Monday, January 20, 2020

పురాతన వైద్యులచే రచించబడిన ఆయుర్వేద సంహితల గురించి సంపూర్ణ వివరణ about ayurveda samhita

వేదయుగము అనగా క్రీస్తు పూర్వం 2500 మొదలు క్రీ .పూ 500 సంవత్సరముల వరకు ఆయుర్వేద చరిత్ర యందు "సంహిత " యుగముగా వ్యవహరిస్తారు . ఇక్కడ సంహితలు అనగా గొప్పగొప్ప వైద్య గ్రంధములు . ఈ సమయములో భారతీయులు సర్వశాస్త్రముల యందు మిక్కిలి పరిశోధనలు గావించి భారతీయ విజ్ఞానమును అన్నివైపులకు వ్యాపింపచేసినారు. ఈ కాలంలో ఆయుర్వేదం చాలా గొప్పగా అభివృద్ది చెందినది.

           ఆత్రేయ మహర్షి శిష్యులు అయిన అగ్నివేశ  , భేళ , జాతుకర్ణ , పరాశరాదులచే ఆయుర్వేదం నందలి తీవ్ర పరిశోధనలు జరిగి అనేక వైద్య (సంహితలు ) గ్రంథాలు రచించబడినవి. వీటిలో అగ్నివేశ  సంహిత , బేళ  సంహితల యందు కొద్ది భాగములే ప్రస్తుతం లభ్యం అగుచున్నవి. మిగిలినవి లభ్యములో లేవు . అగ్నివేశ సంహిత చరకుడు చేత సంస్కరింపబడి చరక సంహితగా లభ్యం అగుచున్నది.  ఇలా చెప్పకుంటూ వెళితే చాలా సంహితలు ఉన్నాయి . వాటిలో కొన్ని ముఖ్యమైన సంహితలు పేర్లు , అవి వేటికి సంభంధించినవో మీకు అంశాల వారీగా తెలుపుతాను.

       ఇప్పుడు నేను చెప్పబోయే సంహితలు మీకు దొరికినచో వాటిని విడిచిపెట్టవద్దు. ఆ గ్రంథాల నందు అత్యద్భుతమైన రహస్య యోగాలు ఎన్నో ఉన్నాయి . ప్రస్తుతం అవి సంస్కృతంలో లభ్యం అగుచున్నాయి . అవి కూడ చాలా అరుదుగా ఉన్నాయి.

  కాయచికిత్స సంహితలు  -

 * అగ్నివేశ సంహిత .

 * భేళ సంహిత .

 * జాతుకర్ణి సంహిత .

 * పరాశర సంహిత .

 * హారీత సంహిత .

 * క్షారపాణి సంహిత .

 * ఖరనాధ సంహిత .

 * విశ్వామిత్ర సంహిత .

 * అత్రి సంహిత .

  శల్య చికిత్సా సంహితలు  -

 * సుశ్రుత సంహిత .

 * ఔపదేనవ తంత్రం .

 * ఔరభ్ర తంత్రం .

 * పౌష్క లావత తంత్రం .

 * కరవీర్య తంత్రం .

 * గోపుర రక్షిత తంత్రం.

 * వైతరణ తంత్రం .

 * భాలుకి తంత్రం.

 * భోజ సంహిత .

 * కపిల సంహిత .

 * గౌతమ సంహిత .

  శాలక్య చికిత్సా సంహితలు  -

 * గార్గ్య తంత్రము .

 * గాలవ  తంత్రము .

 * కాంకాయన తంత్రము.

 * కరల తంత్రము.

 * కృష్ణత్రేయ సంహిత .

 * నిమి తంత్రము.

 * శౌనక తంత్రము.

 * విదేహ తంత్రము.

  భూత విద్యా సంహితలు  -

 * శుశృత సంహిత - ఉత్తర స్థానం .

 * కాశ్యప సంహిత .

 * కౌమారభృత్య తంత్రము.

 * జీవకాది అన్య తంత్రము.

  అగధ (విష ) చికిత్స సంహితలు  -

 * కశ్యప సంహిత .

 * ఆలంబయన సంహిత .

 * ఉశనహ సంహిత .

 * శౌనక సంహిత .

 * లాట్యాయన సంహిత .

 * బృహస్పతి సంహిత .

  రసాయన చికిత్స సంహితలు  -

 * పాతంజలి సంహిత .

 * నాగార్జున తంత్రము.

 * కక్షపుట తంత్రము.

 * ఆరోగ్యమంజరి అను గ్రంథం ఆచార్య నాగార్జున విరచితం . ఇందు వ్యారితంత్రం , వశిష్ఠ తంత్రం , మాండవ్య తంత్రం అనునవి కలవు.

       పై మూడు తంత్రములు ప్రధానంగా రసశాస్త్రమును భోధించునవి.

  వాజీకరణ తంత్రములు  -

 * కుచుమార తంత్రము  -

 * నంది తంత్రము .

 * స్వేతకేతు తంత్రము .

 * పాంచాళ తంత్రము .

 * వాత్సాయన కామసూత్రములు .

  పశు చికిత్స తంత్రములు  -

 * పాలకాప్య సంహిత .

 * గోతమ సంహిత .

 * శాలిహోత్ర సంహిత .

   
    పైన చెప్పినవే కాకుండగా మరెన్నో అమూల్య గ్రంథాలు ప్రాచీన భారతదేశము నందలి ఉండేవి. కొంతవరకు వేరేదేశాలకు తరలిపోగా మరికొన్ని భూగర్భము నందు దాచబడినవి.  పైన చెప్పిన గ్రంథాలు లభ్యం అయినచో తప్పక చదవగలరు.

No comments:

Post a Comment