Monday, January 20, 2020

రుద్రాక్ష మాల ధరించుటకు పాటించవలసిన ముఖ్య నియమాలు about rudraksha


 *  రుద్రాక్ష మాల ధరించాలనుకునేవారు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి ఆవుపాలతో శుద్ధిచేసి ధరించగలరు.

 *  సంవత్సరానికి ఒకసారి రుద్రాక్ష అధిష్టాన దేవత పూజ చేయించి ఆ పూజలో రుద్రాక్షమాలను ఉంచి మరలా ధరించవలెను .

 *  ఎల్లప్పుడూ రుద్రాక్ష మాలని ధరించువారు కనీసం సంవత్సరానికి ఒకమారు ఆ రుద్రాక్ష మాలకు " మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం " చేసినచో చాలా మంచిది .

 *  రుద్రాక్ష మాలను బంగారంతో గాని వెండితో గాని చుట్టించుకొని తీసుకువచ్చి గంగాజలంతో శుభ్రపరచి , పంచామృతాలతో శుద్దిచేసి ఆయా రుద్రాక్ష యొక్క అధిష్టాన దేవత మందిరంలో ఉంచి పూజించి ధరించవలెను .

 *  రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు పౌర్ణమి , త్రయోదశి , చతుర్దశి , మహాశివరాత్రి , కార్తీకమాస సోమవారముల యందు ధరించవలెను .

 *  రుద్రాక్షలను రుద్రాక్ష పూజా మంత్రములతో పూజచేయకుండా ధరించిన ఫలితం ఉండదు.

 *  రుద్రాక్షలు కొన్ని సంవత్సరాల పాటు మన్నికగా ఉండవలెను అనిన వాటికి ఆవునెయ్యి నెలకొకమారు రాయవలెను.

 *  ప్రతినిత్యం స్నానం చేయునపుడు రుద్రాక్షమాల తీసి పక్కన పెట్టి స్నానం చేయుట మంచిది .

 *  రుద్రాక్షలతో ముత్యాలు , పగడములు , స్పటికములు , శంఖాలు , తులసి పూసలు , నవరత్నాలు కలిపి ధరిస్తారు . ఇలా ధరించేప్పుడు కనీసం రుద్రాక్షలు 27 గాని , 54 గాని ఉండవలెను .

 *  శివరాత్రి పర్వదినమున రుద్రాక్షలతో పూజ చేయుట చాలా శ్రేష్టం .

 రుద్రాక్ష ధారణకు శుభసమయ వేళలు  -

 *  మేష , కర్కాటక , తులా , మకర , కుంభ లగ్నముల యందు రుద్రాక్ష ధారణ చేయవలెను .

 *  అశ్వని , మృగశిర , పునర్వసు , పుష్యమి , హస్త , స్వాతి , అనూరాధ , శ్రవణం , రేవతి నక్షత్రాలలో రుద్రాక్ష ధారణ చాలా మంచిది .

 *  పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , త్రయోదశి , పౌర్ణమి తిథులలో ధరిస్తే మంచిది .

 *  సోమవారం  ధరిస్తే చాలా మంచిది . లేదా శనివారం కూడా ధరించగలరు . కృష్ణపక్షంలో (పౌర్ణమి తదుపరి బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ) ధరిస్తే మంచిది .

 *  కార్తీకమాసంలో ధరిస్తే చాలా మంచిది . లేదా మార్గశిర మాసంలో కూడా ధరించవచ్చు . భాద్రపద , పుష్య , శ్రావణ , అశ్వయుజ మాసంలో కూడా ధరించవచ్చు .

 *  రుద్రాక్షమాల ధారణకు మహాశివరాత్రి పర్వదినం చాలా ఉత్తమం.

 రుద్రాక్షధారణ కు పాటించవలసిన నియమాలు -

 *  సోమరులు అయి ఉండకూడదు. సేవా కార్యక్రమాలు యందు ఆసక్తి కలిగిఉండవలెను.

 *  అపద్దాలు ఆడకూడదు . దయ, దాక్షిణ్యం , ఏకాంతం , క్షమాగుణములలో సాత్విక అభిప్రాయంతో , శాంతస్వభావులై ఉండవలెను .

 *  కామ, క్రోధ, లోభ, మోహ , మద మాత్సర్యాలను వదిలిపెట్టి సంప్రదాయ బద్ధమైన విషయాలను నిందించకూడదు .

 *  పాపాత్ములతో సావాసం చేయరాదు .

 *  వితంతువులు రుద్రాక్ష ధారణ చేయుట మంచిది .

 *  రుద్రాక్ష ధరించువారు ధూమపానం మానివేయవలెను .

 *  రుద్రాక్ష ధారణ చేసినవారు వెల్లుల్లి , నీరుల్లి , మద్యమాంసాదులు మానివేయవలెను .


           నిన్నటి పోస్టులో ఏకముఖి ధరించటం వలన కలుగు ఉపయోగాలు వివరించాను. ఈరోజు మరికొంత సమాచారం వివరిస్తాను.

    ఈ ఏకముఖి రుద్రాక్షలో 4 రకాలు కలవు. ఒక్కోరకం ధరించటం వలన ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. వాటి గురించి వివరిస్తాను.

 1 -  శ్వేత వర్ణ ఏకముఖి  -

           వ్యాధుల నుండి విముక్తి.

 2 -  రక్తవర్ణ ఏకముఖి  -

           బ్రహ్మహత్యా పాతకం నుండి దూరం చేయును .

 3 -  పీతవర్ణ ఏకముఖి  -

         భోగము మరియు మోక్షమును ప్రసాదించును.

 4 -  శ్యామవర్ణ ఏకముఖి  -

         ఆరోగ్య లాభము , సాత్విక ప్రసన్నత కలిగించును.

          పైన చెప్పినవిధముగా ఒక్కో రంగు ఏకముఖి రుద్రాక్ష ధరించటం వలన ఒక్కొ రకమైన ఫలితాన్ని పొందవచ్చు.

        ఇప్పుడు మీకు అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య బేధం ఎలా కనుగొనాలో మీకు వివరిస్తాను.

 *  రెండు రాగిరేకుల మధ్య రుద్రాక్షని ఉంచినట్లయితే అది తనచుట్టూ తానే సవ్యదిశలో తిరుగును. అపసవ్య దిశలో తిరిగిన అశుభ ఫలితాలు కలుగును. కావున సవ్య దిశలో తిరగవలెను.

 *  ఒక చిన్నగిన్నెలో మంచినీరు పోసి దానిలో రుద్రాక్షని వేసినట్లు అయితే నకిలీది మునగకు తేలుతుంది. అంతేగాక రంగు వెలిసిపోయినట్లు ఉన్నచో అది నకిలీదిగా గుర్తించవలెను .

 *  ఆవుపాలలో అసలైన రుద్రాక్షని వేసి ఉంచిన ఆ పాలు 48 గంటల నుండి 72 గంటల వరకు చెడిపోకుండా విరగకుండా ఉంటాయి.

 *  ఒక చిన్న గ్లాసులో రుద్రాక్ష మునిగేంత ఎత్తుటి వరకు చల్లని నీరు నింపి రుద్రాక్షని ఉంచి ఒక అరగంట తరువాత ఆ నీటి ఉష్ణోగ్రతని ధర్మామీటరుతో  కొలిచినట్లైతే కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ఉండును.

 *  రుద్రాక్షలలో అర్ధనారీశ్వర రుద్రాక్షలు ఉంటాయి. వాటిని నకిలీలుగా తయారుచేయుటకు రెండు రుద్రాక్షలను శిలపైన  అరగదీసి అతికిస్తారు. కావున జాగ్రత్తగా గీతను గమనించవలెను .

 *  రెండు పాత్రల మధ్య రుద్రాక్షని ఉంచినప్పుడు రుద్రాక్ష తిరుగును.

 *  పురుగులు తిన్నవి , పగిలినవి ధరించరాదు .

 *  రుద్రాక్షని బాగా వేడిగా ఉన్న నీటిలో వేస్తే  మునిగిపోతే అది నిజమైనదిగా భావించాలి . కొంతమంది ఇరుగుడు చెట్టు కొయ్యతో రుద్రాక్షలు తయారుచేస్తారు. కావున జాగ్రత్తగా ఉండవలెను .

 *  రుద్రాక్షని ఒక వారంపాటు నూనెలో ముంచి ఉంచాలి. అవి ఏరంగు రుద్రాక్ష అయిన దాని రంగు ప్రభావితం అగును. ఆ తరువాత కాగితం లేక దూదితో శుభ్రపరచి బావినీటితో కడిగించాలి. అతరువాత ధరించినచో రంగు ప్రభావితం కానిచో అవి అసలైన రుద్రాక్షలు .

 *  రుద్రాక్షలు ఎక్కువుగా కాశి , హరిద్వార్ లలో లభ్యం అగును. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగును. ఒక నిజమైన రుద్రాక్షను ధరించినచో మంచి ఆరోగ్యం మరియు ఉన్నతస్థితిని ఇచ్చును. రుద్రాక్షలో ప్రకృతి సిద్ధముగానే రంధ్రం ఉండును. చిన్న రుద్రాక్షమాల గొప్ప ఫలితాన్ని ఇచ్చును. 

దీనినే శివరుద్రాక్ష అంటారు. దీనిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు . ఇది అసలైనది దొరుకుట మహాదుర్లభం. ఈ ఏకముఖి రుద్రాక్ష వృక్షజాతి రత్నం.  ఈ ఏకముఖి రుద్రాక్షని సూర్యుని స్వరూపముగా భావిస్తారు . దీనిని ధరించటం వలన సూర్యగ్రహ అనుగ్రహం లభించును. ఈ రుద్రాక్ష మాల ధరించటం వలన ఆధ్యాత్మిక శక్తులు వశం అగును. అత్యంత అరుదుగా లభించే ఈ అద్భుత రుద్రాక్ష జీడిపప్పు ఆకారంలో (అర్ధ చంద్రాకారంలో ) లభించును.  మంత్ర , తంత్ర ప్రయోగాలు తిప్పికొట్టబడును.

                ఏకముఖి రుద్రాక్ష ధారణ వలన పని మీద ఆసక్తి పెరుగును . మనస్సులో భక్తి పెరుగును . ఆర్థికాభివృద్ధి జరుగును. జీవితంలో ఉన్నతస్థితి కలుగును. ఈ మాలను ధరించు సమయమున రుద్రాక్ష మంత్రమును 11 సార్లు జపించవలెను . దీని ధారణ వలన బ్రహ్మహత్యా దోషం నివారణ అగును. ఇంద్రియ నిగ్రహం కలుగును.  టీబీ మరియు ఆస్తమా వంటి మొండివ్యాధులను తగ్గించును . తలనొప్పి , కంటి సమస్య , లివర్ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేయును .  ఈ రుద్రాక్షను పూజామందిరంలో ఉంచుకుని పూజించుచున్న సంపదలు తరలివచ్చును . సుఖసంతోషాలు కలుగును.

           రాజకీయ నాయకులు ఈ రుద్రాక్ష ధారణకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులలో శ్రీమతి ఇందిరాగాంధీ , n .t .రామారావు గారి వద్ద మాత్రమే ఈ ఏకముఖి రుద్రాక్ష ఉండేది. కాని ఇందిరా గాంధీ మరణానికి కొన్ని రోజుల ముందే ఈ రుద్రాక్ష ఆమె దగ్గర నుంచి మాయం అయ్యింది . అది ఇప్పటివరకు ఏమైందో ఎవ్వరికి తెలియదు.

                         ఏకముఖి రుద్రాక్ష పరమతత్వాన్ని బోధిస్తుంది. అలాంటి ఆలోచన ఉన్నవారు మాత్రమే దీనిని ధరించవలెను . దీని దర్శనం కూడా దుర్లభమే .శివరాత్రి పర్వదినమున ఈ రుద్రాక్షను పూజించిన సాక్షాత్తు శివుడ్ని పూజించిన ఫలితం వచ్చును. 

   

No comments:

Post a Comment