Monday, January 20, 2020

గోవు ముత్రం గురించి ఆయుర్వేదం లో importance of gomootram

గోమూత్రం గురించి సంపూర్ణ వివరణ  - ఉపయోగాలు .

       మానవ శరీరము నందు వాత, పిత్త , కఫాలు ప్రధానపాత్ర వహించుచున్నాయి. కొన్ని కారణాల వలన వీటిలో అసమతుల్యత ఏర్పడినపుడు మానవునకు రోగాలు సంభవించుచున్నాయి.  ఇలా సంభవించిన రోగాల నివారణకు గోమూత్రం ఒక గొప్ప ఔషధముగా పనిచేయును . గోమూత్రం విషదోషాన్ని హరించును . గోమూత్రం క్రిమిహరముగా కూడా పనిచేయును . మన శరీరము నందలి రోగ నిరోధకశక్తి తగ్గడం వలన కొన్ని రోగాలు రావటం జరుగును. గోమూత్రం రసాయన గుణములు కలిగి ఉండును. రోగనిరోధక శక్తి తగ్గటం వలన రసరక్తాధి ధాతువులు తగ్గును. అటువంటి సమస్యను కూడా గోమూత్రం నివారించును.

                గోమూత్రం నందు తామ్రము అను థాతువు కలదు. అది గోమూత్ర సేవన వలన మనుష్య శరీరం నందు ప్రవేశించినపుడు స్వర్ణముగా మారును . స్వర్ణం శరీరం నందలి సమస్తదోషములను నివారించును. రోగములలో రెండు రకాలు కలవు అవి మానసికం మరియు శారీరకం . మానసిక రోగం అత్యంత విషాదాన్ని కలిగించును. ఈ మనసిక విషాదం కలిగి ఉండటం వలన శరీరం నందు విషాణువులు ఉత్పత్తి జరుగుతుంది. ఈ విషాణువుల సమూహమే క్యాన్సరు వ్యాధిగా పరిమణించును.

                  గోమూత్రానికి విషాణువులను నివారించు గుణం కలదు. అందువలన క్యాన్సర్ నివారణలో ఈ గోమూత్రం అత్యద్భుతంగా పనిచేయును . అదేవిధంగా గోమూత్రాన్ని రసాయనిక విశ్లేషణ చేసినప్పుడు కొన్ని రకాల ధాతువులు ఆ మూత్రపరీక్ష నందు బయటపడినాయి. అవి  వరసగా 

 నత్రజని , గంధకం , అమ్మోనియా , అమ్మోనియా గ్యాస్ , తామ్రము ( రాగి ) , పొటాషియం , మాంగనీస్ , యూరియా , లవణము , ఆరోగ్యాన్ని పెంపొందించే ఆమ్లములు , క్యాల్షియం , జలం , లోహము ( ఐరన్ ) , యూరిక్ ఆసిడ్ , ఫాస్ఫెట్ లు , సోడియం , కార్బానిక్ ఆసిడ్ , A , B , C , D  విటమిన్లు , ఇతర ఖనిజములు , ల్యాక్టోజ్ ( ఇది పాలు ఇచ్చు గోవులలో ఉండును.) , ఎంజైములు , హిఫ్యూరిక్ యాసిడ్ , స్వర్ణక్షారము  మొదలైనవన్నీ గోమూత్రం నందు కలవు.

             గోవు యొక్క వెన్నుముక లోపల సూర్యకేతు నాడి కలదు. ఎప్పుడైతే సూర్యకిరణములు గోవు యొక్క శరీరాన్ని తాకునో వెంటనే అప్పుడు సూర్యకేతు నాడి సూర్యకిరణాల సహాయముతో స్వర్ణమును తయారుచేయును . మూత్రపిండములు   రక్తమును వడపోసినప్పుడు ఈ స్వర్ణక్షారం నిర్మాణం అగును. ఇది సర్వరోగహారం .

       గోమూత్రం సేకరించుటకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు కలవు. వాటిని కూడా మీకు నేను వివరిస్తాను. 

  గోమూత్ర సేకరణ నియమాలు  -

 *  పరిసరముల నందలి అడివిలో లేక బీళ్లలో యథేచ్ఛగా తిరుగుతూ ఏ గోవు గడ్డిమేయునో మరియు నిర్మలమైన నీటిని తాగుచూ ఆరోగ్యముగా ఉండునో అట్టి గోవుయొక్క పాలు మరియు మూత్రం గొప్ప ఔషధగుణములు కలిగి ఉండును.

 *  దూడ , పెయ్య  , ముసలి ఆవు , ఎటువంటి గోవు యొక్క మూత్రం అయినను ఔషధ ప్రయోగానికి పనికివచ్చును.

 *  ఎద్దు మూత్రం తీక్షణముగా ఉండును. కాని ఔషధోపయోగమునకు పనికివచ్చును. ఎందువలన అనగా ఆవు మరియు గోవు రెండూ ఒకే జాతికి చెందినివి .

 *  గోమూత్రమును రాగి ,ఇత్తడి పాత్ర యందు ఉంచరాదు. మట్టిపాత్ర , గాజుపాత్ర , పింగాణిపాత్ర లేక స్టీలు పాత్రలో ఉంచవలెను.

 *  ఎంతకాలం నిలువ ఉంచినప్పటికీ గోమూత్రం యొక్క గుణము తరగదు. దాని యందలి లోహము లేక తామ్రము కారణంగా దాని రంగు కొద్దిగా నలుపు లేక ఎరుపుగా మారవచ్చు  . గోమూత్రం నందు గంగ ఉండునని చెపుతారు. గంగాజలం ఎలాగో గోమూత్రం కూడా ఎంతకాలం యున్నను చెడకుండా ఉండును. క్రిమికీటకాలు ఉత్పన్నం అవ్వవు.

 *  పెద్దవారు ఉదయం 25ml ఒక కప్పు నీటితో కలిపి తీసుకోవచ్చు . సాయంత్రం కూడా ఇదే మోతాదులో తీసికొనవచ్చు. దీనివలన మలప్రవృత్తి ఎక్కువ అయ్యి ప్రేగులు శుభ్రపడును .ఎక్కువుగా విరేచనం అవుచున్నచో 10ml మోతాదులో తీసుకొనవచ్చు .

 *  గోమూత్రాన్ని మధుమేహరోగం ఉన్నవారు తీసికొనవచ్చు. ఈ మధ్య కొంతమంది గోమూత్రం నందు బెల్లం కలిపి అమ్ముతున్నారు. అది మాత్రం నిషిద్దం. 

       పైన చెప్పిన ఉపయోగాలన్నీ దేశివాళి గోమూత్రాన్ని స్వీకరించినప్పుడే ఉపయోగపడును. జెర్సీ ఆవు మూత్రం వలన ఎటువంటి ఉపయోగాలు లేవు . 


ప్రఖ్యాత ఆయుర్వేద శాస్త్రకారుడైన భావమిశ్ర పండితుడు గోముత్ర ఔషద గుణాలను(characters)తను రచించిన బావ ప్రకాశిక గ్రందంలో ఈ విదంగా వివరించాడు.
దేశవాళి గోముత్రం కట్టు,తీక్ష్ణ,ఉష్ణ,క్షార,తిక్త,కషాయ,లఝు,అగ్నిదీపన స్వబావాలను కలిగి ఉంటుందని,శరీరానికి వేడిని పుట్టించి శరీరంలోని కఫరోగాలను వాత రోగాలను,శూల,గుల్మ,ఉదర,ఆనాహ;,కండూ,నేత్ర,ముఖ,కుష్ట వస్దిశూల,ఆమవాత,వ్యాదులను నశింపజేసి మేదోశక్తిని పేంచుతుందని తేలియజేయబడింది.
అంతేకాక కాస,శ్వాస,శోఫ,కామల,పాండు,అతిసార,ముత్రనిరోద,కోష్టక్రిమివాత సంబంద వ్యాదులన్నీ,ఓక్క గో మూత్రం తాగినంత మాత్రానే నశించి పోతాయని తేలియజేయ బడింది.

మిగతా అన్ని జంతువుల మూత్రము కంటే  గోమూత్రము శ్రేష్ఠమైనదిగా చెప్పబడినది. గోమూత్రము జఠరాగ్నిని "పెంచుతుంది, పాచనము (ఆహారమును జీర్ణము చేయునది), కుష్ఠ హరము (చర్మ వ్యాధులను నివారించునట్టిది).

గోవు మూత్రం రసాయనికతత్వాలు -వాటి ఔషద స్వబావాలు:-
గో మూత్రంలో ఏన్నిరకాల ఆరోగ్యకారక రసాయనికతత్వాలు దాగిఉన్నాయో తమ పరిశోదనల్లో తేలుసుకున్న ఆదునిక స్వదేశి,విదేశి శాస్త్రవేత్తలంతా నివ్వేరపోతునారు.వారి పరిశోదనల్లో కనుగోనబడిన రసాయనిక తత్వ విశ్లేషణ ఈ క్రింది విదంగా వుంది:-
1.nitrogen నైట్రోజన్ :
ఇది మూత్రాన్ని సాఫీగా జారి చేస్తూ రక్తంలోని విషాలను తోలగిస్తుంది.
2 sulphurసల్ఫర్ :
పేద్ద ప్రేగులకు బలాన్ని కలిగించి రక్తశోదకంగా పనిచేస్తుంది.
3 ammoniumఅమ్మోనియా:
ఇది శరీర దాతువులలో రక్తప్రసరణను స్దిరంగా ఉంచుతుంది.
4 ammonia gas అమ్మోనియా గ్యాస్:
ఇది ఊపిరితిత్తులోని చేడుపదార్దాలను తోలగిస్తుంది.
5 copper కాపర్:
శరీరంలో అదనంగా అనవసరంగా పేరిగే కోవ్వుcholestral( కోలేస్ట్రాల్ )ను కరిగిస్తుంది.
6 urea యూరియా:
మూత్రంలోని కీటాణువులను నశింపచేస్తుంది.
7 iron ఐరన్:
రక్తంలో ఏర్రకనాలను( red blood cells ) ఉత్పత్తి చేస్తుంది.
8 uric acid యూరిక్ ఆసిడ్:
హృదయాన్ని శోదించి మూత్రాన్ని విడుదల చేస్తూ విషాలను విసర్జింప చేస్తూ వాపులను తగ్గిస్తుంది.
9 phosphate ఫాస్పేట్:
మూత్రవాహినిలోని రాళ్ళను కరిగిస్తుంది.
10 sodium సోడియమ్:
రక్తాన్ని శోదించి ఆమ్లతత్వాన్ని తోలగిస్తుంది.
11 manganese మాంగనీస్:
హనికారకమైన సూక్ష్మజీవులను నశింపచేసి గ్యాంగ్రిన్ అనే బయంకర పుండును మాన్పుతుంది.
12 pottasium పోటాషియం:
ఉదరంలోని ఆమ్లవాతాన్ని నశింపచేస్తుంది.

13 కార్బోలిక్ యాసిడ్:దేహంలో హానికారక క్రిములను నశింపచేస్తూ అవి లోనికి రానికుండా నిరోధిస్తుంది

14 కాల్షియం:ఎముకలను పోషిస్తు రక్తశుద్ధి చేస్తుంది

15 vitamin a,b,c,d: శరీరాన్ని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచుతూ ఆందోళనను తగ్గిస్తుంది.దాహం తగ్గుతుంది.వీటివల్ల ఎముకలు పోషింపబడుతాయి.శరీరానికి, శక్తి బలమూ కలుగుతాయి

16 ఇతర మినరల్స్:ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి

17 ఎంజైమ్స్:జీర్ణక్రియను సవ్యంగా ఉంచి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి

18 క్రియేటినైస్:క్రిమిసంహారాని చేస్తురoది.

19  హార్మోన్స్:
ఎనిమిది నెలలు గర్భవతి అయిన ఆవు మూత్రంలో హార్మోన్స్ అధికంగా ఉరిటాయి. ఈ మూత్రం సేవిస్తే శరీరానికి అత్యంత ప్రయోజనం కలుగుతుంది.

20 స్వర్ణక్షారం: ఇది క్రిమికీటక నాశనిగా పనిచేస్తూ శారీరక శక్తిని పెంపొందిస్తుంది.

No comments:

Post a Comment