Friday, January 31, 2020

🌷పంచామృత రహస్యం, విశిష్టత , ప్రయోజనాలు. panchamruth

..

హిందూ సంస్కృతి ఆచారాల ప్రకారం.. ఏ శుభకార్యం వచ్చినా.. ఆ కార్యములో పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము.ఏ శుభకార్యం చేయవలసి వచ్చినా పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వచ్చినా పంచామృతం వుంటుంది.

మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదంతోబాటు తీర్ధంగా కొబ్బరినీళ్ళు ఇస్తారు. వీటితో పాటు కొన్నిసార్లు పంచామృతాన్ని కూడా ఇస్తారు. కొన్ని దోషాల నివృత్తి కోసం పంచామృతంతో అభిషేకాన్ని సూచిస్తారు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దాన్ని బట్టే పంచామృతం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

శబరిమల అయ్యప్ప స్వామికి, పరమేశ్వరుడికి పంచామృ తాలతో అభిషేకం చాలా ప్రీతికరం అందుకే శివుడును అభిషేకప్రియుడు అని అంటుంటారు.
కొన్ని దోషాలకు నివారణగా పరమేశ్వరుడుకి రుద్రాభిషేకం, పంచామృ తముతో అభిషేకాన్ని సూచిస్తారు జ్యోతిష్యలు, పండితులు. దాన్ని బట్టే పంచామృతం ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు. పంచామృత తీర్థం తీసుకుంటే మనం అనుకున్న పనులు అఖండంగా పూర్తి అవుతుంది.
 మరియు బ్రహ్మలోకం ప్రాప్తించును.

🕉️పంచామృతం అంటే ఏమిటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
పంచామృతం అంటే….
పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ అయిదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు. ఇక్కడ పాలు అంటే ఆవుపాలు అని అర్థం. పెరుగు, స్వచ్చమైన నెయ్యి, తేనె, చక్కెరలను ఆవుపాలలో కలుపుతారు. 
భక్తి పరమైన విషయాలను పక్కన పెడితే ఈ అయిదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి! అది ఎలాగో ప్రస్తుత వైద్య విజ్ఞానం ప్రకారమే చూద్దాం!

🍁ఆవు పాలు
ఆవును గోమాత అన్నారు. ఎందుకంటే, ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి. శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గేదెపాలకు మల్లేనే ఆవు పాలలో కూడా కాల్షియం అత్యధికంగా వుంటుంది. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
పాలు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలు ఎక్కువగా తాగటం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో విటమిన్ ‘ఎ’ కూడా పుష్కలంగా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.

🍁పెరుగు
పెరుగులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పెగుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణ తత్వం వున్నవారికి పెరుగు అత్యధ్బుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది.
కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది. ఉదయం పూట పెరుగు తినటం ఆరోగ్యదాయకం. మన పూర్వీకులు పెరుగుతో అన్నం తిని పొలం పనులకు వెళ్ళేవారు. ఉదయం పూట గుడికి వెళ్ళి పెరుగుతో పంచామృతం తీసుకోవటం ఈ విధంగా చూసినా మంచిదే!

🍁నెయ్యి
మేధాశక్తిని పెంచటంలో నేతిని మించింది లేదు. ఆయుర్వేదం ప్రకారం నేతితో తయారైన అరిసెల్లాంటి పదార్థాలు, నెయ్యితో వేయించిన జీడిపప్పు తదితర ఆహారపదార్థాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి.
దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో ‘ఎ’ విటమిన్ వుంటుంది.

🍁తేనె
వేల సంవత్సరాల నుంచీ కూడా తేనెను పోషకాహారంగా ఉపయోగిస్తున్నారు. తేనె రుచిగా ఉండటము, మంచి పోషకాహారం కావడమే కాదు, ఇది ఒకరకంగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. తేనె సూక్ష్మ క్రిములతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. తేనె ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. 
తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది. ఇకపోతే, పంచదార శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

🍁పంచదార
ఇన్ని సుగుణాలున్న పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలయికతో రూపొందించిన పంచామృతం శరీరానికి ఎంత మేలు చేస్తుందో దీన్ని బట్టే అర్థమవుతోంది. కనుక ప్రసాదం రూపంలో తీసుకునే పంచామృతం ఎంతో మేలు చేస్తుంది.

వీటన్నిటి కలియికతో చేసిన ఈ పంచామృతం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏

రధసప్తమి విశేషాలు - సంపూర్ణ వివరణ . radhasaptami


       మకర సంక్రమణం తరువాత ఉత్తరాయణంలో సూర్యుని గమనంలో వస్తున్న మార్పును సూచించే ఖగోళ శాస్త్ర పరిశోధన విషయానికి సంబంధించిన అంశాన్ని తెలియచేసేదే ఈ పండగ. సూర్యుని సప్తాశ్వరధం.(VIBGYOR) voilet ఊదారంగు , indigo లేతనీలం , Blue నీలము , Green ఆకుపచ్చ , Yellow పసుపు పచ్చ , Orange నారింజ , Red ఎరుపు . ఈ ఏడురంగులను పౌరాణికంగా సూచిస్తూ "సప్తాశ్వ" ఏడు గుఱ్ఱములని అలంకారికంగా మన పూర్వికులు వర్ణించారు. వైజ్ఞానిక పరిశోధనాంశాలను సామాన్యులు కూడా తెలుసుకునేట్లు చేయడమే ఇట్లా వర్ణించడంలో ఔచిత్యం . ఈ పండగ రోజున అభ్యంగన స్నానం చేయాలి . ఆ స్నానంలో జిల్లేడు ఆకులను , తలమీద మోకాళ్ల మీద పెట్టుకుని స్నానం చేయాలని ఆచారం చెప్తుంది . 

    " అభ్యంగ మాచరేన్నిత్యం స జరాశ్రమ వాతహా " అని వైద్యశాస్త్రం చెబుతుంది. శరీరానికి నువ్వులనూనె రాసుకుని స్నానం చేయడం అభ్యంగనస్నానం అంటారు. ఈ అభ్యంగనాన్ని ప్రతిరోజు చేయాలని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ముఖ్యంగా ముసలితనం , అలసట , వాతవ్యాధులు ఇవి దూరం అవుతాయి. శిశిర ఋతువులో కూడా చలి ఎక్కువుగా ఉండటం వలన వాతాహర ద్రవ్యములచేత కషాయం కాయిచుకొని అభ్యంగానంతరం స్నానం చేయవలెను అని ఆచారంగా నిర్దేశించబడినది. అర్క ( జిల్లేడు) వాతాన్ని హరించు శక్తి కలిగినది . ఇది ఉష్ణవీర్యం కలిగి ఉండటం వలన చలికాలం వలన వచ్చే బాధల నుండి రక్షణ కలిగించును. దీని యొక్క స్పర్శ చేత ముఖ్యముగా కీళ్లనొప్పులు , వాత వేదనలు , చర్మరోగములు నశించును. కావున అందుబాటులో ఉండే దీని ఆకులను ముఖ్యమగు సంధుల పైన ( భుజములు , మోకాళ్ళు ) మరియు శిరస్సు పైన ఉంచుకుని స్నానం చేయాలని శాస్త్రం చెప్తుంది . 

                సూర్యునికి ఉన్నపేరు "అర్క" జిల్లెడు చెట్టుకు కూడా సమన్వయిస్తుంది. సూర్యగమనానికి సంబంధించిన పండుగ రోజున అర్క ( సూర్య) పత్రాన్ని స్నానంలో ఉపయోగించుటం ఔచిత్యాన్ని సూచిస్తుంది. జిల్లేడు చెట్టుని " ఉపవిషము" గా చెప్పబడినది. కనుక దీని విషప్రభావమునకు విరుగుడుగా నీలియాకు అని తెలుపబడినది. అలాగే చంచలాకు కూడా విరుగుడిగా పనిచేయును . ఈ ఆకులలో ఏదేని ఒక ఆకు రసం పూయవలెను లేదా తినిపించవలెను. 

పంటి నొప్పి‌ teethache

  దంతాలను నియమంగా శుభ్రం చేసుకోక పోవడం , ఆజీర్తి , వాయు ప్రకోపము వలన మరియు భోజనం చేసిన తర్వాత అన్నం మొతుకులు దంతాల మధ్యన వుండి పోవడం , ఎక్కువగా ICE CREAM తినడం వలన కూడా పంటి నొప్పి వస్తుంది .

గృహ చికిత్సలు.........

1 . అల్లం రసం + తులసి ఆకుల రసం లను సమ పాళ్ళలో కలిపి , నొప్పి వున్నచోట పూయండి .

2 . 1 గ్లాసు నీళ్ళలో + ఇంగువ  కలిపి , నీళ్ళను కొద్ది కొద్ది గా నోటిలో వేసుకొని , నోటిలో బాగా త్రిప్పి ఉమ్మి వేయండి .

3 . 1 చిటికెడు నల్ల ఉప్పు + ఆవాల నూనె ( Mustard oil ) తో కలిపి , నొప్పి వున్న చోట Rub చెయ్యండి . 25 నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో పుక్కిళించండి .

4 . పసుపు + ఆవాల నూనెతో కలిపి నొప్పి వున్న పంటి పైన Rab చెయ్యండి . వెంటనే పంటి నొప్పి తగ్గి పోతుంది .

5.  బెల్లం ( Jaggery ) + 1 గ్లాసు నీళ్ళలో మరిగించి , ఆ నీళ్ళను నోటిలో వేసుకొని పుక్కిళించ వలెను .

6 . పొగాకు ఆకు పొడి +  నల్ల మిరియాల పొడులను సమ పాళ్ళలో కలిపి ఒక చూర్ణంగా చెయ్యండి . ఈ చూర్ణంని పళ్ళ పొడి గా వాడండి .

7 . నల్ల ఉప్పు + ఆవాల నూనెలో కలిపి చిగుళ్ళ పైన రుద్దండి . చిగుళ్ళు గట్టి పడతాయి .

8 .చెంప పళ్ళు నొప్పిగా ఉన్నప్పుడు  , అల్లము ముక్కకు నల్ల ఉప్పును కలిపి , నోటిలో పెట్టుకొని చప్పరించాలి . నొప్పి తగ్గి పోవును .

9 . పుదీన ఆకులను ఒక గ్లాసు నీళ్ళలో మరిగించి , నోటిలో వేసుకొని పుక్కళించండి .

10 . ఉల్లి పాయ ( Onion ) రసాన్ని చిగుళ్ళ పైన రుద్దండి . చిగుళ్ళు గట్టి పడతాయి .

11 . పటిక ( Alum ) ను నీళ్ళలో కలపండి . ఈ నీళ్ళను నోటీలో వేసుకొని పుక్కళించండి . చిగుళ్ళ నుండి కారే రక్తం తగ్గును . చిగుళ్ళు , దంతాలు గట్టి పడును .

12 .క్రమంగా ముల్లంగి తినడం వలన , దంతాలు మరియు చిగుళ్ళు గట్టి పడును .

  పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

       శ్రీ రాజీవ్ దీక్షిత్

అత్తిపండు గురించి సంపూర్ణ వివరణ - attipandu

అత్తిపండు గురించి సంపూర్ణ వివరణ -

    అత్తిపండు విలక్షణమైనది. అత్తిపండు పచ్చిగా ఉన్నప్పుడు తినవచ్చు . పచ్చిది త్వరగా కుళ్లిపోవును . ఈ పచ్చి అత్తిపండును గుండ్రని బిళ్లలుగా తురిమి ఎండబెడతారు. ఈ బిళ్ళలు చాలాకాలం నిలువ ఉంటాయి. అందుకే అత్తిపండును ఎండుఫలంగా పరిగణిస్తారు. అత్తిపండులో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఈ పిండిపదార్థం ఫలచక్కెర రూపంలో ఉండి త్వరగా జీర్ణం అయ్యి శరీరానికి వంటబట్టి శక్తి చేకూరును .

 100 గ్రాముల అత్తిపండులో ఉండే పోషక విలువలు  -

 * పిండిపదార్ధాలు  - 17.1 గ్రా .

 * కొవ్వుపదార్దాలు - 0.2 గ్రా .

 *  మాంసకృత్తులు  - 1.3 గ్రా .

 *  క్యాల్షియం  - 60 మి . గ్రా .

 *  భాస్వరం  - 30 గ్రా .

 *  మెగ్నిషియం - 20 మి . గ్రా .

 *  ఇనుము  - 1.2 గ్రా .

 *  సోడియం - 2 మి.గ్రా .

 *  పొటాషియం - 190 గ్రా .

 *  పీచుపదార్థం  - 2.2 గ్రా .

 ఔషధోపయొగములు  -

 * పీచు పదార్థం ఎక్కువుగా ఉండటం వలన మలబద్దకం నివారిస్తుంది.

 *  వాతనొప్పులు , చర్మవ్యాధులు , పిత్తాశయ , మూత్రాశయ రాళ్లు , కాలేయం వాపు , తెల్లబట్ట మొదలగు వ్యాధులను నయంచేస్తుంది .

 *  అంజీరపండ్లు తేనెతో కలిపి తీసుకుంటే కాలేయం గట్టిపడే సమస్య , చిన్నగా అవ్వడం , కామెర్ల వ్యాధిని నయం చేస్తుంది .

 *  అతి తక్కువ క్యాలరీలు ఉన్నపండు కూడా అత్తిపండు మాత్రమే .

ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం -2

 ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టుగా సూక్ష్మక్రిములను కనుగొన్నది పాశ్చత్య శాస్త్రజ్ఞులు మాత్రం కాదు.  వారికంటే కొన్ని వేల సంవత్సరాల మునుపే మన పూర్వీకులకు సూక్ష్మక్రిముల పైన మరియు అవి కలుగచేసే వ్యాధుల పైన సంపూర్ణ అవగాహన కలదు. ఈ విషయాల గురించి నేను తెలుసుకొవడానికి కొన్ని అత్యంత పురాతన ఆయుర్వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు వాటిలో కొన్ని చోట్ల ఈ సూక్ష్మక్రిమి సంబంధమైన అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విలువైన సమాచారాన్ని మీకు కూడా తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .

         సుశ్రుతునకు సూక్ష్మక్రిములుకు సంబంధించిన పరిజ్ఞానం అపారంగా ఉన్నది అని చెప్పవచ్చు. రోగానికి కారణం అయ్యే సూక్ష్మక్రిములను గురించిన జ్ఞానమునకు "భూతవిద్య " అని పేరుకలదు . అష్టాంగహృదయములో ఇది ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినది. భూతవిద్యా లక్షణమును చెప్పునప్పుడు దేవాసుర , గంధర్వ , యక్ష , రక్ష , పితృ , పిశాచ , నాగ అనే భూత గ్రహాలుగా సూక్ష్మజీవులను వర్ణించాడు. కొన్ని మంత్రగ్రంధాలలో పైన చెప్పిన పేర్లు కలవారు వేరే లోకమునకు సంభంధించినవారుగా దుష్టశక్తులుగా వర్ణించి వారు మానవులను పట్టి పీడించువారుగా ఉన్నది. కాని సుశృతుడు దీనికి ఒప్పుకోడు వారు దేవాసుర , గంధర్వులు ద్యులోక వాసులు వారు భూలోకమునకు వచ్చి మనుష్యులతో కలిసి ఎన్నటికీ నివసించరు అని ఆయన అభిప్రాయం .

       సుశ్రుతుడు సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వాటిని గ్రహములగా పిలుస్తూ ఈ విధముగా చెప్పుచున్నాడు. కోట్లకొలది అసంఖ్యాకముగా ఉన్న ఈ గ్రహములు రక్తము , మాంసములను భుజించి వృద్ది అగుచుండెను . అవి మహాపరాక్రమము కలిగినవి. అయినను అవి సూర్యుని వెలుగుకు జడిసి రాత్రుల యందు సంచరించుచుండును . చీకటి , నీడగల తావుల యందు పగలంతా ఉండును. ఈ సూక్ష్మక్రిములు నేలమీదను , అంతరిక్షము నందు , అన్ని దిక్కుల లోను పాడిపడిన చీకటి గృహముల యందు నివాసము ఉండును. ఈ సూక్ష్మక్రిములు ఒకొక్క కాలము నందు విజృంభించి జనులను పీడించునని సుశృతుడు తెలియచేసెను .

         వ్రణసంబంధ ఇన్ఫెక్షన్స్ గురించి సుశృతుడు వివరించుతూ ఈ సూక్ష్మక్రిములకు మాంస , రక్తం ప్రియం అగుటచేత గాయములలోకి తరచుగా ప్రవేశించి సమస్యలను కలుగచేయునని తెలుపుతూ ఈ రోగకారణమగు సూక్ష్మక్రిములను మూడు ప్రధాన గణములుగా గుర్తించారు.

ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం -2

    అంతకు ముందు పోస్టులో సూక్ష్మక్రిములు పైన సుశృతుడు యొక్క అభిప్రాయాలు మీకు తెలియచేశాను. ఇప్పుడు సుశృతుడు రోగహేతుకారణాలైన సూక్ష్మజీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి మీకు వివరిస్తాను.  అవి

 1 -  పశుపతి అనుచరులు .

 2 -  కుబేర అనుచరులు .

 3 -  కుమార అనుచరులు .

 *  పశుపతి అనుచరులు  -

      మనస్సు , ఇంద్రియములను వికలమొనర్చి  భ్రమ , ప్రలాప , ఉన్మాదములను కలిగించును.

 *  కుబేర అనుచరులు  -

       ఇవి యక్షరక్షో గణములకు చెందిన క్రిములు . శారీరక బాధలను మాత్రమే కలిగించును.

 *  కుమార అనుచరులు  -

       పసిపిల్లలను వశపరుచుకొని బాధించును . వీటినే బాలగ్రహములుగా పిలుస్తారు .

         పైన చెప్పినవిధముగా సుశ్రుతుల వారు సూక్ష్మక్రిములను మూడు రకాలుగా వర్గీకరించారు . మలేరియా జ్వరమునకు రురుజ్వరం అని తక్ష్మ జ్వరం అనియు అధర్వణవేదములో వ్యవహరించబడినది. ఈ జ్వరమును కలిగించే సూక్ష్మక్రిములు ఉండు నివాసస్థలము గురించి చెప్పుతూ  గుడ్లగూబ , గబ్బిలము , కుక్క , తోడేలు , డేగ , గద్ద  ఈ జంతుపక్షి శరీరాల్లో మలేరియా క్రిములు ఎల్లప్పుడూ ఉండి వాటి మలముతో బయటకి వచ్చి జనులు తాగే నీటిలో కలిసి మనుష్యులకు సంక్రమించునని ఉన్నది.

           ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కొన్నింటిలో ఈ విధముగా ఉన్నది. క్రిములు శరీరం నందు ప్రవేశించినంత మాత్రాన రోగము రాదు . శరీరము నందు ఓజస్సు మిక్కిలిగా అభివృద్ధిచెందిన ఊర్జశక్తి అన్ని రకముల క్రిములను జయించుచున్నది. ఇక్కడ మనశరీరములోని రోగనిరోధక శక్తి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. శరీరానికి హితమైన ఆహారం సేవించకుండా విరుద్ద ఆహారాలను సేవించువారికి , ప్రకృతివిరుద్ధ నియమాలు పాటించువారికి క్రిములు బాధించును గాని  అగ్నిదీప్తి చక్కగా ఉండి యవ్వనంలో ఉన్నవారికి , స్నిగ్ధ శరీరులకు , వ్యాయమం చేయుచుండువారికి , శరీరబలం అధికంగా ఉన్నవారికి క్రిములు ఏమి చేయలేవు .

               క్రీ . శ 18 వ శతాబ్దములో మైక్రోస్కోప్ యంత్రము కనిపెట్టబడిన పిమ్మట సూక్ష్మజీవులను కనుగొన్నారు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుతున్నాం .కాని కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు ఈ సూక్ష్మక్రిమి విజ్ఞానం సంపాదించారు. మన మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు వారు తమ మనోనేత్రముతో అన్నింటిని దర్శించగలరు మరియు కనుగొనగలరు. మైక్రోస్కోప్ గురించి దానికి పాశ్చాత్యులు కనుగొన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం కాని అధర్వణవేదము నాలుగోవ కాండ ఇరవైవ సూక్తములో పిశాచక్షయ మంత్రములో మైక్రోస్కోప్ వంటి "బిబిర్హిని " అను ఒక దివ్య ఔషధి లభించినట్టు కశ్యప మహాముని ఈ ఔషదీ సహయముతో భూమి మరియు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న సర్వరోగ క్రిములను చూడగలిగెను అని ఈ మంత్రం చెప్పుచున్నది. క్రీ .శ  మూడొవ శతాబ్దములో బింబసారుని ఆస్థాన వైద్యుడు అయిన జీవకునికి ఇట్టి మహత్తర ఔషధి లభించెనని గ్రంధస్థం చేయబడి ఉన్నది. దీని సహాయముతో నేటి ఎక్సరే యంత్రము వలే శరీర అంతర్భాగము నందలి శరీరభాగాలను చూస్తూ పేగులలో చిక్కుకున్న రాళ్లను తీసివేశారు అని ఎన్నో పురాతన గ్రంథాలలో కలదు.

                           సమాప్తం

ఆయుర్వేదం నందు వ్యాధుల పేర్లు - వాటి లక్షణాలు . some disease names as per ayurveda

ఆయుర్వేదం నందు వ్యాధుల పేర్లు - వాటి లక్షణాలు .

 * అండవాతము - అండవృద్ధి  - Hydrocele .

      వృషణములలో రెండుగాని ఒకటికాని వాపు కలిగి ఉండుట పోటు కలిగియుండుట . వాత ప్రకోపం చేత పొత్తికడుపులో చెడునీరు పుట్టి అది క్రమముగా వృషణాలలోకి దిగి పెరిగెడి రోగం .

 *  అంతర్వ్రుద్ధి  - Hernia .

      వాతమును ప్రకోపింపచేయు పదార్దాలు అధికంగా భుజించుట వలన , మలమూత్ర వేగమును నిరోధించుట వలన , అతి బరువు మోయుట వలన వాతం ఎక్కువ అయ్యి సన్నపేగులో ఒక భాగం సంకోచింపచేసి తన స్థానం నుండి క్రిందికి వెడలి గజ్జ యందు చేరి గ్రంథిగా రూపం పొంది వాపును కలిగించు రోగం

 *  అగ్నిమాంద్యం -

        జఠరాగ్ని మందం అయ్యి ఆకలి లేకుండా ఉండుట .

 *  అతిమూత్రము  -

         శరీరంలో మేహం అధికం అయ్యి మూత్రం విస్తారంగా పొయ్యే రోగం .

 *  అతిసారం  -

        అమితముగా , వికృతముగా విరేచనములు అయ్యే రోగం .

 * అనాహం  -

         మూత్రం బంధించబడి కడుపు ఉబ్బే రోగము .

 *  అపస్మారం  -  Hysteria .

        స్మృతి లేక నోటి వెంట నురుగు పడటం మొదలగు చిహ్నాలు గల రోగం . మరియు స్త్రీలకు వచ్చెడి కాకిసోమాల అనే మూర్ఛరోగం .

 *  అభిఘాత జ్వరం  -

       కర్రలు , రాళ్లు మొదలగు వాటితో దెబ్బలు తగులుట చేత , మన శరీర సామర్ధ్యం కంటే అధికంగా పనిచేయుట వలన , అతిగా దూరం నడుచుట వలన వచ్చెడి జ్వరం .

 *  అశ్మరీ రోగం  - Blader Stones .

       మూత్రకోశము నందు రాళ్లు పుట్టుట వలన మూత్రము వెడలుట కష్టం అగు రోగము

 *  అస్థిగత జ్వరం  -

        శరీరం నందు ఎల్లప్పుడూ ఉంటూ దేహమును క్షీణింపజేయు జ్వరం.

 *  అస్రుగ్ధము  -  లeucorrhoea .

       కుసుమరోగము అని కూడా అంటారు . యోని వెంట తెల్లగానైనా , ఎర్రగానైనా , పచ్చగానైనా , నల్లగానైనా జిగటగా నీరు స్రవించెడి రోగము .

 *  ఆమము  -

        భుజించెడి పదార్దాలు జీర్ణముగాని కారణంబున గర్భమున జిగురు కలిగి తెల్లగా , బిళ్లలుగా ఘనీభవించెడి దుష్ట జలము.

 *  ఆమాతిసారము - Dysentery .

       ఆమమే విరేచనమయ్యే రోగము . దీనినే జిగట విరేచనాలు అని , ఆమ విరేచనాలు అని అంటారు.

 *  ఆర్శరోగము  - PIలES .

       మూలవ్యాధి అని అంటారు. గుద స్థానం న లోపల కాని , వెలుపల గాని మాంసపు మొలకలు జనియించి రక్తము స్రవించుచు గాని స్రవించక గాని నొప్పిని కలిగించు రోగము .

  *  ఆహిక జ్వరం  -  Intermittent fever .

        దినము విడిచి దినము లేక మూడు దినములకు ఒకసారి కాని అప్పుడప్పుడు కనిపించే జ్వరం .

  *  ఉదర రోగము - Ascites .

        శరీరం కృశించుట , తెల్లబారుట , కడుపులో దుష్టపు నీరు చేరి ఉదరము పెరుగుట మొదలగు చిహ్నములు గల రోగము

  *  ఊపిరిగొట్టు నొప్పి -

         గాలి విడిచినప్పుడు గుండెలలో ఒకపక్క పోటు పొడిచినట్టు లేచేడి నొప్పి .

 *  ఎరుగు వాతము  -

         కాళ్ళు , చేతులు మొదలగు అవయవములు గాని  దేహము అంతయు గాని ఎగురుచుండెడి ఒక విధమైన వాత రోగము .

 *  కరపాణి కురుపులు  -

        బిడ్డల యెక్క కాళ్ళమీద , చేతుల మీద దట్టముగా అయ్యేడి కురుపులు .

 *  కామిల రోగము - కామెర్లు - Jaundice .

      కండ్లు , శరీరం , ఆకుపచ్చ లేక పసుపుపచ్చ వర్ణము కలిగి ఆకలి లేకుండా ఉండుట , దాహము , నీరసము మొదలగు లక్షణాలు కలిగి ఉండే రోగము .

 *  కార్శ రోగము -  Emaciation

       దేహము నందు ఉండేడి రక్తమాంసములు క్రమక్రమముగా క్షీణించుచూ వుండేడి ఒక రోగము దీనిని ఎండురోగం అని అంటారు.

 *  క్రిమి రోగము  -  Intestinal woms .

        గర్భమున క్రిములు జనించెడి రోగము .

 *  గండమాల  -  Goitre or Scrofuja .

        మెడ , మెడ వెనక నరము , మెడ పక్కలనుండి గ్రంధులుగా మొదలు అయ్యి క్రమముగా పక్వము అయ్యి చీము , రసి స్రవించెడి వ్రణములు అనగా గడ్డలు .

 *  గళ గ్రహము  -

         స్వరహీనంబై ఆహారాది పదార్ధాలను సులభముగా కంఠం దిగనివ్వకుండా ఉండేడి ఒక శ్లేష్మ రోగము .

 *  గాయపు సంధి - Tetanus .

        కాలి బ్రొటనవేలుకు గాని , చేతి బ్రొటనవేలుకు గాని గాయము తగిలినప్పుడు ,శస్త్ర చికిత్సల యందు దుష్ట క్రిమి ప్రవేశించుట చేత మెడ కొంకులు కుంచించుకు పోయే రోగము .

 *  గాలి బిళ్లలు - Mumps .

         చెవులకు క్రిందుగా వాపు , పోటుతో లేచేడి బిళ్లలు .

 *  గురదాలు -  Kidneys .

        వీటిని ఉలవకాయలు అందురు. ఇవి నడుముకి సమముగా లొపల వెన్నునంటి ఉండేడు మాంస గ్రంధులు. వీనివలన మూత్రము జనించును.

 *  గుల్మము - internel Tumors .

        వాత , పిత్త , శ్లేష్మముల దుష్ట స్థితి వలన గర్భము న జనించెడి ద్రవకూటమి .

 *  గ్రహణి  - Dysentry .

        కడుపునొప్పి , ఆసనము తీపు కలిగి చీము లేక చీము రక్తము మిశ్రమమై విరేచనములు అయ్యేడి ఒకరకం అయిన అతిసార రోగము .

  *  చర్ది రోగము - trendency to vomit .

       వమన రోగము అని అంటారు. వాంతులు ఎక్కువుగా అవుతాయి .

 *  చర్మ రోగము  -

       గజ్జి , చిడుము , పొక్కులు , తామర మొదలగు రోగములు .

 *  చిట్ల ఫిరంగి  - a severe kind of syphilis .

        దేహమున నల్లగా స్ఫోటకపు పొక్కుల వలే బయలుదేరేడి సవాయి రోగము .

 *  జలోదరము -  Abdomanal dropsy or Ascitis .

        గర్భమున అమితముగా విషపు నీరు పెరిగి పొట్ట నిండు కుండలా ఉండేడి రోగము .

 *  జిహ్వదోషము  - Tongue diesease .

       నాలుక ద్రవహీనం అయ్యి ముండ్ల వలే గరుకు కలిగి యే వస్తువు రుచింపకుండా ఉండుట .

 *  త్రయాహికా జ్వరం - Tertain fever .

       మూడు దినములకు ఒకసారి వచ్చెడి చలి జ్వరం .

 *  నాడి వ్రణము  - Guinea worm .

        నారీ కురుపులు అనికూడా అంటారు.వీని నుండి తెల్లని దారము వలే నారి బయటకి వెళ్ళును.

 *  పరిణామ శూల  - 

        ఆహారం జీర్ణం అయ్యే సమయంలో జనించెడి నొప్పి .

 *  పలల మేహము  -

         చిన్న చిన్న మాంసపు ముక్కలు మూత్రం వెంట పడే రోగము .

 *  పక్షవాతము  - పరాలైసిస్ .

       శరీరం యొక్క బాగం అనగా ఒకవైపు చెయ్యి , కాలు వీనికి వ్యాపించిన నరములకు సత్తువ లేకుండా చేయు రోగము .

 *  పాండురోగము  -  Anemia .

       దేహము న రక్తము క్షయించి తెల్లబారి ముఖము , కనురెప్పలు , పాదములు , గుహ్యస్థలము నందు వాపు కలిగి ఉండేడి రోగము .

 *  పీఠికా మేహము  - one type of syphilis .

       దేహము అంతా మట్టిపొక్కులుగా లేచేడి మేహరోగము .

 *  పీనస  -  Ozoena .

       ముక్కువెంట దుర్గంధముతో చీము , రక్తము వెడలె ఒక రోగము .

 *  ప్లీహారోగము  - Enlargement of Spleen .

       కడుపులో బల్ల పెరిగి కలిగెడు రోగము.

 *  పుట్ట వ్రణము  -  Cancer .

        సెలలు వేసే మానని మొండి వ్రణము .

 *  పురాణ జ్వరం  - Chronic Fever .

         చాలాకాలం నుంచి ఉండేడి జ్వరం .

 * బాలపాప చిన్నెలు  - Convulsion of Children .

         శిశువులకు 12 సంవత్సరాల లోపున అకస్మాత్తుగా మూర్చవలె కనిపించే రోగము .

 * భగందరము  - Fistula .

        వృషణాలు కు దిగువున , గుదస్థానముకి పైన చిన్న కురుపువలె లేచి అది పగిలి అందులో నుంచి రసి , చీము కారెడి రోగము .

 *  మూత్రశ్మరీ  -

          మూత్రపు సంచిలో రాళ్లు పుట్టెడు రోగం .

 *  మూత్రఘాతం  -

          మూత్రం బంధించుట . మలమూత్ర , శుక్లములు పొత్తికడుపులో చేరి వికృతిని పొంది ముత్ర నిరోధము కలిగి అందువలన మూత్రం అతికష్టముగా బయటకు వెడలు మేహ రోగము .

 *  మూత్రకృచ్చం  -

          మూత్రము బొట్టుబొట్టుగా నొప్పితో వచ్చు రోగము . ఈ రొగికి శుక్లము మూత్రముతో బయటకి వచ్చును.

 *  మేఘరంజి  -

          నీటితో కూడిన మేఘము ఆకాశమున కప్పి ఉన్నప్పుడు శ్వాస పీల్చడం కష్టముతో కూడుకుని ఉండు ఒకరకమైన ఉబ్బస రోగము .

 *  క్షయ రోగము  -

          ఈ రోగమును ముఖ్యముగా కాస , శ్వాస , కఫము , జ్వరం , దేహము శుష్కించుట , నీరసం , ఏది తిన్నా రుచి లేకుండా ఉండటం , ఆకలి లేకపోవడం ఈ రోగ లక్షణాలు .

 *  రక్తపైత్యం  -

          ముక్కువెంట గాని , నోటివెంట గాని అకస్మాత్తుగా రక్తం ప్రవహించెడి రోగము .

 *  రక్తవాతం  -

          దీనిని వాత రక్తం అని అంటారు. రక్తం సహజముగా ప్రవహించక దేహమున ఏ భాగం నందు అయినా కూడి వాపు , ఎరుపు , పోటు కలిగి ఉండటం మొదలగు బాధలు కలిగి ఉండు ఒక రోగము .

 *  రుద్రవాతము  -

         హఠాత్తుగా మూర్చరోగము వలే స్మారకం లేక పడిపోవడం . నోటివెంట నురుగులు వెడలుట , అంగవైకల్యం కలుగుట ఇలాంటి లక్షణాలు కలిగిన రోగము

 *  లూతము  -

          కంటి కోన వద్ద పుట్టెడు రోగము .

 *  వలీఫలితము  -

          బాల్యము నందే శరీరం ముడతలు పడుట , వెంట్రుకలు నెరియు వ్యాధి .

 *  విద్రది  -

         గర్భము నందు పుట్టి నాభిలోకి వెడలు వ్రణము .

 *  విషజ్వరము  -

        ఒకప్పుడు ఉష్ణం అధికంగా ఉండి మరియొకప్పుడు ఉష్ణము లేకుండా ఒక సమయం లేకుండా వచ్చు జ్వరం.

 *  విసర్పి  - Herpes .

       ఎర్రగా కాని తెల్లగా కాని పొక్కులు ఒకచోట గుంపుగా లేచి వ్యథతో గూడిన చర్మరోగము . దీనినే సర్పి అందురు.

 *  శిల్ప కుష్ఠు  -

       రాళ్లు వలే గరుకుగా గ్రంధులు లేచేడు కుష్ఠు రోగము .

 *  శూల - Sposmodic colic .

        కడుపులోగాని , పక్కలోగాని హటాత్తుగా వచ్చే కఠినమైన నొప్పి.

 *  శ్వేత కుష్ఠు  -  లeucoderma .

       తెల్లని మచ్చలు బయలుదేరి వ్యాపించెడి కుష్ఠు రోగము .

  *  స్వరభంగ రోగము  -

        స్వరము క్షీణించి పోయెడి రోగము లేక గొంతు బొంగురుగా మారి స్వరం పలకని రోగము .

 * నఖ బేధము  -

        చేతిగోళ్ళు , కాలి గోళ్లు నెర్రలు వచ్చుట .

 *  పాదశూల  -

          పాదముల యందు గాని , పాదముల పైభాగము నందు గాని విపరీతమైన నొప్పి లేక పోటు .

 *  గృధ్రసీవాతం - sayatika 

          పిరుదల యందు ప్రారంభం అయ్యి క్రమముగా వీపు , తొడలు , మోకాళ్లు , పిక్కలు , పాదములు వీటన్నింటి యందు భరించలేనంత బాధ మరియు తిమ్మిరి కలిగించు సమస్య.

 *  ఉరుస్తంభము  -

           తొడలు బిగుసుకొనిపొయి ఏ మాత్రం కదిలించలేని సమస్య.

 *  ఊరుపాదము  -

            తొడలు చచ్చుబడి సన్నగా అవ్వటం.

 *   గుదభ్రంశము  - prolopse of rectum .

             మలమార్గమగు గుదము కిందికి జారుట.

 *    వృషణోక్షేపము  -

          వృషణాలు తమ స్థానం నుంచి పైకి పీక్కొని పోవుట . ఇటువంటి పరిస్థితి అత్యంత తీవ్ర జ్వరంలో సంభవించును .

 *   ఖంజత్వం  -

           కుడి కాలు లేదా ఎడమకాలో ఏదో ఒకటి పనిచేయకుండా పోవుట .

 *  కుబ్జత్వం -

            దీనిని గూని అని పిలుస్తారు . పృష్ఠభాగము నందలి స్నాయువులు సంకోచముచే శరీరావయములు ముడుచుకు పోయి వంకర అగుట.

 *  హృదయ శైధిల్యము -

           హృదయము నందలి మాంస పొరలు ( Heart muscle fibers ) శైథిల్యం చెందుటచేత అనగా పట్టు తప్పుటచేత దడ (palpitation ) వచ్చును. ఇది శరీరంలో ఓజస్సు క్షీణించడం వలన సంభంవించును. హృదయం పెరుగుట కూడా జరుగును.

 *  వక్షోద్ధర్షము  -

             హృదయము యొక్క స్పందన అధికం అవ్వడం వలన వక్షస్థలం (chest ) అంతయు అదిరినట్లు లేక వణుకుడు అగుట.

 *  గ్రీవస్థంభము  -

             మెడ భాగము నందు వాతం అధికం అయ్యి మెడ పట్టుకొనిపోవుట .

 *  అపభాహకము  -

            పై చేతులు (upper arms ) ఎండిపొయినట్లు అయ్యి సన్నబడటం .

 *  అక్షితోదము  -

           నేత్రముల యందు సూదితో పొడిచినట్లు విపరీతమైన బాధ .

 *  వర్త్మ స్తంభము  -

            కనురెప్పలు మూసుకుని పోకుండా తెరుచుకొని ఉండటం.

 *  అర్ధితము  -

             ముఖములో సగభాగం చచ్చుబడిపోవుట దీనిని ఆంగ్లము నందు Facial Paralysis అని అంటారు.

 *  గ్లాని  - Fatigue or Asthenia .

            శరీర అవయవములు అన్నియు క్రియారహితములు అయ్యి వడలినట్లు ఉండటం.

 *  కేశభూమిస్పటనము  -

           తల మీది చర్మం బీటలుగా మారుట .

 *  ఆక్షేపకము  -

           శరీరము నందలి అవయవాలు విసిరినట్లు లేదా కొట్టుకొనినట్లు అగుట.

 *  దండకం  -

           శరీరం ఎటూ కదలకుండా కఱ్ఱవలె బిగుసుకొనిపోవడం .

 *  శ్వావారుణావ భాసత్వము  -

            చర్మము , పెదవులు , వ్రేళ్లు మొదలగునవి నలుపు , ఎరుపు వర్ణములలోకి మారుట .

          పైన చెప్పినవే కాకుండగా మరెన్నో రోగములు మనుష్యునకు జనియించును. స్థలాభావం వలన కొన్నింటి గురించి మాత్రమే మీకు వివరిస్తున్నాను .

     చివరగా ఒక్క మాట మనుష్య శరీరమే రోగాల పుట్ట . మనకి భగవంతుడు ఇచ్చిన ఈ కొద్ది సమయములోనే ఎన్నో దుష్టకార్యాలు చేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకొవడం జరుగుతుంది. మనకి ఉన్న కొంచం సమయాన్ని అయిన మనచేత సత్కార్యాలు చేయించవలసిందిగా ఆ పరమేశ్వరుడిని ప్రార్ధించుదాం . ఇది కేవలం నాయొక్క అభిప్రాయం మాత్రమే ...

గుణాలు trigunalu

తమోగుణం తో వున్నవాడు శరీరం యొక్క అధీనంలో ఉంటాడు.

రజోగుణం లో ఉన్న వాడు మనస్సు యొక్క అధీనంలో ఉంటాడు.

సాత్విక గుణం తో ఉన్న వాడు బుద్ధి యొక్క అధీనంలో ఉంటాడు.

శుద్ధ సాత్విక గుణం తో ఉన్న వాడు ఆత్మ యొక్క అధీనంలో ఉంటాడు.

నిర్గుణ స్థితి లో ఉన్న వాడు పరమాత్మ తానై ఆ స్థితిలో అలరారుతూ ఉంటాడు.


                   యోగస్థితులు
 ★★★ ★★★★★★★★★★★★★

ధ్యాని అయినవాడు స్థిర సుఖాసనం.....
యోగి అయిన వాడు చిత్తవృత్తి నిరోధం....
ఋషి అయినవాడు ప్రాణశక్తి ఆవాహనం...
మహర్షి అయినవాడు నాడీమండల శుద్ధి....
బ్రహ్మర్షి అయినవాడు దివ్యచక్షువు ఉత్తేజం పొందుతాడు

శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు . vitamins and its food

శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .

     A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహనిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును.

           ఇప్పుడు ఈ అయిదు ముఖ్యవిటమిన్ల గురించి మీకు వివరిస్తాను.

 * "A" విటమిన్  -

       ఇది లోపించినవారికి "రేచీకటి" వచ్చును. కన్ను , నోరు , ఊపిరితిత్తులు మొదలైన సున్నితమైన చర్మం ఎండిపోయి రోగములు తెచ్చు సూక్ష్మజీవులు దాడిచేయుటకు అనువుగా ఉండును. శరీరం చక్కగా ఎదుగుటకు , గర్భధారణకు , బాలింతలుగా ఉన్న సమయమున ఈ విటమిన్ చాలా అవసరం .

              ఈ "A" విటమిన్ ఎక్కువుగా పాలు , పెరుగు , వెన్న , నెయ్యి , గుడ్లు , చేపలు , పచ్చికూరలు , కాడ్ లివర్ ఆయిల్ , టొమాటో , బొప్పాయి , నారింజపండ్లు , బచ్చలి , తొటకూర మొదలైన వాటిలో ఎక్కువుగా ఉండును.

 *  "B" విటమిన్  -

         ఇది లోపించిన నరముల నిస్సత్తువ , ఉబ్బసరోగం కలుగును.

           ఈ "B" పచ్చికూరలు , మాంసము , పప్పుదినుసులు , గుడ్లు మొదలయిన వాటిలో లభించును. "B6" విటమిన్ తెల్లరక్త కణాలు తయారీకి ఉపయోగపడును. అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసుల్లో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును. "B12" విటమిన్ ఇది లోపించిన పెదవుల్లో పగుళ్లు వస్తాయి. ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి , నాడీమండలం వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గటం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ "B12" విటమిన్ పాలఉత్పత్తుల్లో , సోయాచిక్కుడు పాలలో పుష్కలంగా ఉండును.

 *  "C" విటమిన్ -

          శరీరంలో ఈ విటమిన్ "స్కర్వీ " అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్ గా పనిచేయును . జీర్ణశక్తిని పెంచును. విటమిన్ C లోపించిన ఐరన్ ను ప్రేగులు గ్రహించలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . ఈ విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉశిరికాయ , కొత్తిమీర , పండ్లరసములు , మొలకెత్తిన గింజలలో , కలబందలో , వెల్లుల్లిలో , ముల్లంగిలో , పైనాపిల్ లో , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులో పుష్కలంగా లభించును.

 *  "D" విటమిన్ -

         బిడ్డల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా అవసరం . ఇది లోపించిన బిడ్డలు దొడ్డికాళ్ళు వారగును. ఇది A విటమిన్ తో కలిసి వెన్న , గుడ్డు లొని పచ్చసొనలో ఉండును. ఉదయం , సాయంకాలం శరీరముకు సూర్యరశ్మి తగులుట వలన శరీరానికి కావలసిన D విటమిన్ బాగుగా లభించును. ఈ విటమిన్ శరీరంలో కొంతమొత్తంలో తయారగును.

              ఈ D విటమిన్ మనశరీరంలో ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృడంగా ఉంచును. రోగనిరోధక శక్తి బలోపెతం చేసేగుణం ఈ విటమిన్ కు ఉండును. ఇన్సులిన్ శరీరం సంగ్రహించుటకు తోడ్పడును. విటమిన్ D కణవిభజనను నియంత్రిస్తుంది. ఫలితముగా క్యాన్సరు నివారణకు తోడ్పడును . విటమిన్ D లోపము వలన పేగు క్యాన్సరు,రొమ్ము క్యాన్సరు , ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు , క్లోమ క్యాన్సరు ముప్పుని తొలగించును. ఉదయం 6 నుంచి 8 లోపు సూర్యనమస్కారాలు చేయుట మంచిది . ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లు తరచుగా పాలు , గోధుమలు , మరియు దేశివాళీ ఆవునెయ్యిలో తరచుగా తీసికొనవలెను .

 * "E " విటమిన్  -

          ఇది లోపించిన నపుంసకత్వం కలుగును. A విటమిన్ మరియు C విటమిన్లను మరియు ప్రోటీయాసిడ్స్ ని శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న E విటమిన్ లో ఉన్నది. వేరుశనగలో , బాదంలో , కాయగింజలలో , సొయాచిక్కుడు , గట్టి గింజలలో దొరుకును . గోధుమ , మొలకెత్తిన గింజలలో , మాంసములో ఎక్కువుగా లభించును.

              వీటితో పాటు విటమిన్ K కూడా మనకి ముఖ్యమయినది. ఈ విటమిన్ K రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడింది. ఈ విటమిన్ K లోపించడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ విటమిన్ K పచ్చిబఠాణీ , ఆవునెయ్యి , క్యారెట్ లలో ఎక్కువుగా ఉండును.

కడుపులో మంట తగ్గించు ఔషధ యోగములు - stomach burning

కడుపులో మంట తగ్గించు ఔషధ యోగములు  -
  ఒక స్పూన్ పుల్లటి దానిమ్మ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి తాగిన కడుపుమంట తగ్గును.

 *  దేశివాళి టమాటా రసంలో ఉప్పు , మిరియాల చూర్ణం కలిపి త్రాగిన కడుపులో మంట తగ్గును.

 *  బాగుగా కాచిన గ్లాసు వేడి నీటిలో 25ml నేతిని కలిపి తాగుచున్న కడుపుమంట తగ్గును.

 *  శిలజిత్ చూర్ణమును మూడు చిటికెలు మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న కడుపుమంట తగ్గును.

 *  తులసి ఆకులను ఎండించి చూర్ణం చేసి ఒక గాజు సీసా యందు భద్రపరచుకొని ఆ చూర్ణం 3 గ్రాములు ఉదయాన్నే పావు లీటరు పచ్చి ఆవుపాలలో కలిపి సేవించుచున్న కడుపుమంటలు తగ్గును.

కుండలిని జాగృతి లో వివిధ అవస్థలు - వైజ్ఞానిక విశ్లేషణ (1) : KUNDALINI ENERGY

 కుండలినీ శక్తి జాగృతమైన సమయంలో మూలాధార చక్రం వద్ద ఒక ప్రత్యేకమైన దురద వంటి ఉద్రేకము కలుగుతూ ఉంటుంది. అందువల్ల సాధకుడు కుండలినీ పీఠం "మూలాధారం" వద్ద ఉన్నదని భావించవచ్చును. యోగి తన శరీరంలోని ప్రతి కోశిక యందును, ఒక విచిత్రమైన విద్యుత్ స్పందనను అనుభవిస్తాడు. జాగరూకుడైన యోగి తన శరీరంలో జరిగే సూక్ష్మమైన అంతర్గత మార్పులన్నీ ఈ రకమైన అనుభవాలుగా పరిశీలనలోకి వస్తాయి.
      కుండలినీ శక్తి జాగృతి సమయంలో కోశికలు అన్నిటియందు ప్రవహించే విద్యుత్ ప్రవాహం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి 1. పిప్పిలకము 2. దర్దూరము 3.  సర్పము 4. విహంగము.

1. పిప్పిలకము :
 సంస్కృతంలో పిప్పిలక మనగా చీమ.  కుండలిని జాగృతి తొలి అవస్థలో కొన్నిసార్లు సాధకుడు తన శరీరంలో వందలాది, వేలాది చీమలు పైకెగ బ్రాకుతున్నట్లు  అనుభూతి చెందడం జరుగుతుంది.  తన శరీరములో పైకి ఎగబ్రాకే చీమల దాడికి గురయ్యానా... అని వ్యాకుల పడడం జరుగుతుంది. కొంతమంది సాధకులు అయితే లేనటువంటి ఆ చీమలను శరీరము నుండి దులిపి వేయడానికి ప్రయత్నిస్తారు.  కానీ వెంటనే అతడు నాడీమండలంలో కలిగే ప్రేరణగా గ్రహిస్తాడు. అయితే వాస్తవంగా లేనటువంటి చీమలు అవి పైకి ప్రాకి ఉన్నట్లుగా కలిగే అనుభూతి ఎందుకు కలగాలి ? అనే ప్రశ్న మన మనస్సులో ఉదయించును.
      శాస్త్రీయముగా దీనికి కారణం సుస్పష్టం. శరీరమునందలి కోసి కలలో సూక్ష్మమైన విద్యుత్ తరంగాలు ఏకీకృతమై ఒక్కసారి సంచలనాలు సృష్టిస్తాయి. ఈ సంచలనాలే  క్రింద నుంచి  పైకి,  అసంఖ్యాకమైన చీమలు ప్రాకుతున్నట్లుగా అనుభూతి కలిగిస్తాయి. చాలామంది యోగ సాధకులకు.... కుండలినీ శక్తి జాగృతి దశలో ఈ రకమైన అనుభూతి మొదటి అవస్థ. ఇటువంటి ప్రేరణ పూరితమైన అనుభవాన్ని శాంతింప చేయాలంటే సాధన కొనసాగించడం ద్వారా ఈ అవస్థను దాటి ముందుకు పోవచ్చు.

     కుండలిని జాగృతం సమయంలో శరీర క్రింది భాగంలో ప్రాకే అనుభూతి మన శరీరమందలి మూలాధారము, ప్రభావితమైందని చెప్పుకోవచ్చును. అంతేకాక మూలాధారము మన మోకాళ్ళకు క్రింద నున్న  శరీర భాగం పై పూర్తి ఆధీనము కలిగి ఉన్నది. ఆసక్తి గల వ్యక్తులు  "కుండలినీ విజ్ఞాన శాస్త్రము" నందు ఈ విషయమును పరిశోధించాలి. శరీరంలోని ఏదైనా భాగంలో రక్త ప్రవాహం తక్కువగా గానీ, ఆగి... ఆగి... ప్రవహిస్తున్నప్పుడు గాని ఈ రకమైన అనుభూతి కలుగును. అందుచే సాధకునికి కలిగే చీమలు ప్రాకే అనుభూతి రక్తప్రవాహం లోపం వలన కలుగుతుందా ? లేక ఆ భాగంలో గల నాడీ మండలపు నియంత్రణ లే
సడలినందువల్ల కలిగినదా..... అనే ఈ విషయము పరిశోధనాంశం. కుండలిని జాగృతం అయినప్పుడు కలిగే ఈ అనుభూతి నాడీ సంబంధమైనదేనని  చాలా మంది యోగుల అభిప్రాయము. ఎందుచేతననగా ప్రారంభ దశలో సాధకుని రక్త ప్రసరణ
 సామాన్యంగా గాని... అంతకన్నా  హెచ్చుగా గానీ ... ఉండును. కుండలిని జాగృత సమయంలో మొదటి యోగ చక్రం ప్రేరేపించబడినప్పుడు సాధకుని ముఖం మరింత తేజస్సుగానూ మరింత రక్తప్రసరణతో కూడినది గానూ ఉండును. మామూలు కంటే హెచ్చు స్థాయిలో రక్తప్రసరణ జరుగుతున్నదని మనకు తద్వారా తెలియచున్నది. అందుచేత కుండలిని జాగృత తొలి దశ అయిన పిప్పిలకావస్థలో  కలిగే ప్రేరణ నాడీమండల సంబంధమైనదని రక్త ప్రసరణ లోపం వల్ల కలిగినది కాదని మనకు అర్థం అగును. ప్రతి కోసికలోనూ, ముఖ్యముగా శరీరపు క్రింది భాగములో ఉద్భవించే విద్యుత్ సంచలనాలే, చీమలు పైకెగబ్రాకుతున్న అనుభూతికి కారణము. అయితే దీనికి నిరంతర సాధన అవసరము. గురువు యొక్క పర్యవేక్షణ కూడా అవసరం. స్వంత ప్రయోగాల వలన ఇబ్బంది కలుగవచ్చును. ఈ సమాచారం కేవలం అకాడమిక్ ఆసక్తి కొరకు మాత్రమే........(సశేషం)

శరీరానికి అత్యవసరమైన ధాతువులు లభించు ఆహారపదార్ధాలు - ELEMENTS FROM FOOD VITAMINS TOO

శరీరానికి అత్యవసరమైన ధాతువులు లభించు ఆహారపదార్ధాలు  -

  స్వాభావిక విటమిన్ "A" ను అందజేయు   "కెరొటిన్ " అనే పదార్థం అతి ఎక్కువుగా లభించు ఆహారపదార్ధములు  -

 కెరోటిన్  -

     ఆకుకూరలు  - 240 మై . గ్రా .

   పేనికులెటన్  అనబడే తోటకూర  - 14 ,000 మై .గ్రా .

  చామాకులు  - 10 ,000 మై .గ్రా .

  కొత్తిమీర  - 6 , 000 మై .గ్రా .

  మునగాకు  - 6 , 700 మై .గ్రా .

  గేన్జేటికన్ అనబడే తోటకూర లేక లేత తోటకూర  5 ,500 మై .గ్రా .

 *  C విటమిన్ లేక ఆన్ కార్మిక ఆమ్లం  -

      ఉశిరికలో ఈ విటమిన్ కు ప్రతికూలమైన ఆక్సాలిక్ అమ్లం ఉండటం వలన లభించవలసినంత విటమిన్ లభించదు.

       మునగాకు  - ౨౨0 మి .గ్రా .

       నాటు జామపండు  - 212 మి.గ్రా .

      కుప్పా కు ఆలిపాకు  - 169 మి.గ్రా . దీనిని అమరన్తాన్ విరిడిన్ అని పిలుస్తారు .

 * క్యాల్షియం  -

        అవిసె ఆకు - 1100 మి.గ్రా .

        ముండ్ల తోటకూర  - 800 మి.గ్రా .

        కాలిఫ్లవర్  -  626 మి.గ్రా .

        పొన్నగంటి ఆకు  - 570 మి.గ్రా .

 *  మెగ్నీషియం  -

        పింక్ రాడిష్  - 196 మి.గ్రా .

       చుక్కకూర  -  123 మి.గ్రా .

       లేత తోటకూర  - 1౨౨ మి.గ్రా .

 *  పొటాషియం -

        అడవి తమ్మ  - 1800 మి.గ్రా .

        లేత తోటకూర  - 340 మి.గ్రా .

        మునగాకులు  - 259 మి.గ్రా .

         కొత్తిమిర  -  256 మి.గ్రా .

         పాలకూర  -  206 మి.గ్రా .

     మూసామ్బా అనే నిమ్మజాతి  పండు. 490 మి.గ్రా .

       అరటి పండు  - 348 మి.గ్రా .

 *  ఇనుము  -

        కాలిఫ్లవర్  -  40 మి.గ్రా .

        చిర్రికూర  -  38 మి.గ్రా .

        లేత తోటకూర  -  27 మి.గ్రా .

        ముళ్ళ తోటకూర  -  22 మి.గ్రా .

        ఎండ్రకాయ మాంసం  - 21 మి.గ్రా .

     ఎండ్రకాయ మాంసం సులభముగా జీర్ణం అయ్యి దాదాపు అంతా ఇనుమును శరీరమునకు అందించును.

 *  సూక్ష్మ ఖనిజాలు  -

         జింక్ , మాంగనీస్ , రాగి , మాలీబ్డ్ నం , క్రోమియం .

 *  జింక్  -

        పుదీనాలో , పెద్ద ఎర్రగడ్డలో , మెంతికూర , కొత్తిమీర , గెనుసుగడ్డ , పాలకూర లో జింక్ లభించును.

 *  మాంగనీసు  -

         పుదీనా , పాలు , కొత్తిమీర , చుక్కకూర , లేతతోటకూర , కరివేపాకులో మాంగనీసు లభించును.

 *  రాగి  -

        పొన్నగంటి ఆకు , పుదీనా , పెద్ద ఎర్రగడ్డ , కొత్తిమీర , కరివేపాకులలో ఈ రాగి ధాతువు ఎక్కువుగా లభించును.

 *  మాలీబ్డ్ నం -

         కొత్తిమీర , పొన్నగంటి ఆకు , పెద్ద ఎర్రగడ్డ , లేత తోటకూర లో లభించును.

 *  క్రోమియం  -

        పొన్నగంటి ఆకు , కొత్తిమీర లలో లభించును.

       పైన చెప్పిన సూక్ష్మ ధాతువులు , జీవప్రక్రియలకు చాలా అవసరమైన ధాతువులు కాబట్టి  ప్రతిదినం పుదీనా , కొత్తిమీర , మెంతికూర , పెద్ద సైజు ఉల్లిపాయలు పదార్దాలను , పచ్చళ్లు రూపములోను , పాలకూర , చుక్కకూర వగైరాలను , పప్పు పదార్థములతోటి కలిపి వంట పదార్దాలను వాడితే ఆరోగ్యమునకు చాలా శ్రేష్టం .

         కొత్తిమీర , పెద్ద ఉల్లిపాయకాడలతో చేసిన పచ్చడి తీసుకోవడం వలన ఐదు రకాల ధాతువులను అందజేయును . కరివేపాకు పొడి అధిక శాతములో సున్నపు ధాతువును మరియు మెగ్నీషియం , జింక్ , మాంగనీసు ధాతువులను లభింపచేయును .

పుల్లటి త్రేపులు మరియు ఆహారం అరగకుండా ఉండు సమస్యకు అత్యంత సులభ పరిష్కారం - burfs

 శొంఠి , మిరియాలు , వేపచెట్టు బెరడు చూర్ణం ఈ మూడింటి చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని కలిపి ఒకే చూర్ణంగా చేసుకుని ఉదయాన్నే పరగడుపున 10 గ్రాముల చూర్ణాన్ని ఒక గ్లాసు మంచినీటిలో కలిపి తీసుకున్న పులిత్రేపులు ఆహారం అరగకుండా ఉండు సమస్యలు 40 రోజుల్లొ మాయం అగును.

తిప్పసత్తు తయారీ విధానము - tippa teega

  ముదిరిన తిప్పతీగ వ్రేళ్ళను తెచ్చి కత్తితో పైన పొట్టు తీసి సన్నని ముక్కలుగా కొట్టి దంచి నీటిలో కడగవలెను . జిగురు వచ్చు వరకు దంచి కడగవలెను. కడిగిన నీళ్లు ప్రత్యేకముగా ఉంచవలెను. జిగురు రాకపోయినా దంచి కడుగుటను మాని మొదట కడిగిన నీళ్లను వెడల్పాటి పళ్ళెములో పోయవలెను. సత్తు అంతా తెల్లగా అడుగున పేరి నీరు పైకి తేలును. ఆ నీటిని వంచివేయవలెను . ఈ విధముగా రెండోసారి , మూడోసారి తిప్పతీగని కడిగిన నీటిని పళ్ళెము లొ పొసి ఉంచవలెను. ఇందులొ తయారు అగు సత్తు మొదటి దాని అంత తెల్లగా ఉండదు. పైకి తేలిన నీటిని ఎప్పటికప్పుడు వంచివేయచుండవలెను . ఇటుల చేరిన సత్తుని బాగుగా ఎండు వరకు ఉంచిన అవి ముక్కలు అగును. ఇది రెండు రొజులలొ తయారు అగును .

                 రాత్రుల యందు పాత్ర ను మూతతో కప్పి ఉంచవలెను. మూలికను దంచునప్పుడు రోలుకు కాని , రోకలికి కాని సున్నము తగలరాదు. సున్నము తగిలినచో సత్తు విరిగిపోవును. పళ్లెము కి కూడా సున్నము తగలనివ్వరాదు.

             ఈ సత్తుని ప్రత్యేకంగా వాడుట యే కాక ఇతర ఔషదాలతో కూడా కలిపి ఇవ్వవచ్చు.

 దీని ఉపయోగాలు  -

 *  దీనిని తేనెతో తీసుకుంటే కఫం పోవును .

 *  బెల్లముతో తీసుకున్నచో మలబద్దకం పోవును .

 *  పంచదారతో ఇచ్చిన పైత్యమును , నేతితో ఇచ్చిన వాతమును హరించును.

  * దీనిని అనుపానములతో ఇచ్చిన సర్వరోగములు పోగొట్టును .

 * షుగర్ వ్యాధిగ్రస్తులు విడవకుండా వాడితే షుగర్
అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది.

 *  ఎప్పుడు నోరు పూస్తుంది అనేవారు తిప్పసత్తుని కర్పూర శిలజిత్ ని పంచదారతో గాని నేతితో గాని  కలిపి తీసుకుంటే శరీరంలో అతివేడి తగ్గును .

 *  పొడిదగ్గు కి కూడా ఇదే మిశ్రమాన్ని వాడవలెను.

 *  వేడి శరీరం ఉన్నవారు ప్రతిరోజు తిప్పసత్తు వాడితే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి.

 గమనిక  -  ఆయుర్వేద పచారి షాపుల్లో మీకు తిప్పసత్తు దొరకును. మీకు వీలుంటే సొంతంగా చేసుకోవచ్చు .

పసి పిల్లల వ్యాధులు - సులభ ఔషదాలు . kids problems

పసి పిల్లల వ్యాధులు  -  సులభ ఔషదాలు .

 * చంటి బిడ్డల సమస్త వ్యాధులకు   -

     ఎండిన ఉసిరికాయల పెచ్చులను కొంచం నీళ్లతో మర్దన చేసి గురిగింజలు అంత మాత్రలు చేయాలి . వాటిని గాలికి ఆరబెట్టి సీసాలో పోసి భద్రపరుచుకోవాలి. తరువాత అవసరం అయినప్పుడు ఉదయం ఒక మాత్ర , రాత్రి ఒక మాత్ర చనుబాలతో గాని , మంచి నీళ్లతో గాని అరగదీసి పిల్లలతో తాగిస్తూ ఉంటే పిల్లలకు వచ్చే సమస్త వ్యాధులు హరించి పొతాయి. చంటి బిడ్డలకు ఇది ఎంతో క్షేమకరమైన ఔషదం .

పాల ఉబ్బసం వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ము మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డని తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్ట , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్నిబట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపోతుంది .

 * పసిపిల్లల విరేచనాలకు   -

      మారేడు కాయలలోని గుజ్జు రెండున్నర గ్రాములు మోతాదుగా మంచినీటితో కలిపి తాగిస్తే పిల్లల విరేచనాలు కట్టుకుంటాయి.

 *  పిల్లకు ఎక్కిళ్ళు వస్తూ ఉంటే  -

       కొబ్బరి కోరు రెండున్నర గ్రాములు , పటిక బెల్లం పొడి రెండున్నర గ్రాములు కలిపి పిల్లలతో తినిపిస్తుంటే ఎక్కిళ్లు కట్టుకుంటాయి.

 *  పిల్లల పొడి దగ్గులకు  -

       తమలపాకు రసం 5 గ్రాములు , తేనే 10 గ్రాములు కలిపి ఒక మోతాదుగా రోజుకి రెండుసార్లు పిల్లలకు ఇస్తుంటే పొడి దగ్గు హరించి పొతుంది.

 *  పిల్లల పాల ఉబ్బసం వ్యాదికి  -

        పాల ఉబ్బసం అప్పుడప్పుడు వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ముల మీద పొట్ట మీద ఆముదం  రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డ వేసి తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్టమీద , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు. ఈ విధంగా అవసరాన్ని బట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపొతుంది.

 *  పిల్లల కడుపు లొ ఏర్పడే నులిపురుగులు, ఎలుకపాముల కొరకు  -

      డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపుల్లో దొరికే అక్రోటు పండ్లు తెచ్చి చిన్న పిల్లలకు వయసుని బట్టి సాయంత్రం సమయాల్లో ఒకటి లేక రెండు పండ్లు తినిపిస్తూ ఉంటే తెల్లవారి విరేచనంలో నులిపురుగులు, ఎలికపాములు పడిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరియు ఎదుగుతారు.

 *  పిల్లలు పాలు కక్కుతూ ఉంటే  -

      ఇంగువ ని నీళ్లతో గంధం లాగా అరగదీసి పిల్లల కడుపు పైన లేపనం చేస్తే పాలు కక్కడం ఆగిపొతుంది.

 *  పిల్లలు పక్కలో మూత్రం పోస్తూ ఉంటే  -

       సంపెంగ చెట్టు బెరడుతో కాచిన కషాయాన్ని పూటకు 10 గ్రాముల చొప్పున తాగిస్తూ ఉంటే పక్కలో మూత్రం పోసే అలవాటు పోతుంది .

 *  పిల్లల వాంతులు  -  దగ్గులు  -

       కరక్కాయ బెరడు ని చూర్ణం చేసి పూటకు 2 గ్రా చూర్ణం లొ తగినంత తేనే కలిపి రెండు పూటలా తినిపిస్తూ ఉంటే వాంతులు , దగ్గులు , నెమ్ము , మలబద్దకం, కడుపులో నొప్పి , అజీర్ణం, కడుపు ఉబ్బరం , ఇవన్ని తొలగిపోయి పిల్లలు ఆరొగ్యముగా ఎదుగుతారు.

 *  పిల్లలకు మూత్రం బిగదీస్తే  -

      నిమ్మకాయ లొని గింజలని నీళ్లతో మెత్తగా నూరి , బొడ్డు పైన రాసి పైన చన్నీళ్ళు కొద్దికొద్దిగా పోస్తూ ఉంటే బిగుసుకుపోయిన మూత్రం వెంటనే సాఫీగా బయటకు వెళ్తుంది.

 *  పిల్లల దగ్గులకు  -  జ్వరాలకు

       తులసి ఆకుల రసం 100 గ్రా వడపోసుకుని అందులో  25 గ్రా పటికబెల్లం ( కలకండ ) కలిపి పాకంగా కాచి పూటకు రెండున్నర గ్రాములు చొప్పున రొజూ రెండు పూటలా తినిపిస్తూ ఉంటే అన్ని రకాల దగ్గులు , జ్వరాలు సునాయాసంగా హరించి పోతాయి .

 *  పిల్లల వంటి దురదలకు  -

      వేప చిగురాకులు, నువ్వులు సమాన బాగాలుగా కలిపి మర్దించి ( నూరి ) వళ్ళంతా పట్టిస్తూ ఉంటే దురదలు, చిడుము తగ్గిపోతాయి .

 *  పసిపిల్లల జలుబుకు  -

      పిల్లలకు జలుబు చేయగానే తమలపాకులు కు ఆముదం రాసి వెచ్చజేసి పిల్లల రొమ్ముల పైన , పొట్ట పైన , తల పైన కాపడం పెడితే వెంటనే జలుబు తగ్గిపొతుంది.

 *  పిల్లల నోటి పూతకు  -

       రావి చెట్టు బెరడు , రావి చిగురు ఆకులు సమంగా కలిపి నూరి పూటకు 5 గ్రా చొప్పున నాకిస్తూ ఉంటే పిల్లల నోటి పూత తగ్గిపొతుంది.

 *  పిల్లల వాంతులకు  -

      యాలుక గింజలు, దాల్చిన చెక్క, సమంగా కలిపి నూరి 3 గ్రా చూర్ణాన్ని తేనెతో కలిపి పిల్లలకు తినిపిస్తే వాంతులు వెంటనే కట్టుకుంటాయి.

 * పిల్లల చెవుడు తగ్గాలి అంటే  -

       ఒంటె మూత్రాన్ని సంపాదించి చెవుడు ఉన్న చెవిలొ రోజు నాలుగయిదు చుక్కలు వేస్తూ ఉంటే వారం రోజుల్లో చెవుడు తగ్గిపొతుంది.

 *  పిల్లలకు ప్రతిరోజు తలంటుస్నానం చేయిస్తూ తలకు మంచిరకం గవ్వపలుకు సాంబ్రాణితో ధూపం వేయుచుండిన పిల్లల తలలో కురుపులు తగ్గును.

 *  చిన్నపిల్లలకు చిక్కటిపాలు ఇవ్వడం వలన అజీర్ణం చేసి దగ్గు వచ్చును. అందువలన పాలు పలుచగా చేసి ఇవ్వడం వలన దగ్గు తగ్గును.

 *  ప్రతినిత్యం రాత్రి పడుకునేముందు 125 ml పాలలో వేయించిన ఆవాలచూర్ణం కలిపి తాగించుచున్న యెడల చిన్నపిల్లలు పక్కలో మూత్రము పోయు అలవాటు తగ్గిపోవును .

 *  చితగ్గొట్టిన నీరుల్లిపాయను గాని యుకలిఫ్టస్ ఆయిల్ గాని వాసన చూపించిన యెడల చంటిబిడ్డల గుణము తగ్గును. ఆ తరువాత ఆముదము పెట్టిన యెడల ఆ వ్యాధి మరలా రాకుండా ఉండును. పిల్లలకు అజీర్తి , జ్వరం కలగకుండా చూచుకొనుచుండిన యెడల చంటిబిడ్డల గుణము అను వ్యాధి సంపూర్ణంగా పోవును .

 *  శిశువు పుట్టిన దగ్గర నుంచి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చువరకు ప్రతిరోజూ నువ్వులనూనె ఒంటికి రాచి రెండు గంటలు ఆగిన తరువాత నలుగుబెట్టి స్నానం చేయించుచుండిన యెడల శరీరం నందలి ఎముకలు మిక్కిలి గట్టిబడి త్వరగా విరగకుండా ఉండును.

 *  మర్రి ఊడలు మెత్తగా నూరి చిక్కని గంధము తీసి నాలుక మీద వేసి వ్రేలితో రుద్దుతున్న యెడల క్రమముగా మాటలు వచ్చును. ఈ ఊడల రసము లొపలికి పోయినను ఎటువంటి  సమస్య ఉండదు .

 *  చిన్నపిల్లలకు జలుబుచేసిన రోజున తమలపాకులు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపై , పొట్టపై , తలపైన వేసి కట్టుకట్టుచున్న జలుబులు హరించిపొవును .

 *  చిన్నపిల్లలకు కడుపునొప్పి వచ్చుచున్న నీరుల్లిపాయను కుమ్ములో ఉడికించి దంచి రసము తీసి కడుపునొప్పితో బాధపడుతున్న పిల్లలకు రెండున్నర గ్రాములు తాగించవలెను . ఇలా రెండుమూడు సార్లు తాగించిన చిన్నపిల్లల కడుపునొప్పి హరించును .

 *  కడుపులో నులిపురుగులతో ఇబ్బంది పడుతున్న చిన్నపిల్లలకు సాయంత్రం పూట ఒకటి లేక రెండు అక్రోటు పండ్లను తినిపించుచుండిన కడుపులో ఎలికపాములు , నులిపురుగులు బయటకి పోవును .

 *  పొంగించిన ఇంగువ , నల్ల ఉప్పు సమభాగాలుగా కలిపి చూర్ణించి పూటకు చిటికెడు చొప్పున తేనెతో కలిపి తినిపించుచుండిన చిన్నపిల్లల కడుపుబ్బరం తగ్గును.

 *  చిన్నపిల్లలకు విరేచనములు అగుచున్న నీరుల్లిపాయలను నలుగగొట్టి రసం తీయవలెను . ఆ రసము నందు మండుచున్న రావి చెట్టు కట్టెల నిప్పులను పడవేసి ఆర్పవలెను . ఆ తరువాత ఆ బొగ్గులను తీసి చూర్ణం చేసుకొని ఉంచుకుని రావి కట్టెల నిప్పులు ముంచబడిన నీరుల్లి రసం రెండున్నర గ్రాములలో ఒక గ్రాము రావిబొగ్గుల చూర్ణం కలిపి ఒక మోతాదుగా ఇవ్వవలెను . ఇలా రోజుకు రెండుసార్లు చొప్పున మూడురోజుల పాటు ఇవ్వవలెను . ఎటువంటి విరేచనాలు అయినా తగ్గును.

 * పాలుతాగే పిల్లలు పాలు కక్కుచున్న పిల్లలు పాలు తాగే ముందు తాగిన తరువాత కొంతసేపటికి 4 చుక్కలు నిమ్మకాయ రసమును త్రాగించుచున్న యెడల పిల్లలు పాలు కక్కుకునే రోగం హరించును .

చిన్నపిల్లల వ్యాధులు హరించుటకు సులభ ఔషధ యోగాలు  - 2 .

 *  చిన్నపిల్లల చిడుము మరియు దురదలు హరించుటకు వేపచిగుళ్లు , నువ్వులు సమాన భాగాలుగా కలిపి నూరి శరీరానికి పట్టించుచుండిన యెడల చిన్నపిల్లల చిడుము మరియు దురదలు తగ్గును.

 *  చిన్నపిల్లల దంత సమస్యల కొరకు పుట్టిన నాలుగు సంవత్సరముల నుండి ప్రతిరోజూ కళ్ళుఉప్పు నూరి ఆ ఉప్పు కొంచం ఆవనూనెతో కలిపి దంతములు తోముచున్న దంత సంబంధ సమస్యలు , చిగురువాపు వంటి సమస్యలు రావు .

 *  దానిమ్మబెరడు మరియు ఉప్పు కలిపి నూరి కందిగింజ అంత మాత్ర చేసి ఆ మాత్ర తేనెతో కలిపి అరగదీసి నాకించుచున్న పసిపిల్లల దగ్గులు హరించును .

 *  పిల్లల ఉదర వ్యాధులు హరించుటకు గోమూత్రం ఒక ఉగ్గు గిన్నెడు తీసుకుని చిటికెడు పసుపు కలిపి రోజూ రెండుపూటలా తాగించుచున్న పిల్లలకు వచ్చు సమస్త ఉదరవ్యాధులు హరించును .

 *  చిన్నపిల్లల నోటిపూత హరించుటకు రావిచెట్టు బెరడు , రావిచెట్టు చిగురు రెండు సమానంగా కలిపి నూరి పూటకు కుంకుడు గింజ అంత తీసుకుని తేనెతో అరగదీసి ఆ గంథం నాకించుచున్న పిల్లల నోటిపూత నివారణ అగును.

 *  చిన్నపిల్లలకు దంతములు సులభముగా రావడానికి ఇనుప కడియం గాని రాగి కడియముగాని కాళ్లు , చేతులకు వేసిన యెడల పిల్లవానికి సులభముగా దంతములు వచ్చును.

 *  పిల్లలకు బానలాంటి పెద్ద పొట్ట వచ్చిన రోజు ఒక చిన్న వెల్లుల్లిపాయ తినిపించుచుండిన బానపొట్ట పోవును .

 *  రికెట్స్ వ్యాధి వచ్చి చిన్నపిల్లలు ఎండిపోయి నడవలేక , కూర్చోలేక నిస్సారంగా ఉండుదురు అటువంటి వారికి వెన్నపూసను శరీరానికి రాసి బాగా మర్ధన చేసి ఉదయపు ఎండలో రెండుమూడు గంటలు కూర్చోపెట్టి స్నానం చేయించుచున్న యెడల నరములకు బలం వచ్చి వ్యాధినుంచి బయటపడుదురు . ఆవు వెన్న శ్రేష్టం .

 *  పుట్టిన పిల్లలకు బలం కలుగుటకు పిల్లవాడు పుట్టినరోజు నుండి ఏడు రోజుల వరకు నెమలి ఈకలను ఆవునెయ్యితో కలిపి పిల్లవాని శరీరముకు ధూపం వేయుచున్న యెడల దుష్టగ్రహ దోషం కలగదు మరియు మంచి బలం కలుగును.

 * చిన్నపిల్లల కడుపునొప్పులకు సోంపును మాడ్చి చూర్ణం చేసి మూడు చిటికెల చూర్ణం తేనెతో కలిపి నాకించుచున్న చిన్నపిల్లల కడుపునొప్పి హరించును .

 *  చిన్నపిల్లల జ్వరమునకు నేలవేము కషాయంతో తేనె కలిపి ఇచ్చుచున్న పిల్లల జ్వరం తగ్గును.

 *  పిల్లలకు మూత్రం బిగబట్టి రాకుండా కడుపు ఉబ్బుతున్నప్పుడు గోమూత్రం , పాలు , ఆముదం సమంగా కలిపి 3 గ్రాముల గుగ్గిలం చూర్ణం కలిపి ఇచ్చుచుండిన యెడల మూత్రబందనం పోయి మూత్రం ధారళంగా వచ్చును.

 *  చిన్నిపిల్లలకు కోరింత దగ్గు వచ్చుచుండిన అరటిఆకులను మాడ్చి భస్మం చేసి ఆ భస్మాన్ని ప్రతిరోజూ మూడుపర్యాయాలు ఒక చిటికెడు తీసుకుని తేనెతో కలిపి నాకించుచుండిన ఎటువంటి కోరింత దగ్గు అయినా తగ్గును.

 *  చిన్నపిల్లల బోడ్డు ఉబ్బినప్పుడు ఒక మట్టిబెడ్డను కాల్చి పాలలో మంచి గొరువెచ్చగా ఉన్న ఈ పాలతో బొడ్డును తడుపుచుండవలెను . ఇలా నాలుగైదు సార్లు చేయుచుండిన బొడ్డు యధాస్థితికి వచ్చును.

                        సమాప్తం 

శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ - Endocrinol

శరీరంలో రసాదిదోషాలు ప్రకోపించిన ఏయే స్థానాలలో ఏయే వ్యాధులు కలుగునో సంపూర్ణ వివరణ  -

 *  రసం దోషం పొందిన కలుగు వ్యాధులు -

    అన్నం మీద ఇష్టం లేకపోవుట, రుచి తెలియకపోవటం, ఆహారం జీర్ణం కాకపోవడం , శరీరం నొప్పులు , జ్వరం, గుండెపీకుట , వాంతి వచ్చునట్లు ఉండటం, ఆహారం తినకపోయినను తినినట్లు ఉండటం , శరీరం బరువు, హృదయ సంబంధ వ్యాధులు , పాండురోగం , శరీరం కృశించటం, అవయవములు కృశించుట, అకాలంలో శరీరం ముడుతలు పడుట, అకాలం నందు జుట్టు నెరియుట వంటి వ్యాధులు కలుగును.

 *  రక్తం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

     కుష్టు , విసర్ప, పిడక ,మశక ,నీలిక , తిలకాలకా, నశ్చ , వ్యంగ అను చర్మవ్యాధులు ,  పేనుకొరుకుడు, ప్లీహ సంబంధ సమాస్యలు , విద్రది అను వ్రణం , గుల్మవాతం, శోణిత, క్యాన్సర్ , రక్తపిత్తం వంటి వ్యాధులు సంభంవించును.

 *  మాంసం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

     ఆసనము , నోరు , నాలిక పుండ్లు పడుట, మాంసం వృద్ధినొందుట, క్యాన్సర్ కణుతులు, మొలలు , కొండనాలుక వాచుట, ఇగుళ్ళు నొప్పులు , గలగండిక ( టాన్సిల్స్ ) , పెదవులు పుండ్లు పడుట, గొంతు చుట్టూ కణుతులు వచ్చుట, గొంతు వాచుట మొదలైన వ్యాధులు సంభంవించును.

 *  మేథస్సు అనగా కొవ్వు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

     శరీరంపై గ్రంథులు లేచుట , అండవృద్ధి, గొంతు వ్రణాలు , క్యాన్సర్ , మధుమేహం , శరీరం లావెక్కుట , అధికమైన చెమట  మొదలయిన రోగాలు సంభంవించును.

 *  ఎముకలు దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

      ఎముకపై ఎముక పెరుగుట, దంతముల పై దంతము పెరుగుట, ఎముకలపై సూదులతో పొడిచినట్లు అగుట, పిప్పిగొళ్ళు మొలుచుట మెదలైనవి ఎముకలలో దోషం పొందుట వలన కలుగు వ్యాధులు .

 *  మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

        అజ్ఞానము కలుగుట, మూర్చ వచ్చుట, శరీరం తిరిగినట్లు అనిపించటం, జాయింట్లలో వాపులు , బాధ కలుగుట, కళ్ళకలక మొదలైనవి శరీరంలో మజ్జ దోషం పొందుట వలన కలుగు వ్యాధులు .

 *  శుక్రం దోషం పొందుట వలన కలుగు వ్యాధులు  -

       నపుంసకత్వం ,సంతోషం లేకపోవటం , రోగంతో ఉన్న నపుంసకునకు అల్ప ఆయుర్దాయం , వికృత రూపం కలిగిన సంతానం కలుగుట, గర్భస్రావం మెదలైనవి శరీరంలో శుక్రం దోషం పొందుట వలన కలుగును.

 *  మలము దొషం పొందట వలన కలుగు వ్యాధులు  -

       మలము వెలువరించుటకు అవరోధం కలుగుట, లేదా అధికంగా వెలువడుట, సకాలంలో విరేచనం అవ్వకపోవుట, కడుపులో వికారాలు, చర్మవ్యాదులు సంభవించుట జరుగును.

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం - gastrouble

ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.

      వాము  250 గ్రాములు .

      జీలకర్ర  250 గ్రాములు .

      ధనియాలు  250 గ్రాములు .

         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.

            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.

  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -

  పాటించవలసిన నియామాలు  -

      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .

 పాటించకూడనివి  -

       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం

          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు - POISON FOOD

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు  -


     ఈ  సకలసృష్టిలో ప్రతిప్రాణి జీవించుటకు ముఖ్యమయినది ఆహారం.  ఒక్కొ ప్రాణి తన దేహాన్ని మరియు స్థితిని బట్టి ఆహారం తీసుకుంటుంది. ఈ సకల ప్రాణుల్లో మనుష్యజాతి ప్రధానం అయినది. మనిషికి రోగాలు ఎక్కడినుంచో ప్రత్యేకంగా రావు . సరైన అవగాహన లేకుండా మనం తీసుకునే విరుద్ద ఆహారపదార్థాలు మనకి రోగాన్ని కలుగచేస్తాయి. అటువంటి విరుద్ద ఆహారపదార్థాలను కొన్నింటిని మీకు తెలియచేస్తాను.

  విరుద్ద ఆహారపదార్థాలు -

 *  నీరు ఎక్కువుగా ఉండు పల్లపు ప్రాంతాలలో ఉండు జంతువుల లేక పక్షి మాంసాలు తినరాదు.

 *  తేనె , బెల్లం, పాలు , నువ్వులు , ముల్లంగి, తామర గడ్డలు, మొలకెత్తిన ధాన్యము వీటిలో ఏ ఒక్కదాన్ని మరొకదానితో కలిపి భుజించరాదు .

 *  ఆవనూనెతో పావురం మాంసం వేయించుకొని తినరాదు.

 *  కోడి మాంసంతో పెరుగు కలిపి తినరాదు.

 *  చేపలు వేయించగా మిగిలిన నూనెతో పిప్పిళ్లు వేయించరాదు.

 *  చేపలు తిని పాలు , పాలపదార్థాలు ఏవి కూడా తీసుకోరాదు .

 *  పుల్లగా ఉండు పదార్థాలతో పాలు చేరిన విషమగును. కావున పులుపుతో చేసిన పదార్థాలు తినిన తరువాత పాల సంబంధమైన ఉత్పత్తులు అసలు సేవించరాదు . ముఖ్యంగా పుల్లని రుచి కలిగిన మామిడి, రేగు , నేరేడు , వెలగ , చింత, దానిమ్మ, కొబ్బరి వంటి వస్తువుల తీసుకున్నపుడు పాలు వాడరాదు.

 *  ఉలవలు, అరిగెలు , కొర్రలు, మినుములు , పెసలు పాలతో తీసుకోరాదు

 * ముల్లంగి భుజించునప్పుడు పాలు వాడరాదు.

 *  మినపప్పు, బెల్లం, పాలు , పెరుగు , నెయ్యి, ఏ ఒక్కదానితోను నిమ్మపండు భుజించరాదు .

 *  మద్యం, తేనె , పెరుగు ఈ మూడింటిని వేడిగా ఉండు వస్తువులచే తినరాదు.

 *  ఉప్పు కలిపిన పాలు కాని , అన్నం కాని భుజించరాదు .

 *  ఆకుకూరలు తిను సమయంలో వెన్న తినరాదు.

 *  పాత బియ్యం , కొత్తబియ్యం కలిపి ఒకేసారి వండి తినరాదు.

 *  పక్వముకాని వస్తువుని , పక్వము అయిన వస్తువుని కలిపి భుజించరాదు .

 *  తేనె , నెయ్యి , జంతువుల కొవ్వు , నువ్వులనూనె , ఆవనూనె, ఆముదం వీటిలో ఏ రెండింటిని కాని , ఏ మూడింటిని కాని సమానంగా కలిపి వాడినచో విషమగును

 *  ప్రస్తుతం డాల్డాను నెయ్యితో కలిపి అమ్ముతున్నారు . దీనిని వాడినచో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చును.

 *  నువ్వుపిండి , బచ్చలికూర కలిపి భుజించినచో అతిసారవ్యాధి కలుగును.

 *  ముల్లంగి ఆకు, ఉల్లిగడ్డలు , మునగాకు , తెల్ల తులసి, అడవి తులసి , నల్ల తులసి మున్నగు ఆకు కూరలు తినిన వెంటనే పాలు తాగిన కుష్టువ్యాది కలుగును.

 *  తుప్పు పట్టిన గంటె లు , పాత్రల యందు వొండిన భోజనం మరియు విషలక్షణాలు కలిగిన వంటచెరుకు చేత వండబడిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని నాశనం చేయును

 *  రాగిపాత్రలో చేపల కూర వండి తినిన మరణం తప్పదు.

 *  బియ్యం వండినప్పుడు పూర్తిగా ఉడకకుండా , అధికంగా చిట్లినట్లు ఉండటం మరియు మాడిపోయిన అన్నం వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు .

 *  అరటిపండు మరియు మజ్జిగ కలిపి తీసుకోరాదు .

     పైన చెప్పిన విధంగా విరుద్ద ఆరపదార్థాలను భుజించినచో శరీరం దారుణమగు రోగాలపాలు అగును.విస్పోటకం అనగా శరీరంపై పొక్కులు లేచే రోగం , గుల్మం, కడుపులో పుండు , క్షయ , రక్తపిత్తం, వాతరోగం, మూత్రాశయంలో రాయి, కుష్టు , భగన్దరం , గ్రహణి వంటి రోగాలు కలుగును.

గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు - HEART DISEASE

*  తవాక్షరి చూర్ణంని తేనెతో సేవించుచున్న గుండెకు మంచి బలం కలిగి గుండె బలహీనత తొలగును .

 *  కోడిగుడ్డు సొన పాలతో బాగుగా కలియునట్లు చేసి దానిలో మిరియాల చూర్ణం , చక్కెర కలిపి ఉదయమే సేవించుచున్న బలహీనత తగ్గును. గుండెకు సత్తువ ఇచ్చును.

 *  బెల్లపు పానకం లో మద్దిచెక్క చూర్ణంని కలిపి తాగిన గుండెజబ్బులు పోవును . దీర్గాయువుని ఇచ్చును.

 *  గోధుమలు , మద్దిచెక్క చూర్ణములను ఆవునెయ్యి మేకపాలలో వేసి పక్వముగా చేసి దానిలో చక్కర చేర్చి సేవించుచున్న గుండెజబ్బులు తొలగును . గుండె బలహీనత పొవును .

 *  మద్దిచెక్క చూర్ణం, నెయ్యి, పాలు కలిపి తాగుచున్న గుండె బలహీనత తగ్గును.

 *  పెద్ద ముత్తువపులాగ చూర్ణంని పాలతో కలిపి తాగుచున్న గుండెబలహీనత , గుండెజబ్బు తగ్గును.

 *  12 గ్రాముల స్వచ్ఛమైన తేనెను నీళ్లతో కలిపి ఉదయాన్నే తాగుచున్న గుండెజబ్బు నయం అగును.

 *  మద్దిచెక్క చూర్ణంని పంచదారతో కలిపి తాగిన గుండెజబ్బు నయం అగును.

 *  కటుకరోహిణి గంధమును గుండెకు పట్టువేసిన గుండెజబ్బు తొలగును .

 *  మారేడు వేరును కషాయంగా చేసి తాగుచున్న గుండెదడ హరించును .

 *  ఇంగువ 10 గ్రాములు , హారతి కర్పూరం 10 గ్రాములు  ఇవి రెండు నీళ్లతో నూరి గురిగింజలు అంత మాత్రలు చేసి పూటకి ఒకమాత్ర చొప్పున రోజూ రెండుపూటలా వేసుకొని అనుపానంగా 40 గ్రాములు జటామాంసి కషాయం తాగుచున్న యెడల గుండెదడ , ఆయాసం హరించిపోవును .

 *  మూసామ్బారం నీళ్లతో నూరి గుండెలకు పట్టువేసిన యెడల గుండెలాగుట , పీకుట , ఆయాసం తగ్గును.

 *  గుండెల్లో మంట గా ఉంటే పుచ్చగింజలు 20 గ్రాములు నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయమున ఆ నీటిలో ఆ గింజలను బాగా పిసికి పటికబెల్లం పొడి కొద్దిగా కలిపి ఆ తరువాత దానిని వడపోసి ఆ ద్రవమును తాగవలెను .

 *  రావి ఆకులను నీళ్లలో నానబెట్టి మరునాడు ఉదయము దానిని వడబోసి తెల్లటి సీసాలో నిలువ ఉంచవలెను. ఆ ద్రావకం రోజుకి మూడుమార్లు 50ml చొప్పున తాగుచున్న గుండెదడ తగ్గును.

            పైన చెప్పిన వాటిలో కొలతలు లేకున్నచో 3 నుంచి 5 గ్రాములు చూర్ణపు మోతాదు తీసుకోవచ్చు . ద్రవపదార్థం 100 ml నుంచి 150 ml వరకు తీసుకోవచ్చు .

“ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి? why son is good about DNA

“ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి?

ఒక మగవాని వంశం కేవలం వారి తండ్రిదే, తల్లిది కాదు ఎందుకని?
ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchial society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది. మన ఋషులు ఎంతో ఆలోచించి ఈ విషయం నిర్ధారించి నిర్దేశించారు. నేటి శాస్త్ర సాంకేతిక విప్లవం ద్వారా కొన్ని మనం నిరూపించగలుగుతున్నాము నేడు. దీనిలో శాస్త్రీయత ఒకసారి పరిశీలిద్దాము.

ప్రతీ జీవిలోనూ DNA లో ఎన్నో chromosomes ఉంటాయి. కానీ మానవులలో ఉన్న 23 జతల chromosomes లో  సదరు స్త్రీకి X chromosomes అలాగే పురుషునికి Y chromosomes వుండడం సహజం. XX chromosome ఉంటె అమ్మాయి లింగ నిర్ధారణ అని, XY ఉంటె పురుష లింగ నిర్ధారణ చేస్తారు chromosome ఆధారంగా. పిండం ప్రాణం పోసుకుంటూ ఉండగా ఈ Y chromosome ఆడ లక్షణాలను అడగదోక్కి పురుష లక్షణాలను పెంపొందిస్తుంది. ఈ Y chromosome అన్నది తల్లికి ఉండదు అందుకు కేవలం తండ్రి వలన మాత్రమె సంక్రమిస్తుంది ఆ పుత్రునికి. అదే అమ్మాయికి XX chromosome pair తల్లి నుండి తండ్రి నుండి సిద్ధిస్తాయి. ఈ XX chromosome కలిసినప్పుడు ఇద్దరి లక్షణాలను పుణికిపుచ్చుకుంటాయి. కానీ XY కలిగినప్పుడు Y అన్నది కేవలం తండ్రి నుండి మాత్రమె అందునా పెద్దగా మార్పు లేకుండా సంక్రమిస్తుంది.

అందుకే మన వేదం లో చెప్పారు “ ఆత్మావై పుత్ర నామాసి” అని. అంటే తండ్రే అదే రూపంలో కొడుకు అవుతున్నాడు అని. అదే లక్షణాలు మనవడి దగ్గరకు, అలా వారి వంశం అంతా కేవలం వారి తండ్రి, తాత, ముత్తాతల దగ్గరనుండి వస్తుంది. అందుకే మగవారిని వంశోద్ధారకుడు అనేది.  మన గోత్ర, ప్రవర పద్ధతి ఇదే విషయాన్ని చాలా అందంగా శాస్త్రాన్ని తనలో ఇముడ్చుకుంది. ప్రవరలో మన వంశంలో ఉన్న ముఖ్య ప్రముఖులైన మహర్షుల గురించి ఉంటుంది. ఉదాహరణకు
భార్గవస  గోత్రానికి ప్రవర భ్రుగు, చ్యవన, ఆప్లువాన, ఔరవ, జామదగ్ని  పంచార్షయము అని చెబుతాము. అంటే భ్రుగుమహర్షి నుండి ఆ lineage లో జమదగ్ని వరకు ఉన్న మహర్షుల సంతానం ఆ గోత్రీకులది అని తెలుస్తోంది. అంటే ఈ గోత్రీకులకు సంబంధించిన Y chromosome భ్రుగు మహర్షి వద్దనుండి వస్తున్నది అన్న అర్ధము. అదే ఆడవారికి రెండు chromosomes ఉండడం వల్ల వారి వంశం పెళ్లి చేసుకున్నాక భర్త వంశం అవుతోంది.

కొన్ని లక్షల, వేల సంవత్సరాల నుండి ఇలా వస్తున్న ఈ chromosomes ఎన్నో మార్పులకు లోనయ్యాయి. Y chromosome పరిమాణం కూడా X chromosome కి మూడవ వంతు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకే పరిమాణంలో ఉన్న ఇది రాను రాను చిన్నదయిందని శాస్త్రజ్ఞుల వాదన. XX chromosomes లో ఒక x కి  ఏమైనా లోపాలుంటే మరొక దానినుండి అది తెచ్చుకుంటుంది. దీన్ని క్రాస్ఓవర్ అంటారు. అదే XY కి ఈ అవకాశం లేదు ఎందుకంటె నిర్మాణ పరంగా ఇవి పూర్తిగా విభిన్నమైనవి. ఇవి మరింత క్షీణించకుండా ఉండాలంటే ఒకే గోత్రం/ప్రవర లో ఉన్న వారి మధ్య వివాహాలు జరపకూడదు అని చెప్పారు మన మహర్షులు.. అంతేకాక ఈ XX లో మరి XY లో X లలో ఉన్న ఏమైనా జన్యుపరమైన లోపాలు కానీ మరింత పెచ్చరిల్లే అవకాశం ఉండి, వీటిని పూర్తిగా నిషేధించారు. ఇలా దగ్గర దగ్గరలో ఉన్న XY XX లు కలుస్తూ పోతే మొత్తానికి ఆ వంశంలో y chromosome కనుమరుగయ్యే అవకాశం కూడా హెచ్చు.  మన మహర్షులు ఎంతో దూరదృష్టి ఉన్నందున వారు ఈ సగోత్రీకుల వివాహం వద్దన్న నియమం పెట్టారు. అది కూడా ఈ జనరేషన్ నుండి ఆరు తరాలు పూర్వం వరకు అలా కలిసి ఉండకూడదు అని. దానివల్ల ఆరోగ్యవంతమైన సంతానం, మరింత తెలివయిన వారు పుడతారు అని వారి విశ్లేషణ. నేడు మనకు సైన్సు వారు చెప్పిన విషయాన్ని ద్రువీకరిస్తోంది.

మన వేదవాంగ్మయం చెప్పిన విషయాలు నేటి శాస్త్రీయ విజ్ఞానం అందుకోవాలంటే మరి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు పట్టవచ్చు, అప్పుడు నిజమే ఈ విషయం కేవలం సనాతన ధర్మం చెప్పిందని అప్పటికి అనిపిస్తుంది. మనకు కావలసినది నమ్మకం. నేడు మనం నిరూపించగలిగే స్థాయిలో, పరిపక్వతలో లేము మనం అంత మాత్రాన పెద్దలు చెప్పిన శాసనాలను ధిక్కరించి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు?

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవేంకటేశ్వరార్పణమస్తు !!

ఆయుర్వేదం నందు మద్యము గురించి వివరణ - about liquor

 *  చరకాచార్యులవారు - బాహ్లీకులు , పల్లవులు , చీనీయులు , శూలికులు , యవనులు , శకులు అను ఆరుదేశములు యందు నివసించేవారు మాంసం , గోధుమలు , మద్యములు , శస్త్రచికిత్స అనునవి ఎల్లప్పుడూ ఉపయోగించుటకు తగినవారని వ్రాసిరి .

 *  కొన్నిరకాల వ్యాధుల వలన కలుగు దుఃఖం , బాధల నుండి కలిగిన శోకము తొలగి విశ్రమింపచేయుటకు మద్యమును యుక్తిగా ఉపయోగించుటను వెల్లడించిరి. వారికి కూడా కొన్ని నిబంధనలు వెల్లడించి వైద్యునికి ఆదేశాన్ని ఇచ్చిరి.

 *  మద్యమును నిత్యముగా ఇచ్చేప్పుడు మనుజుని అన్నపానములు , వయస్సు , వ్యాధి , శరీరబలం , కాలము , ఆరు రుతువులు ,వాత,పిత్త,కఫ  దోషములు , మానసిక స్థితి గమనించిగాని నిత్యం ఇవ్వరాదు అని కొన్ని ప్రత్యేక నియమాలు వైద్యునికి గ్రంథరూపంలో వెల్లడించిరి .

 *  వాత, పిత్త, కఫాలు మూడింటిని ఒకేసారి వృద్ధిని చెందించి శరీరం నందు వ్యాపించుటకు విషముకు ఎలాంటి శక్తి ఉంటుందో మద్యమునకు కూడా అవే గుణములు కలిగియున్నది. కాకుంటే మద్యము కంటే విషమునకు ఎక్కువ బలం ఉండటం వలన ప్రభావం త్వరగా ప్రభావం చూపును. మద్యం కొంచం శరీరాన్ని నాశనం చెందించుటకు కొంచం సమయం తీసుకొనును .

 *  మద్యము శరీరం నందలి రోగనిరోధక శక్తిని నాశనం చేసి శరీరాన్ని రోగాలపాలు చేయును మద్యము ఆమ్లరసం గుణములు కలిగి ఉంటుంది.

 *  మద్యము నందు మోహము , భయం , శోకము , క్రోధము , మృత్యువు ఆశ్రయించి ఉన్నవి. మద్యదోషం వలన పిచ్చి , మదము , మూర్చ , అపస్మారము కలుగును.

 *  అధిక మద్యపానం వలన వాత , పిత్త , కఫాలు వృద్దిచెంది హృదయము నందు బాధ , అరుచి , అధికంగా దప్పిక , జ్వరం , చలిజ్వరం , శిరస్సు నందు , పార్శ్వముల యందు , ఎముకల యందు , సంధుల యందు మెరుపుల వలే అప్పుడప్పుడు కలుగు బాధలు , అధికంగా , బలంగా ఆవలింతలు , శరీరం అదురుట , శరీరం నందు వణుకుట , శ్రమ , వక్షస్థలం నందు పట్టినట్లు ఉండటం , దగ్గు , ఎక్కిళ్లు , ఆయాసం , నిద్రలేకపోడం , చెవి , కళ్లు , ముఖవ్యాధులు కలుగుట , వాంతులు , విరేచనములు , వాంతి వచ్చేలా ఉండటం వంటి సమస్యలు కలుగును.

 *  ఆయుర్వేదం నందు మద్యము అతిగా తీసుకోవడం వలన కలిగే సమస్యను మదాత్యరోగం అని పిలుస్తారు . మద్యము తీసుకోవడం వలన వికారములు కలిగినపుడు వెంటనే మద్యమును మానవలెను అని సూచించడం జరిగింది.

 *  మద్యము వదులుటకు పాలను వాడమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు సూచించారు. ఒక్కసారిగా మద్యపాన వ్యసనాన్ని విడవరాదు. చిన్నగా మద్యపాన మోతాదును తగ్గించుకుంటూ రావలెను. ఒక్కసారిగా మద్యాన్ని ఆపడం వలన బలహీన మనస్తతత్వం ఉన్నవారు పిచ్చివారుగా మారే ప్రమాదం ఉన్నది . కావున క్రమంగా మోతాదు తగ్గించుకుంటూ రావలెను .

 *  మద్యము వలన శరీరబలం కోల్పోయినవారికి మద్యము యొక్క మోతాదు తగ్గించుకుంటూ పాల యొక్క మోతాదు పెంచుకుంటూ పోవడం వలన క్రమమముగా శరీరబలం పెరిగి మద్యపాన దుష్ప్రభావం నుంచి మనుష్యుడు బయట పడును.

 *  మద్యమును ఆపి మరలా తిరిగి మద్యపాన సేవన ప్రారంభించిన మరియు అధికంగా సేవించుట చేసినచో శరీర ధ్వంసం , మలక్షయం మొదలయిన సమస్యలు సంభవించి చికిత్సకు లొంగని విధముగా తయారగును.

 *  సమస్త విధములైన మద్యములను విడిచిన మానవుడు జితేంద్రియుడుగా , శారీర , మానసికంగా ధైర్యము కలవాడుగా , వ్యాధుల నుంచి దూరంగా ఉండువానిగా అగును

Thursday, January 30, 2020

దేహపుష్టి కలిగించు సిద్దయోగాలు. for body muscle

  - 

 *  ప్రతినిత్యం రెండు అమృతపాణి అరటిపండ్లు తినుచున్న మంచి దేహపుష్టి , బలము కలుగును. 

 *  ఉదయము మరియు మధ్యాహ్న సమయములో మినుములతో చేసిన గారెలు రెండు నుంచి నాలుగు తినుచున్న మంచి దేహపుష్టి కలుగును. 

 *  ఆవునెయ్యిలో మినుములు వేయించి దానిని పిండిచేసి దానిలో బెల్లం మరియు నెయ్యి కలిపి పూటకు రెండు చెంచాల చొప్పున తీసుకొనుచున్న దేహబలం కలుగును. 

 *  బూరుగ జిగురును చింతగింజ అంత మోతాదులో ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న శరీరానికి మంచిబలం కలుగును. 

 *  ఒక కప్పు వేడినీటిలో తేనె కలిపి సేవించుచున్న మంచి దేహపుష్టి కలుగును. 

 *  పెద్ద పల్లేరు కాయలను ఆవుపాలలో ఉడికించి ఆ తరువాత చూర్ణం చేసి పంచదారలో కలిపి పూటకు పదిగ్రాముల చొప్పున సేవించుచున్న మంచి దేహపుష్టి కలుగును. 

 *  నేలగుమ్మడి చూర్ణమును ఒక స్పూన్ పాలతో కలిపి సేవించుచున్న మంచిదేహపుష్టి కలుగును. 

                 
        దేహపుష్టి కొరకు కొన్ని పదార్దాలు కూడా నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోండి .అవి ఏమిటో మీకు వివరిస్తాను. 

    అల్లము , ఉత్తరేణి చెట్టు బియ్యం , ఉశిరికాయ , కొబ్బరి కురిడి , కొబ్బరిపాలు , చేపనూనె , జీడిపండు , జీడిమామిడి , పటికపంచదార , తియ్యటి దానిమ్మ , బాదంపప్పు , ఆవుపాలు , కర్పూర శిలాజిత్ , కుందేలు మాంసం , కర్బుజాపండు , తాటికల్లు , నీరుల్లిపాయ , పచ్చకర్పూరం , బూడిద గుమ్మడికాయ , శనగలు , మెంతికూర , వెన్న . 

        దేహాన్ని పుష్టిగా ఉంచుకోవాలి అనుకునేవారు శరీరం నందు వేడిపెరగకుండా చూసుకోవాలి వీలైనంత వరకు శరీరానికి వేడిచేయు పదార్దాలను భుజించకపోవడం మంచిది  . 


భారతీయ ప్రాచీన అణువిజ్ఞానం - atom science

ఈ సకల చరాచర సృష్టిలో ఉన్నవి రెండు అవి ఒకటి శక్తి , రెండోవది పదార్ధం . ముందు ఇక్కడ మీకు పదార్థం గురించి వివరణ ఇస్తాను.  ఈ పదార్ధాలలో రెండురకాలు కలవు. అందులో ఒకటి జీవపదార్ధం , రెండోవది జడపదార్ధం . ఈ రెండు రకాలు అంత పరమాణుమయంగా ఉంటాయి. ఒక పదార్దాన్ని చాలా చిన్నగా విభజించుకుంటూ పోతే చివరికి అది కంటికి కనిపించనంత సూక్ష్మరేణువుగా మిగులును . ఇలాంటి కొన్ని కోట్లపరమాణువులు ఒక దగ్గర కూడటం వలన పదార్థం ఏర్పడును . ఈ ప్రపంచంలో ప్రతీది పరమాణునిర్మితమే . పరమాణువు లేనిదే ఈ సృష్టి లేదు . ఈ సృష్టికి , పరమాణువుల మధ్య సంబంధం మరియు ఈ విశ్వసృష్టి రహస్యలను తెలుసుకొనుటకు త్రికరణశుద్ధిగా ఎంతోమంది ప్రయత్నించారు. అటువంటివారిలో అతి ముఖ్యుడు కణాదుడు .

          అణు విజ్ఞానాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్రంథస్థం చేసిన మహావిజ్ఞాని  "కణాద మహార్షి " ఈయన అసలు పేరు "కాశ్యపుడు" కణాల గురించి వివరించటం మూలాన కణాదుడు అని పేరువచ్చింది . అణువులు , పరమాణువులు గురించి      "వైశేషిక సూత్రం " అనే గ్రంథాన్ని ఈయన రాశాడు. వైశేషిక సూత్ర గ్రంథంలో ఆయన చేసిన ప్రతిపాదనలు సమగ్రవంతంగా ఇప్పటికీ ఆమోదయోగ్యముగా ఉన్నాయి .

                పదార్ధాన్ని విడగొడితే అణువులు , అణువులను విడగొడితే పరమాణువులు ఏర్పడుతాయని కణాదుడు స్పష్టంగా చెప్పాడు . విభిన్నమైన పరమాణువుల ఎన్నో ఉన్నాయని వాటి విలక్షణమైన కలయిక వల్లనే భూమ్యాకాశాలు , అగ్ని , గాలి , నీరు మొదలైనవన్నీ రూపొందాయి అని వివరించాడు. పదార్ధాలు పరమాణువు స్థాయికి వచ్చినపుడు ఆ పరమాణువులు తమ విశిష్ట లక్షణాలతో అలరారుతాయని చెప్పాడు . పదార్ధాలుగా రూపొందేప్పుడు రకరకాల పరమాణువులు కలియడం వలన వాటికి ప్రత్యేకమైన ధర్మాలు ప్రాప్తిస్తాయని సత్యాన్ని ఈ శాస్త్రవేత్త ఆనాడే ప్రకటించడం మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది .

          కణాద మహర్షి వివరణ ప్రకారం రెండు పరమాణువులు కలిస్తే " ద్వణుకం " మూడు పరమాణువులు కలిస్తే "త్రణుకం" అవుతుందని ఈయన వివరించి చెప్పాడు . పదార్ధములను మూలమైన పరమాణువులు , సృష్టి నిర్మాణంలో ఆధారం అయినందున అవి నిత్యములై ఉంటాయని వాటికి నాశనం లేదని చెప్పాడు .


                         సమాప్తం

తేళ్ల గురించి సంపూర్ణ వివరణ - చికిత్సలు . scorpion bite

తేళ్ల గురించి సంపూర్ణ వివరణ  -  చికిత్సలు .

   తేళ్లు కీటకముల జాతికి చెందినవి . అన్ని రకముల కీటకాలకు ముఖము నందు ఉండును. తేళ్లకు మాత్రం తోకచివర ఉండు కొండి యందు విషం ఉండును. శుశ్రుతుడు తేళ్ళలో మరొక రెండు రకాల జాతుల గురించి కూడా వివరించాడు. అందులో మొదటిది పత్ర తేలు రెండోవది మండ్రగబ్బ . మండ్రగబ్బ తేలు కంటే రెట్టింపు పరిమాణంలో ఉండును. అయితే తేలు తోక చివర కొండితో కాటువేయును కాని మండ్రగబ్బ నోటితో కరుచుట వలన విషాన్ని వదులును.

              తేళ్ళలో పుట్టిన ప్రదేశం మరియు విషం యొక్క తీవ్రతని బట్టి మన ప్రాచీన వైద్యులు మూడు రకాలుగా విభజించారు . అవి

  1 - మంద విషము కలిగినవి.

   2 - మధ్యవిషము కలిగినవి.

   3 - తీవ్రవిషము కలిగినవి.

 * మంద విషం కలిగిన తేళ్ల లక్షణాలు  -

        ఈ జాతిలో 12 రకాలు కలవు. ఇవి ఎక్కువుగా ఆవులు , గేదెలు మొదలగువాని మలములు బాగా కుళ్లిపోయిన వాని యందు పుట్టును . ఇవి కుట్టినచో బాధ , వణుకు , శరీరం మొద్దుబారుట , కుట్టిన ప్రదేశములో రక్తస్రావం కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును . మంట , వాపు , జ్వరం కలుగును. చమట పట్టును . వీటి పొట్ట కింద భాగములో పసుపు , నలుపు , నీలం , పొగ రంగు , గోమూత్రపు రంగు , ఆకుపచ్చ రంగు , తెలుపు రంగు కలిగి ఉండును. పొట్ట కింద మెరియుట , రోమములు కలిగి ఉండును. వీని తోక యందు కణుపులు ఎక్కువుగా ఉండును. మూడు కణుపుల కంటే ఎక్కువ కణుపులు కలిగి ఉండును.

 *  మధ్య విషం కలిగిన తేళ్ల లక్షణములు  -

           ఈ జాతిలో 3 రకాల తేళ్లు కలవు. ఇవి ఎక్కువుగా , వాములు , కర్రల గుట్టల యందు ఉండును. విషము కలిగిన ఆయుధములు చే కొట్టబడటం వలన గాని లేక విషజంతువుల చే కరవబడటం వలన గాని చనిపోయిన జంతువుల శరీరముల నుంచి ఇవి పుట్టును . ఇవి కుట్టినచో నాలిక వాయుట , భోజనము చేయలేకపోవుట , మూర్చ కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును. వీటి పొట్ట కింద భాగము నందు పసుపు , నలుపు , ఎరుపు రంగు కలిగి ఉండును. వీని తోక యందు మూడు కణుపులు ఉండును.

 *  తీవ్ర విషము కలిగిన తేళ్ల లక్షణములు -

          ఈ జాతిలో 15 రకాలు ఉండును. ఇవి ఎక్కువుగా చనిపోయిన పాములు మొదలగు విష జంతువుల శరీరములు బాగా కుళ్లిపోయిన తరువాత ఆ శరీర భాగాల నుంచి పుట్టును .

           ఈ తేళ్లు కుట్టిన వెంటనే సర్పవిషము వలనే వేగముగా పైకి ఎక్కును . శరీరము నందు బొబ్బలు , జ్వరం కలుగును. అతి నీరసము వచ్చును. ఇంద్రియాల నుండి నల్లని నెత్తురు స్రవించి ప్రాణములు పోవచ్చును.వీటి పొట్ట కింద ఎరుపు , తెలుపు , పొగ రంగు , నీలము , గులాబీ మొదలగు రంగురంగులు కలిగి ఉండును. దీని తోక యందు ఒక కణుపు గాని , రెండు కణుపులు గాని , లేక అసలు కణుపుల లేకుండా గాని ఉండును.

           పైన చెప్పినవాటితో పాటు శుశృతుడు వివరించిన రెండు రకాల తేళ్ల గురించి కూడా వివరిస్తాను.

 *  పత్ర వృశ్చిక లక్షణాలు  -

          ఇది ఆకువలనే పలచని ఆకారం కలిగి ఉండును. ఇది కుట్టినచో ఆ ప్రదేశము నందు ఎర్రబడి , బొబ్బలు పొక్కి , నిప్పుతో కాల్చినట్లుగా బాధ పెట్టును.

 *  మండ్రగబ్బ లక్షణములు  -

           ఇది చూడటానికి తేలు వలే ఉండును కాని పరిమాణంలో పెద్దదిగా ఉండును. ఇవి నలుపు , ఎరుపు రంగులు కలిగి ఉండును. వీటికి విషము నోటి యందు ఉండును. ఇవి కరిచినచో రోగి రోమములు నిక్కబొడుచుకొని ఉండును. శరీరం చల్లబడును చమటలు కారును . పురుషాంగం స్థంభించును. కరిచిన గాయం నుండి నల్లగా రక్తం కారును .

 *  తేలు యొక్క విషం వ్యాపించు విధం -

         తేలు కుట్టిన వెంటనే సూదితో గుచ్చినట్లు ఉండి కొండి యందలి రంధ్రము ద్వారా విషము శరీరంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతము అంతా నిప్పుతో కాల్చినట్లు మంట కలుగును. కాళ్ళు , చేతుల యందు కుట్టినచో విషము గజ్జలు , చంకల వరకు వ్యాపించి కొంతసేపు ఉండి మరలా కాటు ప్రదేశమును చేరును . అచ్చట 24 గంటల కాలము పోటు , నొప్పి , పగలగొట్టుచున్నట్లు బాధ కలుగును. దీని విషము పూర్తిగా రక్తములోకి ప్రవేశించక పోయినప్పటికీ తేలు విషము నందు ఆమ్ల ,తీక్ష , ఉష్ణ గుణములు ఉండుటచేత చర్మము కిందనే ఉండి మంట, పోటు కలిగించును.

 తేలు కుట్టినప్పుడు చేయవలసిన చికిత్సలు  -

 *  ఎటువంటి తేలు కుట్టినను , మండ్రగబ్బ కరిచినను కుట్టిన ప్రదేశము నందు తడిపి జీలకర్ర , సైన్ధవ లవణం కలిపి నూరి నేతిలో వేయించి దానిని ఒక గుడ్డలో పోసి కుట్టిన ప్రదేశము నందు కాపడం పెట్టి ఆ గుడ్డతోనే కట్టు కట్టవలెను . ఆ తరువాత పసుపు , నీరుల్లిపాయ కలిపి ఆ ప్రదేశము నందు నెమ్మదిగా రుద్దవలెను . ఆ తరువాత తులసి , వెన్న , గోమూత్రము కలిపి నూరి కుట్టినచోట లేపనం చేయవలెను .

 *  కప్పు వేడినీటిలో చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ త్వరగా తగ్గును.

 *  గచ్చకాయ పగలగొట్టి దానిలోని పప్పును రెండు నీటిచుక్కలు వేసి అరగదీసి ఆ గంధాన్ని కుట్టినచోట రాసి నిప్పు వేడి చూపిస్తే విషాన్ని లాగివేస్తుంది. ఇదేవిధంగా కుంకుడుకాయ పై గుజ్జు గంధాన్ని వ్రాసి సెగ చూపించినా బాధ పోవును .

 *  ఎండిపోయిన గుమ్మడికాయ ముచ్చిక నీటితో అరగదీసి కుట్టినచోట రాయుచున్న బాధ తగ్గును. వసకొమ్మును అరగదీసి రాయుచున్న కూడా పనిచేయును .

 *  గుగ్గిలం పొడి కుట్టినచోట పెట్టి నిప్పువేడి చూపించుతున్న విషాన్ని లాగివేయును.

 *  తేలు కుట్టిన వెంటనే ఉత్తరేణి ఆకులను నలిపి కుట్టిన ప్రదేశములో రుద్దిన విషం విరుగుతుంది.

 *  జీలకర్రను నూరి కుట్టినచోట అంటించి నిప్పు వేడి చూపించుతున్న విషాన్ని బయటకి లాగును .

 *  పసుపును చిక్కగా నీటితో కలిపి కుట్టినచోట పెట్టి సెగ చూపించుతున్న అది ఆరుతున్న కొద్ది బాధ తగ్గును.

 *  రుద్రజడ ఆకులు నలిపి కుట్టినచోట రుద్దితే విషం తగ్గుతుంది . కుట్టిన వెంటనే నిప్పుని కుట్టినచోట నొక్కిపెట్టి వెంటనే తీసివేసిన బాధ వెంటనే తగ్గును. దీనికి కారణం నిప్పు తడిని అతివేగముగా లాక్కుంటుంది. తేలు విషం కూడా అతిస్వల్ప తడి ద్రవం.

 *  నేపాళం గింజలొని పప్పు జిల్లేడు పాలతో కలిపి నూరి కుట్టినచోట అంటించుతున్న విషాన్ని గుంజివేయును . ఈ పద్ధతితో నేను చికిత్స చేశాను . ఇది నా అనుభవయోగం .

          ఇప్పుడు మీకు తేలు కుట్టినప్పుడు ఏయే లక్షణాలు కనిపిస్తే రోగి మరణించునో తెలియచేస్తాను.

         కన్నులు , ముక్కు, నాలుక ఇవి వాని యొక్క సహజ గుణములు పొగొట్టుకొని విపరీత గుణములు అనగా కన్నులు సరిగ్గా చూడలేకపోవుట , ముక్కు వాసనని గుర్తించలేకపోవుట , నాలిక రుచిని గ్రహించకపోవుట , శరీరము నందు కాలినట్లు బొబ్బలు , వాపు కలుగుట , నొప్పి , జ్వరం , వాంతి కలిగి గాయము నందలి మాంసము ఊడిపడిపోవుట వంటి లక్షణాలు తేలు కుట్టిన రోగికి కలిగినచో ఆ రోగికి చికిత్స చేసినను బ్రతకడు . ఈ లక్షణాలు చికిత్స సమయానికి అందకుండా ఆలస్యం అవుతున్నకొలది మొదలై చివరకు ప్రాణాలు హరించును .

ప్రాచీన భారతీయ పురాణాలలో వివరించినటువంటి "బ్రహ్మస్త్రం" గురించి సంపూర్ణ వివరణ - brahmastram

   మన భారతీయ పురాణాలు చదివినవారికి "బ్రహ్మస్త్రం " అనే పేరు అత్యంత సుపరిచితం అయినదే ముఖ్యంగా రామాయణ , మహాభారతాలలో ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ బ్రహ్మస్త్ర ప్రయోగం మరియు దాని వివరాలు గురించి భారతీయులమైన మనకంటే పాశ్చాత్య శాస్త్రజ్ఞులకు ఈ విషయాల గురించి సంపూర్ణ అవగాహన ఉన్నది. దీనికి ప్రధాన కారణం మనం నిర్లక్ష్యం చేసి వదిలివేసిన ఎన్నో అద్భుతగ్రంధాలు మరియు విజ్ఞానాన్ని వారు అర్థం చేసుకుని ఆదరించడమే . అలాంటి కొన్ని విజ్ఞానదాయకమైన విషయాలు మరుగునపడిపోయిన ఎన్నో విషయాలను మీకు తెలియచేయడానికి నావంతు ప్రయత్నం చేస్తున్నాను . ఇప్పుడు మీకు ప్రాచీన భారతీయ యుద్ధాలలో ఉపయోగించిన "బ్రహ్మస్త్రం" అనే ఒక భయంకర ఆయుధం గురించి వివరిస్తాను. దీనినే మనం ఈ ఆధునిక యుగంలో "ఆటంబాంబు " అని పిలుచుకుంటున్నాం.

                1945 వ సంవత్సరం జులై 16 వ సంవత్సరం తెల్లవారుజామున 5:30 సమయములో న్యూమెక్సికో ఎడారిలో ఒక బాంబు పరీక్షించారు. ఈ ప్రయోగం సరిగ్గా హిరోషిమా నగరం పైన అణుబాంబు ప్రయోగించడానికి నెలరోజుల ముందు జరిగింది. ఈ ప్రయోగం జరిగిన  తరువాత ఓపెన్ హమీర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త రోచస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక విద్యార్థి "మీ ప్రయోగం ప్రపంచంలో మొదటిసారే కదా ?" అని అడిగినాడు . అందుకు హమీర్ అవును ఇది ఈ ఆధునిక కాలంలో మాత్రం మొదటిది అని భారతదేశంలో జరిగిన పురాతన యుద్ధగాథలు , మహాభారతం గురించి వివరించాడు.

          ప్రాచీన భారతీయ పురాణాలలో బ్రహ్మస్త్రం గురించి ఈ విధముగా ఉన్నది. "అది ఒక్కటే బాణం కాని ఈ విశ్వశక్తి మొత్తం దానిలో ఇమిడి ఉన్నది. పదివేల సూర్యులు పగిలినట్లు మంటలు లేచి గగనాన్ని దేదీప్యమానం చేశాయి. ఒక ఇనుప పిడి లాంటి దానితో బిగించిన ఆయుధం ఇది. అజేయమైన మృత్యుసందేశాన్ని తెచ్చిన పిడుగు అది . సమస్త భవనాలను , కందకాలను బూడిద చేసివేసింది. కాలిపోయిన మనుష్యులెవరో గుర్తుపట్టటానికి వీలుకాలేదు . వెంట్రుకలు , గోళ్లు , కండ్లు , పండ్లు ఊడిపడిపోయాయి . పక్షులు , పశువులు , వృక్షాలు చచ్చి తెల్లగా మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారధాన్యాలు , వాతావరణం విషతుల్యం అయిపోయాయి. సైనికులు బావులలో , నదులలో దూకి మంటలు ఆర్చుకున్నారు" అని చెప్పబడినది. దీని గురించి మరిన్ని విషయాలు    " with out trace " అను గ్రంధమున ఉదహరించారు. ఈ హమీర్ అనే శాస్త్రవేత్త సంస్కృతంలో మంచి పండితుడు . ఈయన న్యూ మెక్సికోలో అటామిక్ బాంబు పరిశోధనాలయా డైరెక్టర్ గా వ్యవహరించారు.

           సుప్రసిద్ద సోవియట్ పండితుడు అయిన A .A . గోర్బోవిస్కీ తన గ్రంథం "book of హైపోథెసిస్ " లో కూడా చాలా వివరణలు ఇచ్చారు .  మన ప్రాచీన భారతీయులకు అణ్వస్త్ర విషయాల గురించి సంపూర్ణంగా తెలుసు. హరప్పా, మొహంజదారో నాగరికతలు విరాజిల్లిన కొన్ని ప్రదేశాలలో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడి వీధుల్లో నల్లగా కాలిపోయిన ముద్దల వంటి పదార్థం దొరికింది . మొదట శాస్త్రవేత్తలకు అది ఎలాంటి పదార్థమో అంతుబట్టలేదు . దానిని ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు అది మట్టితో చేసిన కుండపెంకులుగా నిర్దారించబడినవి . ఆ పదార్థం తీవ్రమైన వేడికి కరిగిపోయినదిగా నిర్దారించబడినది. అంతేకాదు ఆ పదార్థం తీవ్రమైన రేడియేషన్ కి గురిఅయ్యినది. ఉండవలసిన రేడియేషన్ స్థాయి కంటే కొన్ని వందల రెట్ల రేడియేషన్ ప్రభావం కనిపించింది.

                 4000 సంవత్సరాల క్రితం మరణించిన ఒక వ్యక్తి అస్థిపంజరంలో మామూలు ప్రమాణం కంటే ఎన్నో వందలరెట్ల రేడియోధార్మికత కనిపించింది. ఈ బ్రహ్మస్త్రాన్ని గురించి దక్షిణ అమెరికాలో కొన్ని పురాతన గ్రంథాలలో కూడా వివరణ ఉన్నది. అక్కడి గ్రంథాలలో దానిని        "మాష్ మాకి " అనే పేరుతో పిలుస్తారు . భారతీయ ప్రాచీన వైమానిక శాస్త్రం అయినటువంటి "సమరాంగణ సూత్రధార " లో కూడా ఈ విషయాల గురించి వివరణ ఉన్నది.

          ఇలాంటి ఎన్నో రహస్యమైన భయంకర ఆయుధాలు మరియు పుష్పక విమానాలు వంటి వాటిని మరియు ఎన్నో రహస్య విద్యలకు సంబంధించిన సమస్త సమచారాన్ని కొన్ని రహస్య ప్రదేశాల్లో మన పూర్వీకులు దాచి ఉంచారు .

Wednesday, January 29, 2020

శరీర పరిశీలన body identification

1.  మీ నోరు నిద్ర లేచిన వెంటనే దుర్వాసన రాకుండా లాలాజలం తియ్యగా ఉంటే, మీలో ఉన్న 70 శాతం నీరు పరిశుభ్రంగా ఉన్నట్లు తెలుసుకోవచ్చు. 

2.   మీ నాలుక మీద పాచి మందంగా లేకుండా, నాలుక చేదు లేకుండా పరిశుభ్రంగా ఉంటే మీ జీర్ణాశయం పరిశుభ్రంగా ఉన్నట్లు అంచనా వేయవచ్చు. 

3, స్నానం చేయకపోయినా సబ్బు పెట్టకపోయినా, మీ చెమట కంపు కొట్టకూడదు. అలా ఉంటే మీ చర్మం పూర్తిగా పరిశుభ్రంగా ఉన్నట్లు లెక్క. 

4, మీరు ఎప్పుడు మూత్రం పోసినా, బాత్‌రూంమ్‌లో నీరు పోయక పోయినా మీ బాత్‌రూం కంపు కొట్టకూడదు. మీ మూత్రం ఎప్పుడూ పలుచగా, తెల్లగా వస్తూ ఉంటే, మీ లోపల ఉన్న 5 లీటర్ల రక్తం యొక్క పరిశుభ్రతను గమనించవచ్చు. 

5, మీ విరేచనం ఎప్పుడు వచ్చినా ప్లేటుకు అంటకుండా మరకలు పడకుండా, వాసన లేకుండా, క్షణాల్లో బయటకు వచ్చేస్తుంటే, దాన్ని బట్టి మీ లోపల ఉండే కోటానుకోట్ల జీవకణాల పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. 

ఇప్పటి వరకూ చెప్పిన ఐదు విషయాల్లో వాసన లేకుండా గనుక ఉంటే, మీ శరీరం లోపల పరిశుభ్రంగా, ప్రశాంతమైన వాతావరణంలో మీ అవయవాలన్నీ జీవిస్తున్నాయని తెలుసుకోండి. లేదా వాసనలు ఎంత గాఢంగా వస్తూ ఉంటే, మీ లోపల అంత మురుగు గుంట వాతావరణం ఉన్నట్లుగా గ్రహించండి.

పరిశుభ్రత మీ శరీరంలో వచ్చేటట్లు చేయడానికి రోజుకు 4,5 లీటర్లు నీళ్లు తాగడం, 2, 3 సార్లు సాఫీగా విరేచనానికి వెళ్లడం, ఎంతో కొంత వ్యాయామం చేయడం, రోజుకు 50 - 60 శాతం ప్రకృతి సిద్ధమైన ఆహారం (వండని) తినడం, మాంసాహారాన్ని మానడం మొదలగునవి చేయండి. త్వరలో మీరు అలాంటి పరిశుభ్రతను అనుభవించగలరని ఆశిస్తున్నాను. 

Let’s keep on maintaining healthy habits.

ప్రాణాయామం : PRANAYAMA

Bhattacharya:
ప్రాణాయామం :

I. ప్రాణాయామ విశేషాలు

II. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు

III. తీసుకోవలసిన జాగ్రత్తలు

IV. వివిధ ప్రాణాయామ విధానాలు

1. నాడీ శోధన ప్రాణాయామం

2. భస్త్రిక ప్రాణాయామం

a. చంద్రాంగ భస్త్రిక

b. సూర్యాంగ భస్త్రిక

c. సుషుమ్న భస్త్రిక

d. చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక

3. భ్రామరి ప్రాణాయామం

4. శీతలి ప్రాణాయామం

5. శీతకారి ప్రాణాయామం

6. సూర్య భేది ప్రాణాయామం

7. చంద్ర భేది ప్రాణాయామం

8. ఉజ్జయి ప్రాణాయామం

9. మూర్చప్రాణాయామం

10. ప్లావని ప్రాణాయామం

11. కపాలభాతి ప్రాణాయామం

I.ప్రాణాయామ విశేషాలు:

ప్రాణం + ఆయామం = ప్రాణాయామం, ప్రాణం వుంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుటలేక నియంత్రించియుంచుట అని అర్థం. ఇఃకో అర్థంలో ప్రాణాయామం అంటే ప్రాణాన్ని కష్ట పెట్టడం అని కూడా అర్థం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్రాల ప్రకారం శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించి యుంచడమే ప్రాణాయామం అని తీర్మానించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్ధం చేయడం ద్వారా అంతర్గత  ప్రాణాన్ని కూడా అదుపులో వుంచవచ్చు.

నాడీ మండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచరిస్తూ వుంటుంది. ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ లభిస్తాయి. కనుకనే “ప్రాణాయామేన యుత్తేన సర్వరోగ క్షయం భవేత్ ” అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచారం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములను 5 రూపాలు వున్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్మానం గుదం, సమానానికి స్మానం నాభి, ఉదానానికి స్మానం కంఠం, వ్యానానికి స్థానం శరీరమంతా, శ్వాస క్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్త ప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి.

శ్వాసను బయటికి వదిలే క్రియను రేచకం అని, లోపలికి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని నిలిపి వుంచడాన్ని అంతర్ కుంభకం అని, తిరిగి బయటికి వదిలి ఆపివుంచడాన్ని బాహ్య కుంభకం అని అంటారు. యీ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.

మెడికల్ సైన్సు ప్రకారం రెండు ముక్కు రంధాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు యీ రెండిటికి మధ్య గల భేదం గ్రహించారు. వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందువల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్ర ప్రభావం చల్లని దనం, అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. యీ రెండిటికి మధ్య సమన్వయం సాధించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం యివ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ఠ అను అక్షరం సూర్యుడికి గుర్తులుగా నిర్మారించారు. అందువల్ల హఠయోగం వెలువడింది. హఠయోగమంటే చంద్రసూర్యనాడులకు సంబంధించిన విజున మన్నమాట. హఠం అనగా బలవంతం అని కాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర సూర్య స్వరాలకు (స్వరము అంటే శ్వాస) సంబంధించినదే.

II. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు:

1) ఊపిరితిత్తులు బాగా పని చేస్తాయి.

2) శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.

3) రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా బయటికి వెళ్ళి సత్తువ లభిస్తుంది.

5) మెదడు చురుగ్గా పని చేస్తుంది.

6) పేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.

7) జఠరాగ్ని పెరుగుతుంది.

8) శరీరం ఆరోగ్యంగా వుంటుంది.

9) ఆయువు పెరుగుతుంది. యిది అన్నిటి కంటే మించిన విశేషం.

III. తీసుకోవలసిన జాగ్రత్తలు:

1) మైదానంలో గాని, తోటలో గాని, తలుపులు తెరిచి యున్న గదిలో గాని, కంబళీ లేక బట్టలేక ఏదేని ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.

2) గాలి విపరీతంగా వీస్తూ వుంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.

3) మురికిగా వున్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం ప్రాణాయామం చేయకూడదు.

4) సిగరెట్టు, బీడీ, చుట్ట పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.

5) పొట్ట నిండుగా వున్నప్పుడు ప్రాణాయామం చేయకూడదు.

6) ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా యితర యోగాసనాలు చేయవచ్చు. అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.

7) ప్రాణాయామం చేస్తున్నప్పడు బట్టలు తక్కువగాను, వదులుగాను ధరించాలి.

8) పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువైన ఆసనాలు. నేల మీద కూర్చో లేని వాళ్లు కుర్చీ మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.

9) నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా వుంచి ప్రాణాయామం చేయాలి.

10) ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఒక సారి కుడి ముక్కు రంధాన్ని మరో సారి ఎడమ ముక్కు రంధాన్ని మూయ వలసి వస్తుంది. కుడి ముక్కు రంధాన్ని కుడి చేతి బొటన ప్రేలితోను, ఎడమ ముక్కు రంధాన్ని కుడి చేతి ఉంగరం ప్రేలితోను మూయాలి.

11) ముక్కు రంధాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనే తి క్రియులు సక్రమంగా చేయూలి. అలా చేస్తే ప్రాణాయామం చేస్తున్నప్పడు శ్వాస సరిగా

ఆడుతుంది.

12) ప్రాణాయామ క్రియలు చేసూ వున్నప్పడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస ప్రక్రియలపై కేంద్రీకరించాలి. వేరే యోచనలకు తావుయీయ కూడదు.

IV. వివిధ ప్రాణాయామ విధానాలు:

పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి యొక్క శ్వాస ప్రశ్వాసలు అడుతూనే వుంటాయి. వీటిని మనస్సు గ్రహించగలగడమే ప్రాణాయామం అన్నమాట. యోగాభ్యాసం చేస్తున్నప్పడు శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం జరుగుతుంది.

అందువల్ల ప్రతి ఆసనం ప్రాణాయనామంతో పరిణతి సాధిస్తుంది. ప్రాణాయామాల్ని ప్రత్యేకించి 108 విధాలుగా విభజించారు. అయితే వాటిల్లో 8–10 ముఖ్యమైనవి.

1) నాడీ శోధన ప్రాణాయామం,
2) భస్త్రిక ప్రాణాయామం,
3) భ్రామరి ప్రాణాయామం,
4) శీతలీ ప్రాణాయామం,
5) శీతకారి ప్రాణాయామం,
6) సూర్యభేది ప్రాణాయామం,
7) చంద్రభేది ప్రాణాయామం,
8) ఉజ్జయీ ప్రాణాయామం,
9) మూర్చప్రాణాయామం,
10) ప్లావని ప్రాణాయామం,
11) కపాలభాతి ప్రాణాయామం.

1. నాడీశోధన ప్రాణాయామం:

దీన్ని సరళ ప్రాణాయామం లేక అనులోమ విలోమ ప్రాణాయామం అని కూడా అంటారు.

విధానం :
నిటారుగా కూర్చొని, కండు మూసుకొని, రెండు కనుబొమల మధ్య గల భృకుటి మీద కొద్దిసేపు దృష్టి సారించాలి. ఆ తరువాత కుడి చేతి బోటన ప్రేలితో కుడి ముక్కు రంధాన్ని మూసి, ఎడమ ముక్కు రంధాన్నుంచి, మొదట లోపలి గాలిని మెల్లగా బయటికి వదలాలి. తరువాత ఎడమ రంధ్రం నుంచి గాలిని లోనికి పీల్చాలి. లోపల గాలి నిండిన తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరం ప్రేలితోమూసి కుడి ముక్కు రంధాన్నుంచి నెమ్మదిగా వదలాలి. తిరిగి కుడి ముక్కు రంధాన్నుంచి గాలిని పీల్చాలి. దీనితో ప్రాణాయామ క్రమం ఒకటి పూర్తి అవుతుంది. మొదట మూడు క్రమాలు, తరువాత వీలును బట్టి ఎన్ని క్రమాలైనా చేయవచ్చు.

ప్రారంభంలో రేచకం, తరువాత పూరకం చేయాలి. కొద్ది రోజులు అభ్యాసం అయిన తరువాత అంతర్ కుంభకం చేయాలి. అది అభ్యాసం అయిన కొద్ది రోజుల తరువాత బాహ్య కుంభకం కూడా చేయాలి. కొద్ది రోజుల అభ్యాసం తరువాత వీటిని చేయు సమయం క్రింది విధంగా నిర్ణయించాలి.

1) రేచకం 10 సెకండు
2) బాహ్యకుంభకం 5 సెకండు
3) పూరకం 5 సెకండు
4) అంతర్ కుంభకం 20 సెకండు

అనగా 2/1/1/4 మాత్రల సమయ విధానమన్నమాట. బాగా ప్రాక్టీసు అయిన తరువాత రేచకం 64 సెకండు, బాహ్యకుంభకం 2 సెకండు, పూరకం 2 సెకండు, అంతర్ కుంభకం 128 సెకండ్ల సేపు చేయవచ్చు సెకండ్లు తెలిపే గడియారం ఎదురుగా పెట్టుకొని జాగ్రత్తగా యీ క్రియలు చేయాలి.

లాభాలు :
యీ ప్రాణాయామం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి తగుతాయి. టెన్షను వుండదు. మనస్సుకు శాంతి లభిస్తుంది. ముక్కు రంధ్రాలు, నరాలు శుభపడతాయి.

2. భస్త్రిక ప్రాణాయామం:

భస్త్రిక అంటే కొలిమి తిత్తి అని అర్ధం. కొలిమితిత్తి కొలిమికి గాలి అందజేస్తుంది. యీ క్రియ యందు ముక్కుతో పీల్చే గాలి కొలిమి తిత్తి గాలిలా ధ్వని చేస్తుంది.

విధానం :
ఇది నాలుగు రకాలు

(1) చంద్రాంగ భస్త్రిక,
(2) సూర్యాంగ భస్త్రిక,
(3) సుషుమ్న భస్త్రిక,
(4) చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక.

a. చంద్రాంగ భస్త్రిక:

కూర్చొని లేక నిలబడి కూడా యీ క్రియ చేయవచ్చు. నడుము, వీపు, వెన్నెముక, మెడను నిటారుగా వుంచి కుడి ముక్కు రంధాన్ని కుడి చేతి బొటన ప్రేలుతో మూయాలి. ఎడమ ముక్కు రంధ్రాన్నుంచి ఫోర్సుగా గాలిని వదిలి వెంటనే గాలిని ఫోర్సుగా పీల్చాలి, వరుసగా 10 సార్లు గాని లేక సాధ్యమైనంత వరకు గాని యీ క్రియ చేసూ వుండాలి. కొలిమి తిత్తితో వూదినట్లు గాలి స్వరూపం ఉండాలి. రేచకంతో బాటు నాభిని లోనికి ముడవాలి. పూరకంతో బాటు నాభిని, పొట్టను ఉబ్చిసూ వుండాలి. ఈ క్రియను రక్తపు పోటు, ఉష్ణం వున్నవాళ్లు ఎక్కువగా చేయాలి. ఉబ్బసం వున్నవాళ్లు తక్కువగా చేయాలి.

b. సూర్యాంగ భస్త్రిక:

ఎడమ ముక్కు రంధాన్ని ఉంగరం ప్రేలితో మూసి కుడి ముక్కు రంధ్రంతో పై విధంగా ఫోర్చుతో చేయాలి. శరీరంలో శీతలం ఎక్కువగా వున్న వాళ్లు, శ్వాస బాధ వున్న వాళ్లు యీ క్రియ ఎక్కువగా చేయాలి. రక్తపుపోటు, ఉష్ణం వున్నవాళ్లు తక్కువగా చేయాలి.

c. సుషుమ్న భస్త్రిక:

కుడి ముక్కు రంధాన్ని కుడి బొటన ప్రేలితో మూసి ఫోర్సుతో ఎడమ ముక్కు రంథాన్నుంచి గాలిని వదలాలి. ఎడమ ముక్కు రంథాన్నుంచి ఫోర్సుగా గాలిని పీల్చి ఉంగరం ప్రేలితో ఎడమ ముక్కు రంధాన్ని మూసి కుడి ముక్కు రంధాన్నుంచి ఫోర్సుగా వదలాలి. వెంటనే కుడి రంథ్రాన్నుంచి పీల్చాలి. యీ విధంగా కుడి, ఎడమ ముక్కు రంధ్రాల ద్వారా గాలిని మాటిమాటికీ సాధ్యమైనంత సేపు వదులుతూ పీలుస్తూ ఉండాలి. పొట్టను త్వరత్వరగా వెనుకకు ముందుకూ కదుపుతూ ఉండాలి. నాడీ శోధన ప్రాణాయామం వలె ఇది త్వరగా జరిపే శ్వాస ప్రశ్వాసల ప్రక్రియ. దీనివల్ల పొట్ట యందలి పెద్ద చిన్న పేగులకు, లివరు, స్త్రీను, మూత్రపిండాలు, పేంక్రియాస్ గ్రంధులకు స్ఫూర్తి లభిస్తుంది.

d. చంద్రాంగ సూర్యాంగ భస్త్రిక:

రెండు ముక్కు రంధాల నుంచి గాలిని ఫోర్చుగా వదిలి తిరిగి పీలుసూ వదులుతూ వుండాలి. నాభిని లోనికి గుంజుతూ, ఉబ్బిస మెల్ల మొల్లగా గాలిపేగం పెంచాలి. కొలిమితిత్తి నుంచి వెలువడే విధంగా గాలిపేగం వుండాలి. శక్త్యానుసారం యీ క్రియను చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవాలి. పొట్ట యం

దు ఉష్ణం పెంచుటపై ధ్యానం నిలపాలి. ఆరోగ్యంగా వున్న వాళ్లు భస్త్రిక ప్రాణాయామం చేయాలి. గుండె జబ్బు, రక్తపువోటు, అల్సరు, కళ్లు త్రిప్పట వున్నవాళ్లు యీ క్రియ చేయకూడదు. యీ క్రియ చేయు వారు వెన్న పాలు, నెయ్యి వాడుతూ వుండాలి.

లాభాలు :
భస్త్రిక ప్రాణాయామం వల్ల కొవ్వు, స్థూలకాయం తగ్గుతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. శ్లేష్మం తగ్గి ఉష్ణం పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ఆస్తమా” తగుతుంది. శారీరిక మానసిక శక్తి పెరిగి మెదడు చురుగా పని చేస్తుంది.

3. భ్రామరి ప్రాణాయామం:

భ్రమరం అంటే తుమ్మెద, తుమ్మెద ఝంకారంలా ధ్వని వచ్చే ప్రాణాయామం కనుక దీనికి (భామరి ప్రాణాయామం అని పేరు వచ్చింది.)

విధానం:
నిటారుగా కూర్చొని, రెండు చెవుల్లో రెండు బొటన వ్రేళ్లు పెట్టి వుంచాలి. మోచేతుల్ని భుజాలతో సమానంగా ఎత్తి పూరకం చేసి గాలిని కుంభకం చేయాలి. తరువాత లోపలి గాలిని తుమ్మెద రంకారంలా  చేస్తూ నోరు మూసి వుంచి, ముక్కు రంధ్రాల ద్వారా రేచకం చేయాలి. నాలుకను సామాన్య స్థితిలోనే వుంచాలి. ప్రారంభంలో ఒక్క పర్యాయం చేసి, తరువాత ఇరవై సార్ల వరకు చేయవచ్చు. ఏకాంతంలో ప్రశాంతంగా కండ్లు మూసి యీ ప్రాణాయామ క్రియ చేయాలి.

లాభాలు :
ఈ ప్రాణాయామం వల్ల కంఠం తీయగా, కోమలంగా, లయబద్ధంగా వుంటుంది. గొంతుకు సంబంధించిన జబ్బులు రావు, వచ్చిన జబ్బులు నయమవుతాయి. మెదడు శుద్ధి అవుతుంది. టెన్షను తగుతుంది.

సూచన :
మనస్సును ధ్యానంలో లీనం చేసి, భ్రామరీ ప్రాణాయామ క్రియ కావించి, తరువాత మనస్సును సామాన్య స్థితికి తీసుకొని రావాలి.

శిశువు జన్మించగానే రోదిస్తాడు. అదే ప్రధమ భ్రామరీ క్రియ.

4. శీతలి ప్రాణాయామం:

విధానం :
నాలికను ముందుకు చాపి, గొట్టంలా మడిచి నెమ్మదిగా ధ్వని చేస్తూ, నోటి ద్వారా గాలిని లోనికి పీల్చి, గాలిని ముక్కు రంధాల నుంచి రేచకం చేయాలి. నాలికను అంగిడికి అంటించి ధ్వని చేస్తూ నాలిక మధ్య నుంచి గాలి పీల్చి నోరు మూయాలి. తిరిగి ముక్కునుంచి వదిలివేయాలి. మొదట మూడు సార్లు, తరువాత పదిహేను సార్లు చేయవచ్చు. వేసవి కాలంలో చేయాలి. చలికాలంలో ఎక్కువగా చేయకూడదు. దాహంవేస్తే, త్రాగుటకు మంచి నీళ్లు దొరక్కపోతే యీ ప్రాణాయామ క్రియ చేస్తే నీరు లేకుండానే దాహం తీరుతుంది.

లాభాలు :
రక్తపు పోటు వున్నవారికి ఎంతో ప్రయోజనకారి. నోరు, గొంతు, నోటిలో  బొబ్బలు, టాన్సిళ్లు, చర్మరోగాలు, కండ్ల వేడి యీ ప్రాణాయామ క్రియ వల్ల తగుతాయి.

5. శీతకారి ప్రాణాయామం:

విధానం :
కూర్చొని రెండు పళ్ల వరసలు నొక్కి పట్టి, నాలుక కొసను పళ్ల లోపలి భాగానికి ఆనించి, నాలుక మిగతా భాగాన్ని నోటి లోపలి భాగానికి అన్చాలి. పెదవులు తెరచి వుంచి గాలిని పళ్ల మధ్య నుంచి లోనికి పీల్చాలి.

గాలిని లోనికి పీల్చిన తరువాత పెదవుల్ని మూసివేయాలి. పీల్చిన గాలిని కొద్దిసేపు లోపల ఆపి, తరువాత ముక్కు రంధాల నుంచి బయటికి వదిలి వేయాలి. ప్రారంభంలో మూడు సార్లు, తరువాత పదిహేను లేక ఇరవై సార్లు  ప్రాణాయామ క్రియను చేయాలి.

సూచన :
యీ క్రియను చలికాలంలో చేయకూడదు. వేసవి కాలంలో చేయాలి. శ్లేష్మం ఎక్కువగా వున్న వాళ్లు యి” క్రియను చేయకూడదు.

లాభాలు :
శీతలి ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలన్నీయీ ప్రాణాయామం వల్ల కలుగుతాయి. నోరు పూర్తిగా చల్ల బడుతుంది.

6. సూర్య భేది ప్రాణాయామం:

విధానం :
కుడి ముక్కు రంధ్రాన్ని సూర్యనాడి లేక సూర్య స్వరం అని, ఎడమ ముక్కు రంథాన్ని చంద్ర నాడి లేక చంద్ర స్వరం అని పేర్కొన్నాము. యీ క్రియ యందు ప్రతి పర్యాయం సూర్యనాడి నుంచి అనగా కుడి ముక్కు రంధాన్నుంచి గట్టిగా నెమ్మదిగా గాలి పీల్చి చంద్రనాడి నుంచి అనగా ఎడమ ముక్కు రంధ్రాన్నుంచి వదలాలి. ప్రారంభంలో రెండు సార్లు తరువాత పది పదిహేను సార్లు చేయవచ్చు. ఉష్ణం పెంచుతుంది గనుక యీ క్రియను వేసవి కాలంలో చేయకూడదు.

లాభాలు :
దీని వల్ల కఫం, దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. శరీరబలం పెరుగుతుంది.

సూచన :
ఉష్ణం ఎక్కువగా వున్నవాళ్లు, హెచ్చు రక్తపుపోటు వున్న వాళ్లు జాగ్రత్తగా కొద్దిసేపు చేయాలి.

7. చంద్ర భేది ప్రాణాయామం:

విధానం :
యీ క్రియ యందు ప్రతి పర్యాయం చంద్రనాడి నుంచి అనగా ఎడమ ముక్కు రంధాన్నుంచి గాలి గట్టిగా నెమ్మదిగా పీల్చి, సూర్యనాడి నుంచి అనగా కుడి ముక్కు రం(ధాన్నుంచి వదలాలి. దీన్నివేసవి కాలంలో చేయాలి.

లాభాలు :
దీని వల్ల శరీరానికి చల్లదనం వస్తుంది. పెట్టాబ్లడ్ (పెషరు, కోపం తగ్గుతాయి.

సూచన
ఆస్తమా రోగులు యీ ప్రాణాయామం చేయకూడదు.

8. ఉజ్జాయి ప్రాణాయామం :

విధానం :
ఈ ప్రాణాయామం చేయునప్పుడు గొంతు నుంచి పెద్దగా ధ్వని రావాలి. పూరకం చేసి కుంభకం చేయాలి, పూరకం, రేచకం రెండూ, నాసికా రంధాల రెండిటి ద్వారా చేయాలి. యిందు గొంతును కొంచెం ముడిచి, నాలుకను మడిచి నోటి లోపలి అంగిడికి అంటించి, ముక్కు రంధాలనుంచి గాలిని లోనికి పీల్చాలి. తరువాత అదే విధంగా లోపలి గాలిని చేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా బయటికి వదలాలి.

లాభాలు :
ఉజ్జయీ ప్రాణాయామం వల్ల కంఠం, ఊపిరితిత్తులు, గుండెపై మంచి ప్రభావం పడుతుంది. ముక్కు- చెవి, గొంతుకు సంబంధించిన జబ్బులు దగు, ఆస్తమా, బ్లడ్ ప్రషర్,  తగ్గుతాయి

.

9. మూర్చ ప్రాణాయామం :

విధానం :
రెండు ముక్కు రంధాల నుంచి గాలిని లోనికి పీల్చి చుబుకాన్ని ఛాతీకి ఆనించి అంటే జాలంధర బంధం చేసి సాధ్యమైనంత సేపు గాలిని లోపల ఆపాలి. తల తిరిగినట్లు అనిపిస్తుంది. అప్పడు మెల్లగా గాలిని ముక్కు రంధాల నుంచి వదలాలి. ఇది కొంచెం కఠినమైన క్రియ. మొదట జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో ఈ క్రియ చేయడం మంచిది.

లాభాలు :
దీని వల్ల మెదడుకు శాంతి లభించి చురుకుదనం లభిస్తుంది.

సూచన :
పిచ్చి వున్నవాళ్లు యీ క్రియ చేయకూడదు.

10. ప్లావనీ ప్రాణాయామం :

విధానం
నిటారుగా కూర్చొని నోటితో శ్వాసను ఒక్కొక్క గుక్కగా లోపలికి పీల్చాలి. పొట్టను ఉబ్చిస్తూ వుండాలి. ఆ గాలిని లోపల ఆపి కొద్దిసేపు కుంభకం చేయాలి. తరువాత వంగి నాలుకను బయటకు పెట్టి గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలి పేయాలి. మొదట ఒకటి రెండు సార్లు చేయాలి.

లాభాలు
యీ క్రియవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. పని చేయుటకు ఉత్సాహం పెరుగుతుంది. మెదడుకు సంబంధించిన వ్యాధులకు యిది పని చేస్తుంది. బాగా అభ్యాసం చేసిన తరువాత యీ ప్రాణాయామం చేస్తూ నీళ్లపై నావవలె తేలుతూ ఉండవచ్చు.

9. కపాలభాతి ప్రాణాయామం:

దీనికి కపాల శుద్ధి అని అర్థం. యీ క్రియ వల్ల మెదడు చురుగ్గా వుంటుంది. జ్ఞానం పెరుగుతుంది. నాభి వరకు గాలిని లోపలికి బాగా పీల్చాలి. తరువాత ఆ గాలిని ఫోర్సుగా బయటికి వదలాలి. బయటికి వదిలివేసే గాలికి వత్తిడితో కూడిన గట్టి ఫోర్సు వస్తుందన్నమాట. శక్తిని బట్టి మూడు నాలుగు నిమిషాలు వరకు యీ క్రియను చేయవచ్చు. శ్వాస సహజంగా లోనికి వస్తుంది. యీ క్రియ చేయునప్పుడు ముక్కు ద్వారా ధ్వని రావాలి.

వీలును, సమయాన్ని అవసరాన్ని బట్టి పైన తెలిపిన వివిధ ప్రాణాయామ క్రియలు ప్రశాంత హృదయంతో చేసి సాధకులు లాభం పొందాలి.

ఔత్సహికుల అవగాహన కోసం కొన్ని ప్రాణాయామ పద్ధతులు అవగాహన కోసము ఇచ్చాము. వీటిని నిష్ణాతుడైన ఆచార్యుని వద్ద నేర్చుకొని practice చేయుట ఉత్తమము. శుభం భూయాత్.