కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఆరోగ్యపరమైన సలహాలు అంతర్లీనంగా ఉన్నాయి . వాటిన్నింటిని నేను నా పరిశోధనలో భాగంగా సేకరించాను . వీటిని మీకు ఇప్పుడు తెలియచేస్తాను.
రహస్య సూక్తులు -
* రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.
* ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
* మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
* నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
* వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
* పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను .
* భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
* గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
* శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
* ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను .
* రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
* అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
* కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును .
* అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను . ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
* ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
* విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
* పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
* మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి .
* ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను . దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను . ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు . నములువానికి రుచి తెలియును .
* రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
* అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
* వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
* నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
* పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
* ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
* దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
* ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
* ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
* చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
* మినుములు అతిగా వాడరాదు.
* వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
* చవిటి ఉప్పు మంచిది కాదు.
* గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
* పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
* దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
* మలమూత్ర వేగములను ఆపరాదు .
* ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
* హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది .
* స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
* విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
* గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
* ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
* నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
* నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
* తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
* కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
* ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .
* ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
* మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
* అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
* నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
* పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
* స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
* ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
* బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
* నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
* గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .
* మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .
* పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు .
* సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .
* రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.
* మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .
* స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .
* బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .
* నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .
* భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.
* మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు .
* అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు .
* ముక్కుతో శబ్దం చేయకూడదు .
* పళ్ళు కొరకకూడదు .
* ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను . రెండు మైళ్లు వరకు నడవవలెను .
* రాత్రి భోజనం అయ్యిన తరువాత ఒక మైలు దూరం నడుచుట చాలా మంచిది .
* రాత్రి భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయుట మంచిది .
* రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది .
* ఆహారం ని పూర్తిగా నమిలి మింగవలెను.
* స్నానం చేసిన వెంటనె భోజనం చేయరాదు . అలా చేసినచో జీర్ణశక్తి నశించును. గంట సమయం తరువాతనే
భోజనం చేయవలెను .
* రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో వళ్ళు బరువెక్కును . చురుకు లేకుండా ఉండును.
* దంతధావనం అనంతరం యే వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి ప్రతినిత్యం మింగుతూ ఉన్నయెడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును.
* నిద్రనుంచి లేచిన వెంటనె మంచినీటిని సేవించరాదు. అలా త్రాగిన యెడల జలుబు చేయును . ఫలములు తీసుకున్న వెంటనె కూడా నీటిని సేవించరాదు .
* వేడి వస్తువులు తీసుకున్న వెంటనె చల్లని నీరు తీసుకోకూడదు.
* అతి కారం గల వస్తువులు , అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును.
* రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను ఉదయం ఎమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను . ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును.
* బాగా ఆకలి గా ఉన్నప్పుడు నీటిని తాగుట , దాహాంగా ఉన్నప్పుడు అన్నం తినటం వలన కడుపునొప్పి వచ్చును.
* కడుపు ఉబ్బరం గా ఉండి పుల్లటి తేపులు వచ్చుచున్నప్పుడు చల్లటి మంచినీరు తాగవలెను.
* అన్నం తినేముందు గాని , తిన్న తరువాత గాని అల్లం మరియు ఉప్పు తింటూ ఉన్న యెడల జీర్ణశక్తి ఎక్కువ అగును.
* మూసి ఉన్న ఇంట్లో గాని గదిలోకి గాని తలుపు తీసి వెంటనె ప్రవేశించరాదు. తలుపు తీసి అయిదు నిమిషములు దూరముగా ఉండి లొపల ఉన్న గాలి బయటకి వెళ్లిన తరువాత మాత్రమే లొపలికి వెళ్లవలెను .
* నిద్రించే గదిలో చెడు వాయువులను ఉత్పతి చేసేటువంటి వస్తువులు ఉంచరాదు.
* బట్టలు బిగుతుగా కట్టుకోరాదు. వదులుగా ఉండవలెను .
* శిరస్సు చల్లగా ఉంచుకొనుట , పాదములు వెచ్చగా ఉంచుకొనుట ఆరోగ్యవంతులు యొక్క లక్షణం .
* మలమూత్రములు బిగపట్టుకొని ఉండకూడదు వెంటనె విసర్జించవలెను . అలాగే తుమ్ములు మరియు ఆవలింతలు ఆపుకొనకూడదు. లేనిచో భయంకరమయిన వ్యాధులు సంభంవించును.
* సారా మొదలయిన మత్తుపదార్థాలు సేవించరాదు . దానివల్ల ఆకలి చెడిపోయి బుద్ది చెడిపొవును.
* మిక్కిలి ప్రకాశవంతమైన వెలుతురు , మధ్యాన్న సూర్యుడిని చూడరాదు.
* అవసరం లేకుండా కళ్ళజోడు ధరించరాదు. కళ్లు చెడిపొవును.
* చిన్న అక్షరాలు గల పుస్తకాలు రాత్రి యందు చదవరాదు.
* భోజనం చేసిన వెంటనె వ్యాయమం , మైధునం చేయరాదు . ఆరోగ్యం చెడిపొవును
ఆయుర్వేదం నందు వివరించబడిన ఆరోగ్యసూత్రాలు - 11 .
* పొగ కఫాన్ని కలిగిస్తుంది . కండ్లకు చెరుపు చేస్తుంది. తలభారాన్ని కలిగిస్తుంది . వాతపిత్తాలను ప్రకోపిస్తుంది. వాన బలాన్ని కలుగచేస్తుంది. మితమైన గాలిలో ఉండటం వలన ఆరోగ్యానికి మంచిది . పెనుగాలిలో ఉండటం చర్మానికి గరుకుతనాన్ని కలిగి ఉంటుంది . చర్మకాంతిని పోగొట్టును . ఒళ్ళు పట్టుకొని పొయినట్లు ఉండటం, మంట, అజీర్ణంని కలిగిస్తుంది .
* తూర్పుగాలి వేడిచేస్తుంది . ఒళ్ళు బరువుగా అనిపిస్తుంది. చర్మరోగాలు , మొలలు , విషము , క్రిములు , సన్నిపాతజ్వరము , ఉబ్బసం , కీళ్ళవాయుట మొదలగు సమస్యలను తెస్తుంది .
* దక్షిణపుగాలి శ్రేష్టమైనది. కంటికి మేలుచేయును . శరీరానికి బలాన్ని ఇచ్చును. దేహములోని రంధ్రముల నుండి రక్తంకారడం తగ్గించును . వాతాన్ని ఎక్కువచేయును .
* పడమటిగాలి చల్లదనాన్ని ఇచ్చును. మూర్ఛ, మంట, దప్పిక, విషం వీనిని పోగొట్టును . ఉత్తరపుగాలి శరీరానికి నునుపుదనాన్ని ఇస్తుంది. తేలికైనది, శరీరానికి తేమని ఇస్తుంది. బలాన్ని కలిగిస్తుంది . చిక్కిన శరీరం గలవానికి క్షయరోగం , విషబాధ గలవారికి చాలా మేలు చేస్తుంది.
* తాటాకుతో చేసిన విసనకర్ర వాడటం వలన దప్పిక,బడలిక, చెమట,మూర్ఛను పోగొట్టును . త్రిదోషాలను తగ్గించును .
* వెదురుబద్దతో చేయబడిన విసనకర్ర వేడిచేస్తుంది. రక్తానికి సంబంధించిన వ్యాధులను కలిగిస్తుంది . వట్టివేరు విసనకర్ర గాలి త్రిదోషాలను తగ్గిస్తుంది . మిక్కిలి చల్లదనాన్ని ఇస్తుంది. నెమలిపించం విసనకర్ర వాతాన్ని పోగొట్టును . బలాన్ని , ఆరోగ్యాన్ని , సౌభాగ్యాన్ని ఇస్తుంది.
* విశ్రాంతిగా కూర్చొని ఉండటం చర్మసౌందర్యాన్ని కలిగించును. కఫాన్ని ఎక్కువచేయును . శరీరానికి లావుతనాన్ని , సుకుమారత్వాన్ని తగ్గించును .
* సుఖమైన పడక బడలిక పోగొట్టును . వాతాన్ని తగ్గించును . బలాన్ని , మంచినిద్రను , మనస్సుకు ఉత్సాహాన్ని కలిగించును.
* రాత్రి సమయముననే తన భార్యతో సుఖించవలెను .
* పగలు స్త్రీ సాంగత్యం చేయుట వలన ఆయుర్దాయం క్షీణించును. కావున పగటిపూట స్త్రీసాంగత్యం కూడదు. మనస్సుకు దుఃఖం కలిగించు మాటలు వింటున్నప్పుడు స్త్రీసాంగత్యం చేయరాదు .
* స్త్రీ సాంగత్యం అయినపిమ్మట పురుషావయమును శుభ్రపరుచుకోవలెను . ఆలస్యం చేయరాదు .
* వేసవికాలంలో తప్ప మిగిలిన రోజుల్లో మూడురోజులకొకసారి స్త్రీసాంగత్యం చేయవలెను . వేసవికాలంలో మాత్రం పదిహేనురోజులకొకసారి స్త్రీసాంగత్యం చేయవలెను .
* మితంగా స్త్రీసాంగత్యం చేయువారికి ఙ్ఞాపకశక్తి , బుద్ది , ఆయుర్దాయం , ఆరోగ్యం పెరుగుదల, జ్ఞానేంద్రియాలకు శక్తి, శరీరబలం పెరుగును . త్వరగా ముసలితనం రాదు .
* స్త్రీసాంగత్యం అయినపిమ్మట స్నానం చేయడం , పంచదార కలిపిన పాలను , తీపివస్తువులను తినటం , చల్లగాలిలో కూర్చోవడం , మాంసరసాన్ని తాగడం , నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది .
* స్నానం చేసి చందనమును పూసుకుని సువాసనగల పూలను ధరించి వాజీకరణ ఔషధాలను సేవించి చక్కటిబట్టలను కట్టుకుని అలంకరించుకొని తాంబూలమును వేసుకొని ప్రియురాలి యందు ప్రేమను గలవాడై , కామోద్రేకం గలిగినవాడై మంగళకరమైన పడక యందు పుత్రార్థియై పురుషుడు స్త్రీ సంపర్కం చేయవలెను .
* మితిమీరి స్త్రీ సంగమం చేసేవారికి తలతిరగడం , బడలిక , తొడలలో బలహీనత కలుగుతుంది . బలం, రక్తం మొదలగు ధాతువులు క్షీణిస్తాయి. ఙ్ఞానేంద్రియాలకు శక్తిని తగ్గించును . అకాలమరణం సంభంవించును.
* మితిమీరి స్త్రీ సంగమం వలన కడుపునొప్పి , దగ్గు, జ్వరం , ఉబ్బసం , శరీరం చిక్కిపోవుట, రక్తక్షీణత , క్షయరోగం , పక్షవాతం సంభంవించును.
* మితిమీరి భోజనం చేసినవాడు, మనశ్శాంతి లేనివాడు , ఆకలితో ఉన్నవాడు , సరైనస్థితిలో లేని అవయవములు గలవాడు కుర్రవాడు, మలమూత్రములను విసర్జించవలసిన అవసరం ఏర్పడిన వాడు , రోగగ్రస్తుడు స్త్రీసాంగత్యం చేయరాదు . పైన చెప్పిన పరిస్థితుల్లో ఉన్న స్త్రీకి కూడా పురుషసాంగత్యం తగదు. పురుషుడు కింద ఉండి స్త్రీ పైన ఉండి రతి చేయుటవలన పురుషునకు మూత్రాశయంలో శుక్రము రాయిగా మారు వ్యాధి సంభంవించును.
* ఋతువులో ఉన్న స్త్రీతో సంగమం చేయుటవలన కండ్లకు చెరుపు చేస్తుంది . ఆయుర్దాయం తగ్గును. శరీరకాంతి క్షీణిస్తుంది.
* రోగగ్రస్తుడు స్త్రీసాంగత్యం చేసినచో ప్లీహములో (spleen ) నొప్పి , మూర్చ, మరణం సంభంవించును . బాలింతరాలు పురుషసాంగత్యం చేయుట వలన అవయవములు మాటిమాటికి గుంజుకొనిపోవుట , పక్షవాతం , కాళ్లు , చేతులు మొదలగునవి పట్టుకొనిపోవుట , జ్ఞానేంద్రియాలలో వాపు , దగ్గు , ఉబ్బసం , జననేంద్రియము నుండి రక్తము కారుట వంటి బాధలు కలుగును.
* పచ్చకర్పూరం , జాజికాయ, తోకమిరియాలు , లవంగాలు , కాచు , సున్నం , పోకచెక్క వీనితో చేర్చి తమలపాకులను తాంబూలంగా వేసుకోవడం మంగళకరమైనది. నోటికి తేటదనాన్ని , సువాసనను కలిగిస్తుంది . శరీరానికి కాంతిని , అందాన్ని ఇస్తుంది. దవడలు , పండ్లు , స్వరపేటిక దోషాలను పోగోట్టును . నాలుకను శుభ్రం చేయును . నోటిలో లాలాజలం అతిగా వూరుటను తగ్గించును . హృదయానికి మేలు చేయును . గొంతుకు సంబంధించిన రోగాలను పోగొట్టును .
* ఒకసారి తాంబూలంలో రెండు తమలపాకులు , కొంచం సున్నం , పోకచెక్క వాడాలి . తమలపాకు తొడిమ వ్యాధిని కలిగించును. కోన పాపాన్ని కలిగించును. మధ్యభాగం ఆయుష్షుని తగ్గించును , నరాలకు , బుద్దికి చేటుతెచ్చును. కావున వీనిని తీసివేయవలెను .
* తాంబూలం వేసుకోగానే నోటిలో ఊరు మొదటి లాలాజలపు వూటను వూసివేయవలెను . అది విషపూరితముగా ఉండును. రెండొవ ఊట జీర్ణం కాదు . కావున మొదటి రెండు ఊటలను బయటకి వూసి మూడొవ ఊట నుండి మింగవచ్చు.
* ఎక్కువసార్లు తాంబూలం వేసుకోవడం వలన శరీరం చిక్కిపోతోంది. చూపు తగ్గును. తలవెంట్రుకలు రాలిపోవును . దంతాల పటుత్వం తగ్గును. ఆకలి తగ్గును. చెవుడు ఏర్పడును . శరీరవర్ణం , బలం తగ్గును. క్షయరోగం , పిత్తం , వాతం , రక్తసంబంధ రోగాలు ఏర్పడును .
* తాంబూలం వేసుకున్న తరువాత ఊటలు మింగగా మిగిలిన పిప్పిని లోపలికి మింగుచున్న శరీరంలోని నునుపుదనం తగ్గును. అరుచి ఏర్పడుతుంది. ఆకలి నశిస్తుంది. మగతనం తగ్గును. జలుబు , ఉబ్బసం , శరీరంలోని రక్తం తగ్గును. మూత్రం సరిగ్గా రాకపోవడం లేక మూత్రం ఎక్కువుగా రావటం వంటి రోగాలు సంభవిస్తాయి.
* పాలను తాగిన 45 నిమిషాలలోపల తాంబూలం వేసుకున్న బహుమూత్రవ్యాధి గాని మూత్రం ధారాళంగా రాకుండా అడ్డగించబడు వ్యాది గాని చర్మరోగం గాని రావటం తధ్యం
* పగటి యందు సూర్యకిరణాలతో , రాత్రి సమయము నందు చంద్రకిరణాలతో తాకబడిన నీరు వర్షం ద్వారా లభించు స్వచ్ఛం అయిన నీటికి సమానం అయినది. ఇది వాతాన్ని , కఫాన్ని ఎక్కువ చేయదు .
* చంద్రకాంత శిలలో పుట్టు నీరు స్వచ్చమైనది . గ్రహదోషాలను పోగొట్టును . మనస్సుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. జ్వరం, మంట,విషబాధ పోగొట్టును . పిత్తాన్ని హరిస్తుంది.
* కంటికి , బుద్దికి , శరీరానికి బలాన్ని ఇస్తుంది. తియ్యగా, సులభముగా జీర్ణం అగును.
* జలపాతం యొక్క నీరు రుచిని కలిగిస్తుంది . కఫాన్ని హరిస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. తేలికగా జీర్ణం అగును. తియ్యగా ఉండి వాతాన్ని పెంచును. పిత్తాన్ని ఎక్కువ చేయదు .
* వాన కురిసినవెంటనే భూమి మీద నిలిచిన నీరు వాడుటకు మంచిదికాదు. మూడురోజులు గడిచిన పిదప మలినాలు అడుగుకు చేరి పైన తేటగా ఉన్న వాన నీరు అమృతముతో సమానమైనది .
* భోజనానికి మధ్య నీరు త్రాగువారు సమమైన శరీరం గలవారు ఉందురు . భోజనానికి తరువాత నీరు సేవించువారు లావైన శరీరం గలవారుగా ఉండును. భోజనానికి ముందు నీరు త్రాగువారు సన్నని శరీరం గలవారుగా ఉండును.
* సూర్యుడు అస్తమించనంత వరకు అంటే పగలు నూరు కుండల నీరైనను తాగవచ్చు . సూర్యుడస్తమించిన తరువాత తాగిన ఒక్క చుక్క నీరైనను కుండ నీటితో సమానం. అనగా రాత్రి సమయము నందు అతిగా నీటిని సేవించరాదు . రాత్రిపూట తీసుకునే నీరు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకొనును .
* విరిగిపోయిన పాలు , పెరుగు , పెరుగు కాని , మజ్జిగ లేదా పాలతో కలిపి వండిన పదార్థం , యవాక్షారం మొదలగు క్షారద్రవ్యాలు , పులిసిన మద్యము , పచ్చి ముల్లంగి, చిక్కిన దేహముగల ప్రాణుల యొక్క మాంసం , ఎండిపోయిన మాంసం , పంది, గొర్రె, ఆవు, చేప , ఎనుము వీనియొక్క మాంసం, మినుములు , అనుములు , తామర మొదలగు దుంప , తామర తీగ , పిండితో చేసిన పదార్థాలు , మొలక వచ్చిన ధాన్యము , ఎండిపోయిన కూరలు , అలసందలు , తేనె వంటి బెల్లం వీటిని ప్రతినిత్యం ఆహారంగా వాడరాదు . అనగా అప్పుడప్పుడు మాత్రమే వాడవలెను .
* మట్టిపాత్రను బాగా కడిగి వాటిలో ఆహారాన్ని వండి ఆ ఆహారాన్ని తీసుకోవడం మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. మట్టిపాత్ర దొరకనప్పుడు ఇనుపపాత్ర వాడటం మంచిది . ఇనుప పాత్రలో వండిన ఆహారం కంటిజబ్బులు , మూలవ్యాధిని పోగొట్టును . కంచుపాత్రలో వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిది . బుద్దిని పెంచును. శుద్ధముగా ఉండును.
* బంగారు పళ్ళెములో భొజనం చేయుటవలన సకల దోషాలు పోవును . బలం కలుగును. ఆరోగ్యం ఏర్పడును . వెండిపళ్లెంలో భోజనం చేయుటవలన కండ్లకు మేలు జరుగును. పిత్తం తగ్గును. కంచుపళ్లెంలో భోజనం చేస్తే బుద్ది పెరుగును . ఆహారానికి రుచి ఏర్పడును . రక్తదోషాలు పోవును . పిత్తం తగ్గును. ఇనుప పళ్లెంలో భోజనం చేయుటవలన సిద్ది కలుగును . వాపు , పాండు రోగం పోతుంది . శరీరంలో రక్తహీనత తగ్గును. కామెర్లవ్యాధి తగ్గును.
* అరటి ఆకులో భోజనం చేయుట వలన సకలదోషాలు పోవును . శరీరానికి బలం కలుగును. విషదోషం పోవును . ఆహారంలో రుచి పెరుగును . బాగా ఆకలివేస్తుంది . ఆహారం త్వరగా జీర్ణం అగును. శరీరంలో వేడి తగ్గును. చర్మానికి కాంతి వచ్చును.
* మోదుగాకులో భోజనం చేయుట వలన వాత,కఫాలు తగ్గును. పరిశుభ్రముగా ఉండును. క్షయ , గుల్మము , కడుపులో వాపు పోగొట్టును . వేడిని ఇస్తుంది. ఆకలిని కలిగిస్తుంది . ఆహారంలో రుచిని పుట్టిస్తుంది. మర్రి, రావి,మేడి, జువ్వి ఈ ఆకులలో భోజనం చేయుట వలన ఆహారం తేలికగా జీర్ణం అవ్వదు . శరీరానికి చల్లదనం కలుగును. దాహం , మంట, శరీరంలోని రంధ్రాల్లో నుండి రక్తం కారటం వంటి రోగాలు పోవును . జ్ఞాపక శక్తి పెరుగును . వాతకఫాలు ఎక్కువ అగును. తామరాకులో భోజనం చేయకూడదు . తామరాకు నందు భోజనం వలన వాతం పెరుగును . ఆకలి తగ్గును. చర్మానికి గరుకుతనం వచ్చును. సంపద , సౌందర్యం పోవును . నీళ్లలో పుట్టే ఏ ఆకుల్లోను భోజనం చేయరాదు .
* మామిడాకు విస్తరిలలో భోజనం చేయుట వలన సుఖసౌఖ్యాలు పెరుగును . సకల దోషాలు పోవును . పిత్తం తగ్గును. తాటాకులో భోజనం చేయుట వలన ఆరోగ్యం కలుగును. టెంకాయ చిప్పలో భోజనం చేయుటవలన అన్ని దోషాలు పోవును . సొరకాయ బుర్రలో భోజనం చేయుట వలన వాతం ఎక్కువ అగును.
* నీళ్లు తాగుటకు రాగిపాత్ర వాడుట మంచిది . రాగిపాత్ర దొరకనప్పుడు మట్టిపాత్ర వాడటం మంచిది . స్పటికముతో చేయబడిన పాత్రను వాడటం చాలా పవిత్రమైనది. చల్లదనాన్ని ఇస్తుంది. గాజుపాత్ర, వైడూర్యమణితో చేయబడిన పాత్రకూడా చల్లదనాన్ని ఇస్తుంది.
* మంచి ఆకలి లేనివాడు , గుల్మవ్యాధి , పాండురోగం , ఉదరరోగం , వాంతులు , మొలలు , శరీరం వాపు వంటి రోగములు కలవాడు ఏ విధమైన నీరు అతిగా సేవించరాదు . ఒకవేళ దప్పిక ఎక్కువుగా అయినచో చాలా కొద్దిగా మాత్రమే తాగవలెను . తక్కువుగా చెమట పట్టు శరీరం గలవారు , బహుమూత్రవ్యాధి , కండ్ల జబ్బు, గొంతుకు సంబంధించిన వ్యాధి , వ్రణము కలవారు అతిగా నీటిని సేవించరాదు .
* కాచి చల్లార్చిన నీరు కఫమును వృద్ధిచెందించదు. తేలికగా జీర్ణం అగును. పిత్తముతో కూడిన దోషప్రకోపము నందు మంచిది . ముందు రోజు కాచి చల్లార్చి తరవాతి రోజు సేవించరాదు త్రిదోషాలను వృద్దిచెందించును.
* నీళ్లు కాచేప్పుడు పాత్రపైన మూత ఉంచరాదు. అలా మూత్రపెట్టి మరిగించుట చేత నీరు దోషయుక్తం అగును. కావున ఆ నీరు సేవించరాదు . ఆయుర్వేద కషాయాలు తయారుచేసేప్పుడు కూడా మూత పెట్టరాదు. ఆవిరి మరలా నీటిలో పడకూడదు అర్కం తయారుచేయు సమయం నందు మాత్రం మరిగించు పాత్ర మూతికి ఒక గొట్టం అమర్చి వేరొకపాత్రకు అనుసంధానం చేసి ఆ ఆవిరిని సేకరించవచ్చు.
* వర్షం పడునప్పుడు ఆకాశం నుండియే నేరుగా పాత్రలోకి సేకరించబడిన నీరు ఓజస్సును పెంచును. శరీరానికి బలాన్ని ఇస్తుంది. హృదయానికి మేలు చేస్తుంది . మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది . బుద్ధిశక్తిని పెంచును. చాలా పలుచనైనది. ఎటువంటి రుచి లేనిది . శుభ్రమైనది , చల్లనైనది , తేలికగా జీర్ణం అగును . అమృతముతో సమానమైనది. సూర్యునిచేత భూమి నుండి గ్రహింపబడి మరలా విడవబడుట చేత వాత,కఫ దోషాలు పొగొట్టును . చల్లదనం ఓజస్సు పెంచే గుణం వీనిని కలిగి ఉండుటచేత పిత్తదోషమును , రక్తదోషమును , విషాన్ని పొగొట్టును. దీనిని ఆయుర్వేదం నందు "గంగాంబు " అంటారు.
* వర్షాకాలం నందు వర్షము పడునప్పుడు మొదటి వర్షమును విడిచిపెట్టి వాతావరణములోని మాలిన్యము అంతా పోయిన తరువాత పాత్రల మూతికి సన్నని గుడ్డకట్టి వర్షపు నీరును సేకరించవలెను ఈ నీటి యందు B12 విటమిన్ పుష్కలంగా ఉండును.
* దాహం కలిగినపుడు నీళ్లు తాగకుండా భోజనం చేయరాదు . ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేయకుండా నీరు తాగరాదు. దాహముగా ఉన్నప్పుడు భోజనం చేయుట వలన కడుపులో గుల్మరోగం అనగా గడ్డ ఏర్పడును . ఆకలిగా ఉన్నప్పుడు నీళ్లు తాగడం వలన జలోదరం ఏర్పడును .
* బాగా అలిసిపోయిన వెంటనే భోజనం చేయుట వలన లేక నీరు తాగడం వలన జ్వరం వచ్చును. లేదా వాంతి అగును.
* రాత్రి సమయం నందు నువ్వులు చేర్చిన ఆహారాన్ని దేన్ని తినరాదు. గోధుమలు కంటికి మంచివే కాని నూనెతో చేయబడిన గోధుమ ఆహారం కంటికి చెడు చేయును .చపాతి వంటి వాటిని నూనె లేకుండా చేసుకుని తినవలెను .
* పులుపు రసం గల ఏ ఆహారపదార్థాన్ని పాలతో పుచ్చుకోకూడదు. అలానే పండ్లను , పాలను ఒకే సమయములో వాడరాదు. అరటి పండును మజ్జిగతో కాని , పెరుగుతో కాని కలిపి వాడరాదు.
* ముల్లంగి , ఆకుకూరలు తిని వెంటనే పాలు తాగరాదు. పిప్పళ్లు , మిరియాలు , తేనె , బెల్లముతో చేర్చి కాచి ఆకుకూరను వాడరాదు. బచ్చలికూర , నువ్వులు కలిపి వాడకూడదు. అలా కలిపి వాడినచో విరేచనాలు ఏర్పడవచ్చు.
* బియ్యాన్ని బాగా కడిగి ఉడికించి గంజివార్చి వండి వేడిగా ఉండు అన్నం త్వరగా జీర్ణం అగును. ఇలాకాక గంజి వార్చి వండినది , పాలు , మాంస పదార్థాలు చేర్చి వండినటువంటి అన్నం త్వరగా జీర్ణం కాదు.
* కొద్దిగా వేయించి బాగుగా ఉడికించిన పొట్టులేని కందిపప్పు వంటకం త్వరగా జీర్ణం అగును. ఆరోగ్యాన్ని ఇస్తుంది. బాగా ఉడికించి నెయ్యిలాంటి చమురు పదార్థాన్ని చేర్చి వండిన కూర వంటకం ఆరోగ్యాన్నీ ఇచ్చును.
* భోజనం చేయునపుడు మధ్యమధ్యలో కొద్దికొద్దిగా చన్నీళ్ళను తాగవలెను . దీనివలన ఆహారంలో రుచి ఏర్పడును . బాగా నమిలి తిన్న ఆహారం జీర్ణం అగును.
* చన్నీళ్ళను తాగుటవలన మద్యము తాగుటచేత వచ్చు మైకం , నీరసం , మూర్చ,వాంతి , తలతిరుగుట, దాహం , వేడి , మంట , శరీరంలో రంద్రాల నుంచి రక్తం కారు రక్తపిత్తవ్యాధి , విషదోషం వంటి సమస్యలు పోవును .
* వాతము మొదలగు దోషాలు , జఠరాగ్ని ఇవి సరైన స్థితిలో లేనివారికి , జ్వరం మొదలగు వ్యాధుల చేత బలహీనుడు అయినవారికి చన్నీళ్ళు తాగుట నిషేదించబడినది. వీరు చన్నీళ్లు సేవించుట వలన మూడు దోషములు ప్రకోపిస్తాయి. వీరు వేడినీటిని గాని లేదా కాచి చల్లార్చిన నీటినికాని సేవించవలెను .
* వేడినీరు అకలిని పుట్టించును . ఆహారాన్ని జీర్ణం చేయును . గొంతుకకు మంచిది . మూత్రసంచిని శుభ్రపరచును . ఎక్కిళ్ళు , కడుపు నొప్పి , జ్వరం, వాతరోగాలు , కఫరోగాలు , దగ్గు , జలుబు , ఉబ్బసం , డొక్కలో నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి వేడినీరు మంచిది . వాంతులు , విరేచనాలు అయ్యేవారికి కూడా చాలా మంచిది .
* ఒకసారి కాచబడిన నీరు మరలా కాచి తాగరాదు . కడుపు నందు విషములా మారి రోగాలను తెచ్చిపెట్టును .
* బావినీటిని తాగి అవి జీర్ణం అవ్వడానికి మునుపే ఏటినీటిని తాగరాదు. అదేవిధముగా ఒక ఊరినీటిని తాగి అవి జీర్ణం అవ్వడానికి మునుపే వేరే ఊరి నీరు తాగరాదు. చన్నీళ్ళను తాగి అవి సంపూర్ణంగా జీర్ణం అవడానికి ముందే కాచి చల్లార్చిన నీళ్లను తాగరాదు. వేడిగా ఉన్న నీరు తాగినవెంటనే చన్నీళ్లను తాగకూడదు .
పైన చెప్పిన నియమాలను పాటించకుండా నీళ్లను సేవించువారికి జలుబు , తలనొప్పి , దగ్గు మొదలయిన సమస్యలతో ఇబ్బంది పడటం జరుగును. కాచి చల్లార్చిన నీటిని తీసుకునే అలవాటు కలిగి ఉండటం చాలా మంచిది .
చన్నీళ్లు తాగిన అవి సంపూర్ణంగా జీర్ణం అగుటకు ఆరు గంటల సమయం పట్టును . కాచి చల్లార్చిన నీరు జీర్ణం అగుటకు మూడు గంటల సమయం పట్టును . కాగి గోరువెచ్చగా ఉండు నీరు ఒకటిన్నర గంటల కాలంలో జీర్ణం అగును.
* శరీరానికి చందనం పూసుకోవడం వలన సౌభాగ్యం , చర్మానికి కాంతి , సంతోషం , ఓజస్సు , బలం పెరుగుతాయి . చెమట, దుర్వాసన , మచ్చలు పోతాయి . నిస్సత్తువ తగ్గును.
* రత్నాభరణాలను ధరించడం లక్ష్మీకరం . మంగళకరం . దుఃఖాన్ని పోగొట్టును . సంతోషాన్ని ఇచ్చును. కోర్కెలను తీర్చును. ఓజస్సు పెరుగును .
* తలవెంట్రుకలు , గడ్డం , మీసం , గోళ్లు వీనిని కత్తిరించడం వలన బలం , మగతనం, ఆయుర్దాయం , అందం పెరుగును .
* ఐదురోజులు ఒకసారి తలవెంట్రుకలు , గడ్డం , మీసం , ఒంటిమీద వెంట్రుకలు , గోళ్లు కత్తిరించుకోవాలి. వీటిని తనచేత్తో తీసుకోరాదు . గోళ్లను పండ్లతో కొరికి తీయరాదు. క్షవరం చేసుకున్న తరువాత స్నానం చేయరాదు . ముక్కులో వెంట్రుకలు పీకరాదు అలా పీకినచో కంటిచూపు దెబ్బతినును . ముక్కులో వెంట్రుకలు కత్తిరించుకోవాలి తప్ప పీకరాదు.
* మనిషి ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు మాత్రమే భోజనం చేయవలెను . మధ్యలో భోజనం చేయరాదు .
* ఉదయం పూట భోజనం తొమ్మిది గంటలలోపు చేయరాదు . పన్నెండు గంటల తరువాత చేయరాదు . రాత్రి భోజనాన్ని తొమ్మిది గంటలలోపు చేయాలి . ఎప్పుడు పడితే అప్పుడు తినడం వలన జీర్ణావయవాలకు విశ్రాంతి దొరకడం వలన అవి బలహీనపడును. దానివలన జీర్ణసంబంధ వ్యాధులు కలుగును.
* భోజనం సరైన కాలంలో మాత్రమే చేయవలెను . తనకు సరైనది , శుభ్రమైనది , ఆరోగ్యకరమైనది , నెయ్యిలాంటి కొవ్వు పదార్దాలు కలిసినది , కొంచం పలుచుగా ఉండేది అగు ఆహారాన్ని తినవలెను . మరీ చల్లారిపోయింది , తేలికగా జీర్ణం కాని ఆహారాన్ని తినరాదు. తీపి కొంచం ఎక్కువుగా ఉండి ఆరు రసాలు కలిగిన ఆహారాన్ని తినవలెను .
* త్వరత్వరగా , హడావిడిగా భోజనం చేయరాదు . అదేవిధముగా మిక్కిలి మెల్లగా భోజనం చేయరాదు . స్నానం చేసిన తరువాత ఆకలిగా అనిపిస్తేనే భోజనం చేయవలెను . కాళ్లు , చేతులు కడుక్కుని ఏకాంతముగా భోజనం చేయవలెను . ఆహారపదార్థాలను దేన్నీ కూడా దూషించరాదు. భోజన సమయము నందు మౌనంగా ఉండవలెను . ఇష్టమైన పదార్ధాన్ని ఇష్టమైన వారు వడ్డిస్తుండగా తినవలెను .
* కడుపు యొక్క నాలుగింట రెండు భాగాలను అన్నం మొదలగు గట్టి ఆహారపదార్థాలతో నింపవలెను . మూడొవ భాగాన్ని నీళ్లు మొదలగు ద్రవపదార్దముతో నింపవలెను . నాలుగొవ భాగాన్ని వాయుప్రసారానికి అనువుగా వదిలివేయవలెను.
* భోజనం చేయునపుడు తడికాళ్ళు కలిగినవాడుగా భోజనం చేయవలెను . నిద్రించునప్పుడు పొడికాళ్ళు కలిగినవాడుగా నిద్రించవలెను. తడికాళ్లతో భుజించువాడు దీర్ఘజీవితం పొందువాడు అగును.
* భోజనం చేయునపుడు మంగళకరమైన , మనసుకి ఆనందాన్ని ఇచ్చే వస్తువులను చూడవలెను . దీనివల్ల ఆయుర్దాయం కలుగును.
* భోజనం చేయునపుడు అల్లం , ఉప్పు కలిపి తినటం వలన ఆకలి కలుగును. నోటికి రుచి ఏర్పడును . నాలిక , గొంతు శుభ్రపడును . భోజనం చేసేప్పుడు ముందు గట్టిగా ఉండు ఆహారపదార్థాలను నెయ్యి కలిపి తినవలెను . అటుతరువాత ద్రవమైన ఆహారాన్ని తీసికొనవలెను . ఇలా చేయడం వలన రోగాలు రావు .
మనిషి కాళ్లతో ఒళ్లును తొక్కించుకోవడం వలన వాతం తగ్గును. కఫం , శరీరంలోని కొవ్వు కరుగును. అవయవాలు గట్టిపడతాయి. చర్మం శుభ్రపడును .
* చేతులతో మెల్లగా ఒళ్లును పట్టించుకొనుటచేత మగతనం పెరుగును . కఫం , వాతం శరీర బడలిక తగ్గును. మాంసం , రక్తం పెరుగును . చర్మం శుభ్రమౌతుంది.
* ఎర్రచందనం , మంజిష్ట , కోష్ఠము , లోద్దుగపట్ట , ప్రేంఖణము , మర్రిచిగుళ్లు , చిరుశనగలు వీటన్నింటిని మెత్తటి చూర్ణం చేసి నీళ్లతో కలిపి ముఖమునకు పూసుకొనిన ముఖములో మంగు పోవును . ముఖానికి మంచి కాంతి ఏర్పడును . స్నానానికి పూర్వం పైపూతను పూసుకొనవలెను . పూసుకొనిన కొంతసేపటి తరువాత తడిగుడ్డతో తుడవవలెను. అటుపిమ్మట స్నానం ఆచరించవలెను.
* తమలపాకు , కోష్ఠము , జటామాంసి , ఎర్రచందనపు చెక్క , శనగలు , దాల్చినచెక్క వీనిని సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి శరీరానికి పూసుకొని ఒక అర్థగంట పిమ్మట స్నానం చేయుచున్న శరీరం నుండి వెలువడు దుర్గన్ధము నశించును. పైన చెప్పినటువంటి వస్తువులు దొరకనప్పుడు లేత మారేడు ఆకులు నూరి శరీరానికి పట్టించి ఉదయం మరియు సాయంత్రం అర్థగంట ఆగి స్నానం చేయుచున్న శరీరం నుంచి వెలువడు చెడువాసన పోవును .
* చన్నీళ్ళ స్నానం మంట,అలసట , చెమట,దురద , దాహం పోగొట్టును . గుండెకు మంచిది . మురికిని , సోమరితనాన్ని హరించును . సంతోషాన్ని , ఇంద్రియాలకు బలాన్ని చేకూర్చును . మగతనం పెంచును. ఆకలి కలిగిస్తుంది .
* వేడినీటితో మెడవరకు స్నానం చేయుటవలన ఒంటికి బలం వస్తుంది. వేడినీటితో తలస్నానం చేయుటవలన తలవెంట్రుకలకు , కంటికి బలం తగ్గును.
* ఉశిరిక ఒరుగు చూర్ణాన్ని తలకు , శరీరానికి రుద్దుతూ స్నానం చేసేవారు ఒళ్ళు ముడతలు పడటం , తలనెరిసిపోవడం వంటి సమస్యల లేకుండా నూరేళ్లు జీవిస్తారు.
* చన్నీటి స్నానం పడనివారు వేడినీటితో కంఠం కిందవరకే వేడినీటిని ఉపయోగించి స్నానం చేయవలెను . ఎక్కువుగా ఉండు వేడినీటిని అస్సలు వాడరాదు. తలను తడపకుండా స్నానం చేయరాదు . కొద్దిగా నీరు ఉండే జలాశయాలలో , మిక్కిలి చల్లగా ఉండు నీళ్లలో స్నానం చేయరాదు . దిగంబరుడుగా ఉండి స్నానం ఆచరించకూడదు.
* స్నానం ఆచరించిన పిదప దేహావయములను రుద్దుకోరాదు. తలవెంట్రుకలు విదిల్చరాదు. శరీరం పూర్తిగా తడి ఆరుటకు మునుపే తలపాగా , ఉతికిన బట్టలు ధరించాలి. పైనుండి వేగముగా పడు జలధార క్రింద ఉండి స్నానం ఆచరించకూడదు. ఇలా చేయుట వలన జలవేగం కారణముగా జ్ఞానేంద్రియాలకు దెబ్బ తగులు అవకాశం కలదు.
* వాతం వలన ముఖం వంకరగా పోవువ్యాధి కలిగినవారు , కండ్లకు సంబంధించిన జబ్బులు కలవారు , తలకు , చెవికి , నోటికి సంబంధించిన జబ్బు కలవారు , విరేచనం , కడుపుబ్బరం పడిసెం , అజీర్ణం వ్యాధులు కలవారు స్నానం చేయరాదు .
* శుభ్రముగా ఉండు వస్త్రాలను మాత్రమే ధరించవలెను . యశస్సు , ఆయుష్షుని వృద్దిచెందించును . అలక్ష్మిని హరించును . సంతోషాన్ని హరించును . అందాన్ని పెంచును. సభాగౌరవాన్ని పెంచును.
* పట్టు వస్త్రం , కంబళి , ఎర్రని వస్త్రం వాత,శ్లేష్మాలను పోగొట్టును . వీనిని చలికాలం ధరించవలెను . కావి రంగు వస్త్రం బుద్దిని పెంచును . చల్లదనాన్ని ఇచ్చును. పిత్తాన్ని పోగొట్టును . దీన్ని ఎండాకాలం ధరించాలి . దళసరి అయిన వస్త్రం కంటే పలుచనైనా వస్త్రం శ్రేష్టం . తెల్లని వస్త్రం మంగళకరమైనది. చలిని , ఎండని నివారించును. చలువచేయదు అదేవిధముగా వేడిచేయదు . దీనిని వానాకాలం ధరించటం మంచిది .
* నిద్రపోయే ముందు , ఇంటి నుండి బయటకి పోయే ముందు , పూజ చేయు సమయాలలో వేరువేరు వస్త్రాలను ధరించాలి . చినిగిపోయిన వస్త్రాన్ని , మురికి వస్త్రాన్ని , బాగా ఎరుపుగా ఉన్న వస్త్రాన్ని , ఇతరులు కట్టుకున్న వస్త్రాన్ని కట్టుకోకూడదు. ఇతరులచే ధరింపబడిన వస్త్రం మరియు చెప్పులను ధరించకూడదు . ముందు కట్టుకున్న వస్త్రాన్ని ఉతక్కుండా మరలా దానినే కట్టుకోకూడదు.
* చేతులతో మెల్లగా ఒళ్లును పట్టించుకొనుటచేత మగతనం పెరుగును . కఫం , వాతం శరీర బడలిక తగ్గును. మాంసం , రక్తం పెరుగును . చర్మం శుభ్రమౌతుంది.
* ఎర్రచందనం , మంజిష్ట , కోష్ఠము , లోద్దుగపట్ట , ప్రేంఖణము , మర్రిచిగుళ్లు , చిరుశనగలు వీటన్నింటిని మెత్తటి చూర్ణం చేసి నీళ్లతో కలిపి ముఖమునకు పూసుకొనిన ముఖములో మంగు పోవును . ముఖానికి మంచి కాంతి ఏర్పడును . స్నానానికి పూర్వం పైపూతను పూసుకొనవలెను . పూసుకొనిన కొంతసేపటి తరువాత తడిగుడ్డతో తుడవవలెను. అటుపిమ్మట స్నానం ఆచరించవలెను.
* తమలపాకు , కోష్ఠము , జటామాంసి , ఎర్రచందనపు చెక్క , శనగలు , దాల్చినచెక్క వీనిని సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి శరీరానికి పూసుకొని ఒక అర్థగంట పిమ్మట స్నానం చేయుచున్న శరీరం నుండి వెలువడు దుర్గన్ధము నశించును. పైన చెప్పినటువంటి వస్తువులు దొరకనప్పుడు లేత మారేడు ఆకులు నూరి శరీరానికి పట్టించి ఉదయం మరియు సాయంత్రం అర్థగంట ఆగి స్నానం చేయుచున్న శరీరం నుంచి వెలువడు చెడువాసన పోవును .
* చన్నీళ్ళ స్నానం మంట,అలసట , చెమట,దురద , దాహం పోగొట్టును . గుండెకు మంచిది . మురికిని , సోమరితనాన్ని హరించును . సంతోషాన్ని , ఇంద్రియాలకు బలాన్ని చేకూర్చును . మగతనం పెంచును. ఆకలి కలిగిస్తుంది .
* వేడినీటితో మెడవరకు స్నానం చేయుటవలన ఒంటికి బలం వస్తుంది. వేడినీటితో తలస్నానం చేయుటవలన తలవెంట్రుకలకు , కంటికి బలం తగ్గును.
* ఉశిరిక ఒరుగు చూర్ణాన్ని తలకు , శరీరానికి రుద్దుతూ స్నానం చేసేవారు ఒళ్ళు ముడతలు పడటం , తలనెరిసిపోవడం వంటి సమస్యల లేకుండా నూరేళ్లు జీవిస్తారు.
* చన్నీటి స్నానం పడనివారు వేడినీటితో కంఠం కిందవరకే వేడినీటిని ఉపయోగించి స్నానం చేయవలెను . ఎక్కువుగా ఉండు వేడినీటిని అస్సలు వాడరాదు. తలను తడపకుండా స్నానం చేయరాదు . కొద్దిగా నీరు ఉండే జలాశయాలలో , మిక్కిలి చల్లగా ఉండు నీళ్లలో స్నానం చేయరాదు . దిగంబరుడుగా ఉండి స్నానం ఆచరించకూడదు.
* స్నానం ఆచరించిన పిదప దేహావయములను రుద్దుకోరాదు. తలవెంట్రుకలు విదిల్చరాదు. శరీరం పూర్తిగా తడి ఆరుటకు మునుపే తలపాగా , ఉతికిన బట్టలు ధరించాలి. పైనుండి వేగముగా పడు జలధార క్రింద ఉండి స్నానం ఆచరించకూడదు. ఇలా చేయుట వలన జలవేగం కారణముగా జ్ఞానేంద్రియాలకు దెబ్బ తగులు అవకాశం కలదు.
* వాతం వలన ముఖం వంకరగా పోవువ్యాధి కలిగినవారు , కండ్లకు సంబంధించిన జబ్బులు కలవారు , తలకు , చెవికి , నోటికి సంబంధించిన జబ్బు కలవారు , విరేచనం , కడుపుబ్బరం పడిసెం , అజీర్ణం వ్యాధులు కలవారు స్నానం చేయరాదు .
* శుభ్రముగా ఉండు వస్త్రాలను మాత్రమే ధరించవలెను . యశస్సు , ఆయుష్షుని వృద్దిచెందించును . అలక్ష్మిని హరించును . సంతోషాన్ని హరించును . అందాన్ని పెంచును. సభాగౌరవాన్ని పెంచును.
* పట్టు వస్త్రం , కంబళి , ఎర్రని వస్త్రం వాత,శ్లేష్మాలను పోగొట్టును . వీనిని చలికాలం ధరించవలెను . కావి రంగు వస్త్రం బుద్దిని పెంచును . చల్లదనాన్ని ఇచ్చును. పిత్తాన్ని పోగొట్టును . దీన్ని ఎండాకాలం ధరించాలి . దళసరి అయిన వస్త్రం కంటే పలుచనైనా వస్త్రం శ్రేష్టం . తెల్లని వస్త్రం మంగళకరమైనది. చలిని , ఎండని నివారించును. చలువచేయదు అదేవిధముగా వేడిచేయదు . దీనిని వానాకాలం ధరించటం మంచిది .
* నిద్రపోయే ముందు , ఇంటి నుండి బయటకి పోయే ముందు , పూజ చేయు సమయాలలో వేరువేరు వస్త్రాలను ధరించాలి . చినిగిపోయిన వస్త్రాన్ని , మురికి వస్త్రాన్ని , బాగా ఎరుపుగా ఉన్న వస్త్రాన్ని , ఇతరులు కట్టుకున్న వస్త్రాన్ని కట్టుకోకూడదు. ఇతరులచే ధరింపబడిన వస్త్రం మరియు చెప్పులను ధరించకూడదు . ముందు కట్టుకున్న వస్త్రాన్ని ఉతక్కుండా మరలా దానినే కట్టుకోకూడదు.
* ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తము నందు నిద్రనుంచి మేల్కొనవలెను .
* సూర్యోదయానికి మునుపే సుమారు 20 ఔన్సుల ( 592 ml ) కుండ యందు గల నీటిని సేవించవలెను . ఈ విధానం వలన ముసలితనం త్వరగా రాదు .
* తెల్లవారుజామునే మలమూత్ర విసర్జన చేయవలెను . మలమూత్రాలు విసర్జించాలని సూచన కలిగినప్పుడే విసర్జించవలెను . ఆలోచన వేరే చోట ఉంచి విసర్జించరాదు. మలమూత్ర వేగాన్ని నియంత్రించకూడదు. తెల్లవారుజామునే మలమూత్ర విసర్జన వలన ఆయుర్దాయం పెరుగును .
* ముక్కిముక్కి బలవంతముగా మలవిసర్జన చేయుట వలన తలనొప్పి , నరాల బలహీనత , రొమ్ము నొప్పి, మూలవ్యాధి మొదలగు రోగాలు కలగవచ్చు . అపానవాయువు విడువకుండా బందించుట మూలాన కడుపుబ్బరం , కడుపునొప్పి వచ్చును.
* ఉదయాన్నే మరియు సాయంకాలం చేదు , వగరు , కారం రుచులు కలిగినటువంటి మర్రి, వేగిస,జిల్లేడు , చండ్ర, కానుగ, గన్నేరు , గుగ్గిలం , తుమ్మ, ఉత్తరేణి , జాజి , మద్ది చెట్ల వేర్లు గాని లేదా పైన చెప్పిన చెట్ల కొమ్మలనుగాని బాగా నమిలి కుంచలా ( బ్రష్ ) చేసుకుని చెంగల్వకోష్టు , కరక్కాయ వొలుపు , తాండ్రకాయ వొలుపు , ఉశిరికాయ వొలుపు , యాలకలు , దాల్చినచెక్క , లవంగపత్రి , మిరియాలు , శొంటి , పిప్పిళ్లు అన్నింటిని సమపాళ్లలో తీసుకుని మెత్తటి పొడి చేసి దానిలో కావలసినంత తేనె కలిపి పైన చెప్పిన కుంచెకు అద్ది చిగుళ్లకు గుచ్చుకోకుండా మౌనంగా దంతధావనం చేసుకొనవలెను . తేనె ఉపయోగించకుండా చూర్ణం కూడా వాడవచ్చు . దీనివలన దంతసంబంధ సమస్యలు నశించి , పళ్లు గట్టిపడును.
* గట్టిగా ఉండు ఆహారపదార్థాలు కొరికి తినడం , తీపి పదార్థాలు ఎక్కువ తినడం , మరీ చల్లగా , మరీ వేడిగా ఉండు ద్రవపదార్థాలు తీసుకోవడం , ఎక్కువ సార్లు తాంబూలం వేసుకోవడం , పగలు నిద్రించడం , రాత్రి భుజించిన వెంటనే పడుకోవడం , తలగడ లేకుండా పడుకోవడం , రాత్రి సమయం నందు త్వరగా భుజించకపోవడం వంటివి దంతరోగాలు రావడానికి ప్రధాన కారణం .
* అజీర్ణం , వాంతి, ఉబ్బసం , దగ్గు , జ్వరం , వాతం వలన మూతి వంకరగా పోవు వ్యాధి , దప్పికతో బాధపడువారు , నోటిపుండు , హృదయ సంబంధ రోగాలు కలవారు , కండ్ల జబ్బులు , తలకు సంబంధించిన వ్యాధులు , చెవికి సంబంధించిన వ్యాధులు కలవారు దంతధావనం కొరకు పుల్లను వాడకూడదు.
* బంగారం , వెండి, రాగి , సీసం , ఇత్తడి వంటి లోహాలతో పదునుగా కాకుండా మృదువుగా ఉండే విధముగా నాలిక గీయుటకు బద్దను తయారుచేసుకోవలెను . దీంతో నాలిక మొదటి బాగంలో యుండు ఊపిరిని గూడా అడ్డగించు దుర్గన్ధపూరితమైన కళ్లే బయటకి వెల్లునట్లు గీచుకొనవలెను .
* చన్నీళ్లతో నోరు పుక్కిలించడం చేత నోటిలోని కఫం , మాలిన్యం పోవును . నోరు శుభ్రం అగును. దప్పిక తగ్గును. గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వలన కఫము , రుచిలేకుండా ఉండుట , మాలిన్యం , దంతములు మొద్దుబారుట వంటి సమస్యలు పోవును . నోటికి తేటదనం వచ్చును.
* చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం వలన నోరు , ముక్కు మొదలయిన వాటి నుండి రక్తం కారటం నిలుచును . ముఖములో ఏర్పడు మంగు పోతుంది .
* గోరువెచ్చటి నీటితో ముఖము కడుగుట వలన ముఖం శుభ్రపడును . జలుబు , ముఖం భారంగా ఉండటం పోయి ముఖమునకు తేటదనం , నునుపుదనం వచ్చును.
* ప్రతినిత్యం "అణుతైలం " ప్రతి ముక్కు రంద్రములో రెండు చుక్కల వంతున వేసుకొని లోపలికి పీల్చాలి . దీనివలన మనిషికి కాంతివంతమైన చర్మం , ఎత్తైన భుజాలు , లావైన మెడ , అందమైన ముఖం , విశాలమైన రొమ్ము , సువాసన కలిగిన నోరు , ఇంపైన స్వరం కలుగును. జ్ఞానేంద్రియాలకు చురుకుదనం వస్తుంది. ముసలితనం త్వరగా రాదు . తలవెంట్రుకలు తెల్లబడటం , మంగు ఏర్పడదు. అణుతైలాన్ని ముక్కులలో వేసుకొని పీల్చడం వలన చాలారోజుల నుంచి బాధించు తలనొప్పి తగ్గును. అణుతైలం దొరకనప్పుడు కల్తీలేని స్వచ్చమైన నువ్వులనూనె వాడవచ్చు .
No comments:
Post a Comment