Monday, January 20, 2020

ఆరోగ్యపరముగా గుర్తు ఉంచుకొనవలసిన ముఖ్య నియమాలు health secret

 *  శరీరములో లోటు భర్తీ అగుటకు , శరీరం పెరుగుటకు మాంసకృత్తులు అవసరము. ఈ మాంసకృత్తులు పాలు , మాంసం , గుడ్లు , పప్పులు మొదలైన పదార్దములు తీసికొనవలెను.

 *  కొవ్వుపదార్ధాలు , కార్బోహైడ్రేట్లు శరీరము నందు తాపమును పెంచును. వాటిపైన మనము ఆధారపడి జీవించలేము. చక్కెర , గంజి (పిండి) ముఖ్యమైన కార్బోహైడ్రేట్స్ కలవు. గింజల చమురులో విటమిన్స్ లేవు .

 *  చేపనూనె , పాలు , వెన్న , నెయ్యి , ఆకుకూరలు , దుంపలు , మామిడిలో విటమిన్ A ఎక్కువుగా లభ్యం అగును. కండ్లు మరియు చర్మము సరైన స్థితిలో ఉంచుటకు కూడా విటమిన్ A అవసరం.

 *  గోధుమ , బియ్యపు తవుడు , తృణధాన్యాలు , పప్పు దినుసుల యందు B1 విటమిన్ కలదు. ఈ విటమిన్ సరిగ్గా ఉన్నచో నంజు వ్యాధి రాదు . మన శరీరం పెరుగుదలకు మరియు ఆరోగ్యానికి B1 విటమిన్ అత్యంత ముఖ్యం అయినది. 

 *  పాలు , కాలేయము , మాంసం , గుడ్లు , చేపల యందు B2 విటమిన్ ఎక్కువుగా ఉండును . ఈ విటమిన్ శరీరం పెరుగుదలకు , ఆరోగ్యమునకు అత్యంత అవసరం. కండ్లకు సంబంధించిన , పెదవులు , నోటికి సంబంధించిన జబ్బులు రాకుండా ఈ విటమిన్ కలిగిన పదార్ధాలను ఎక్కువుగా తీసికొనవలెను.

 *  తాజాపండ్లు , కూరగాయలు , మొలకెత్తిన ధాన్యములో C విటమిన్ ఎక్కువ లభ్యం అగును. ఇది స్కర్వీ వ్యాధి రాకుండా చేయును .

 *  పాలు , వెన్న , నెయ్యి , చేపలు , చేపనూనె యందు D విటమిన్ లభ్యం అగును. ప్రకృతిసిద్ధముగా సూర్యరశ్మి తగులుట వలన కూడా D విటమిన్ లభ్యం అగును. ఈ విటమిన్ ఎముకలు పెరుగును. ఈ విటమిన్ లోపము వలెనే రికెట్స్ అను వ్యాధి వచ్చును.

 *  పాలలో క్యాల్షియం ఎక్కువుగా లభ్యం అగును. పచ్చని ఆకుకూరలలో కూడా క్యాల్షియం ఉన్నది . ఎముకలు బలంగా ఉండుటకు , మంచి పెరుగుదల , ఆరోగ్యముగా ఉండుటకు క్యాల్షియం అవసరం.

 *  శరీరము నందు రక్తం వృద్ది అగుటకు ఇనుము అవసరం. రక్తహీనత వలన కలుగు జబ్బుల వలన భాధపడువారికి ఎక్కువ ఇనుము అవసరం. ధాన్యములలో , పప్పులలో , ఆకుకూరలలో ఇనుము ఎక్కువుగా ఉండును.

 *  బాగా మరపట్టిన తెల్లటి బియ్యము కంటే దంపుడు బియ్యము లేక ఒక్కసారి పట్టు పట్టిన మరబియ్యం చాలా మంచివి. తెల్ల గోధుమ రొట్టె కంటే చపాతీలుగా కాని , బ్రౌన్ రొట్టె కాని మంచివి.

 *  మన శరీరానికి అవసరం అయిన పదార్ధాలు బియ్యము నందు కాని గోధుమల యందు కాని లేవు . ఆహారములో వీటితో పాటు పాలు , పప్పులు , పండ్లు , కాయగూరలు , ఆకుకూరలు తగినంత ప్రమాణములో ఉండవలెను.

 *  తీపి వస్తువులను గాని , తీపి చిరుతిండ్లును గాని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అవి మనకు మాంసకృత్తులును గాని , విటమిన్లు కాని , ఖనిజాలు ను గాని ఇవ్వవు. అంతేకాకుండా ఆకలిని కూడా చంపివేయును

 *  అన్ని ఆహారపదార్ధాల కంటే ఉత్తమమైన ఆహారం పాలు .  బియ్యము వంటి   ధాన్యములలో లోటుగా ఉన్న అన్నిరకములైన పోషక పదార్దాలను పాలు భర్తీ చేయును . 

No comments:

Post a Comment