Monday, January 20, 2020

"గ్రుడ్డు" కు కూడా ప్రాణం ఉంది about egg

🐓 "గ్రుడ్డు" కు ప్రాణం లేదు దానిని తినవచ్చు అని చాలామంది అంటూంటారు . . .

🐓 "గ్రుడ్డు"కు కూడా "ప్రాణం" ఉంది. "గ్రుడ్డు" అంటే "కోడి" యొక్క "పిండం" అదే "ప్రాణి"గా బయటకు వస్తుంది . . .

🐓 మరి మానవుల "స్త్రీ లలో" "పిండం" పడిపోవటము, లేదా "అబార్షన్ " కావటం జరిగినపుడు, మనం ఎంతగా అల్లాడిపోతాం? . . .

🐓 "గ్రుడ్డు" ను తినివేసి, "గ్రుడ్డు" లో నుంచి "కోడి పిల్లలను" బయటకు రానివ్వకుండా.. చేయటం "అబార్షనే" కదా! "గ్రుడ్డు" ను తినాలనుకునేవారు ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించాలి 🐥 🐣 🐥

🐑 మనిషి'ని చంపితే "హత్య" మరి "జంతువులు" చంపబడితే హత్య కాదా! మనుషులకైతే, కోర్టు లు, పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి మరి "మూగ జీవులకు" ఉన్నాయా??

🐑 "జంతువులకు" "మూగ జీవులకు" కూడా "కోర్టు లు, పోలీస్ స్టేషన్" లు ఉన్నాయి - అదే "ప్రకృతి లేక సృష్టి లేక దైవత్వం", ఆ "కోర్టు లో" ఎన్నో సెక్షన్లు, ఎన్నో రూల్స్ లేవు. ఉన్నది ఒకే ఒక్క "రూల్" అదే - "హింసిస్తే - హింసింపబడుతావు" అంతే.! అవే మన "జీవితాల్లో" కష్టాలు, సమస్యలు, రోగాలు, మనశ్శాంతి లేకపోవటం లాంటివన్నీ . . .

🐇 అలాగే మనం తినే 🍲🍛 ఆహరాన్ని బట్టి మన "మనస్సు, మన గుణం" పోషింపబడుతాయి. ఆ జంతువులని తింటే.. 🥚🐓🐑 ఆ "జంతు లక్షణాలు, తిన్నవారిలోకి వచ్చేస్తాయి . . .

🐪 చంపబడ్డ "జంతువులు" కేవలం "శవాలు" మాత్రమే! "శవాలను" మనం వేయాల్సిందీ "స్మశానాల్లో" మాత్రమే, కానీ.. వాటిని తినేవాళ్ళు, వాటికి "మసాలాలు" మరీ రుద్దీ.. వాళ్ళ సొంత పొట్టల్లోనే వేసుకుంటున్నారు... ఆ "మాంసాహరానికి" ఎన్ని "మసాలాలు, రంగులు" అద్దినా, అది ఎప్పటికీ "రక్తమాంసాల, హింసకూడు" మాత్రమే . . .

🐪 ఏదీ బలవంతంగా చేయరాదు, ఇది "స్వేచ్చ"ను హరిస్తుంది. ఏ "జీవి" తాను చావటానికి ఒప్పుకోదు. జీవించాలని పెనుగులాడుతుంది. చాలామంది వాటిని బలవంతంగా చంపుతున్నారు. అప్పుడు ఆ "జీవి దేహంలో" జీవించాలన్న "ఆశ", మరణభయం, అణువణువునా ఉంటుంది...
"జీవి ని" తిన్నప్పుడు ఆ "భావమే" వాళ్ళలోనికి ప్రవేశిస్తున్నది . . .

🦌 ఆ "జీవి" యొక్క "ఆత్మ" పరిణామ క్రమాన్ని మధ్యలోనే... ఆపివేసే అధికారం, ఆ "ప్రకృతి కి" తప్ప, మరేవ్వరికీ లేదు. ఎవరైనాసరే వాటిని చంపితే, వాటి పరిణామ క్రమాన్ని, మధ్యలో ఆపివేసినట్లే.. అందుకే చెడుకర్మ! అటువంటివారు త్వరగా "ఆత్మ పరిణామం" చెందలేకపోతుంటారు . . .

🦌 "ప్రాణం" పోసే "శక్తి" లేనప్పుడు - ప్రాణం తీసే అధికారం కూడా లేదు. "జంతువులు" ఎవరి సొత్తు కాదు, అవి "ప్రకృతి" వారసత్వం. ఆ "జంతుకోటి" "జీవత్వంతో" చలిస్తుంటే.. "ప్రకృతి" ఎంతటీ... పారవస్యంతో మునిగిపోతుందో...! బ్రహ్మనుభవము, ఆత్మానుభవము పొందిన యోగులు ఈ పారవశ్యాన్ని అనుభవించగలరు . . .

🦌 శాఖాహరం తినే మానవులను.. "మానవత్వం" ఉన్న "మానవుడు" అంటాం.
మాంసాహరం తినే మానవులను "జంతు మానవుడు" అంటాం . . .

🦌 ఒక "మేక" 🐐 తనను చంపడానికి సిద్దంగా ఉన్న కసాయి వాడిని, ఇలా అడుగుతూ వుంది... "ఆకులు, అలములు తినే మాలాంటివారం, మా గొంతు కోయించుకోవలసివస్తే?? ఇతరుల "గొంతు కోసి" తినే మీలాంటివారి "గతి" ఏమవుతుందో.. ఒక్కసారి "ఆలోచించండి" ???

🕊 "అహింస" --> అంటే.. "శాఖాహరం" తినడం మాత్రమే కాకుండా, ఇతరులు ఏయే "పనులు" చేస్తే, నీకు నీ "మనసు" గాయపడుతుందో.. అనగా నీ హృదయానికి బాధ కలుగుతుందో అవి ఇతరులకు నీవు చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా "మహోన్నతమైన" పరమ ధర్మము. "ఇదే అహింసా" అంటే...

🙏🏻 దయచేసి జంతు హింసను మానండి! -జంతు ప్రేమికులు కండి!!🙏🏻
🙏🏻 జీవహింస మహాపాపం! -మన పాపాలే మన రోగాలు!!🙏🏻

No comments:

Post a Comment