ్వదేవుడు . కనుబొమ్మల మధ్యన ఉండు స్థలమును ఆజ్ఞాచక్రం అని అందురు. ఇది జ్ఞాపకశక్తికి కారణమైన నరములకు కేంద్రము . సకల విద్యలను , భూతభవిష్యత్తులను జ్ఞాపకం చేయుటకు సహాయపడు నరములు ఇక్కడి నుండియే తల వెనుక భాగమునకు పోయి అక్కడ గ్రంథస్థం ( Storage ) కాబడును. అందుకే ఈ స్థానమును విశ్వదేవుడు అనినారు. ఈ దృష్టితోనే ప్రతిదినం ఈ ప్రదేశములోని నరముల ఉత్తేజితం చెందించుట కొరకు గంధము , విభూతి మొదలగునవి ధరిస్తారు . ఈ నరముల ఉత్తేజితం కొరకు " యో " అక్షరాన్ని ఉచ్చరించవలెను.
* యో -
ఈ అక్షరమునకు నెత్తి . అధిష్టానదేవత అశ్వి దేవతలు . ఒక సారి యో అక్షరమును ఉచ్చరించిన తరువాత మరలా అదే అక్షరమును ఉచ్చరించు ఉద్దేశము నెత్తి పై భాగమున రాచుకొనిపోవు నరములను ఉద్రేకింపచేయుటయే అనగా ఆ నరములకు బలాన్ని చేకూర్చుటయే . అశ్వి దేవతలు ఈ అక్షరమునకు అధిదేవతగా ఉన్నారు . నెత్తి ఎల్లప్పుడూ చల్లగా , శాంతముగా ఉండవలెను . ఔషధములకు అధిపతులే ఈ అశ్విని దేవతలు . ఈ ప్రదేశము నందలి నరములను ఉత్తేజితం చేయుటకు " యో " అక్షర ఉచ్చారణ వలన శక్తిమంతం అగును.
* నః -
ఈ అక్షరమునకు ముఖము ముందరి భాగము . అక్షర అధిపతి ప్రజాపతి. ప్రజాపతి అనగా బ్రహ్మ. ముఖం నందు బ్రహ్మ తేజస్సు రావలెను. ఈ తేజస్సుని పొందుటకు ఈ అక్షర ఉచ్చారణ సహాయకారి అగును.
* ప్ర -
ఈ అక్షరమునకు ముఖము వెనకభాగము . అక్షర అధిపతి సర్వదేవుడు . శరీరము నందలి వ్యాపించి ఉన్న అన్ని నరములకు ఈ స్థలమే ముఖ్యకేంద్రము . ఇక్కడి నుండి నరములు ప్రాకి శరీరం నందలి అన్ని భాగాలకు వ్యాపించును . అందుచేతనే సర్వదేవుడు అని పిలిచెదరు.ఈ నరముల ముఖ్యకేంద్రమును ఉద్రేకింపచేయునదియే ఈ అక్షర ఉచ్చారణ ఉద్దేశము.
* చో -
తలయొక్క పశ్చిమ భాగము . రుద్రుడు అధిదేవత . తలయొక్క జ్ఞానకేంద్రము . భూత,భవిష్యత్తుల సర్వ జ్ఞాపకాలకు ఇది కేంద్రము . ఈ భాగమునకు ఎట్టి పరిస్థితులలోను దెబ్బ తగలనివ్వరాదు . ఈ భాగము నందు వెంట్రుకలను తీసివేయకూడదు. అందుకే ఆ భాగమునందు వెంట్రుకలను "శిఖ" అంటారు. దీనికి రుద్ర శిఖ అని మరొక్క పేరు కూడా కలదు. ఈ భాగము నందలి నరములను ఉద్రేకింపచేసి బలమును ఒనగూర్చి రక్షణ కల్పించుటకు " చో " అక్షర ఉచ్చారణ ఎంతో ముఖ్యము.
* ద -
తల యొక్క ఉత్తర భాగము. ఈ అక్షరానికి బ్రహ్మ అధిదేవత . కపాలం అని కూడా అంటారు. మెదడు యొక్క ముఖ్యమైన , సూక్ష్మమైన భాగము. ఈ భాగమునకు దెబ్బ తగిలిన చాలా కష్టం. సృష్టికి కారకుడు బ్రహ్మ . మెదడు నుండి సృష్టి అగు బుద్ది మొదలగువానికి ఇది కేంద్రస్థానము . అందుచేత దీనికి బ్రహ్మ కపాలం అని పేరు వచ్చినది. దీనికి బలవత్తరం చేయుటకు "ద " అక్షరాన్ని ఉచ్చరించవలెను.
* యాత్ -
ఈ అక్షరమునకు తల పై భాగము. అధిదేవత విష్ణువు . ఈ భాగమును బ్రమ్మాండం అని పేరు . మానవుని దేహము నందు విద్యుత్ ని ఉత్పాదన చేసి విసర్జన చేయు అతి ముఖ్యమైన కేంద్రం (దాదాపు 1300 గ్రాముల బరువు కలిగిన మానవుని మెదడు దాదాపు 20 వాట్ల విద్యుత్ శక్తిని వెలువరించును.) ఈ ఉత్పాదన , విసర్జన కార్యక్రమం ఎల్లప్పుడూ సక్రమంగా జరుగుచున్నప్పుడే దేహము నందలి అంగములు ఒకే విధముగా సక్రమముగా పనిచేయును . దీనికి స్థితి అని పిలుస్తారు . స్థితికి విష్ణువు కారకుడు. ఈ ప్రపంచపు స్థితికి విష్ణువు ఎలా కారకుడో అదేవిధముగా దేహపు స్థితికి కూడా విష్ణువే కారకుడు. అందుచేతనే దీనిని విష్ణువు స్థానం అన్నారు . ఈ భాగమును బలవత్తరం చేయుటకు " యాత్ " అక్షర ఉచ్చారణ ముఖ్యమైనది .
గాయత్రి మంత్రపు 24 అక్షరముల ఉచ్చారణతో ఈ విధముగా దేహము నందలి ముఖ్య ఆవశ్యకములు అయిన 24 అంగములు బలమును పొందుదును. మనము ప్రతినిత్యం ఎలా ఆహారాన్ని సేవిస్తున్నామో అలానే ఈ 24 అంగములను ప్రతినిత్యం బలపడునట్లు చేయుచుండవలెను. ఇలా బలపడినచో ఈ అంగములు ఒక నిర్దిష్టమైన స్థితికి వచ్చును. అప్పుడు మానవుడు తన ఇంద్రియములను తన ఆధీనంలోకి తెచ్చుకోగల సమర్ధుడు అగును. అప్పుడు ఆ మానవుడికి అతీంద్రియ శక్తి వచ్చును. గాయత్రి మంత్రము చతుర్వేదముల కన్నా మిన్న అని బ్రహ్మ దేవుడు చెప్పాడు .
నేటితో గాయత్రి మంత్ర జప మహిమ సమాప్తం అయినది. తరవాతి రోజుల్లో మరిన్ని గొప్ప విషయాలు , ప్రాచీన భారత రహస్యాలు మీ ముందుకు తీసుకుని వస్తాను. నేను రాసిన గ్రంథాలలో కూడా ఎన్నో ఆయుర్వేద రహస్యాలు మరెన్నో విజ్ఞాన సంబంధమైన విశేషాలు మీకు ఎక్కడా దొరకనివి సంపూర్ణ వివరణతో ఇచ్చాను.
No comments:
Post a Comment