అభ్యంగనం ( శరీరానికి నువ్వుల నూనె రాసుకొని మర్దన చేయుట ) , శరీరానికి పుష్టి కలిగించు ఆహారపదార్థాలను సేవించుట , శరీరానికి ఆవిరి పట్టుట , కూర్చోవడం , వస్తికర్మలు , ఔషధాలను ముక్కుతో పీల్చుట , ఎండలో ఉండుట , వేడినీటితో స్నానం చేయుట , ఔషధ తైలాలు నింపిన తొట్టిలో ఉండటం , మద్యము , భూమిపై పరుండుట , శరీరానికి సుఖం కలిగించేలా మర్దన చేయించుకొనుట , లవణ , మధుర,తియ్యటి రసాలు కలిగిన ఆహారాలు తీసుకొనుట , ఉలవలు , నువ్వులు, గోధుములు , మెతుకులు కలిసిన గంజి , బియ్యము కడిగిన నీరు , పాలు , వేడినీరు , గోమూత్రము , వట్టివేళ్ళని నీటిలో వేసి ఉరిబెట్టిన నీరు , మజ్జిగ , కొబ్బరినీరు , లేత వంకాయ , పొట్లకాయ , బీరకాయ , మునగకాయ , ఉల్లిగడ్డలు , ద్రాక్షపండ్లు , ఉశిరిక కాయలు , దానిమ్మపండ్లు , రేగుపండ్లు , వెలగపండ్లు , కరక్కాయలు , తాటిపండ్లు , చక్రవర్తికూర , పొన్నగంటికూర , తాంబూలం , స్వర్ణభస్మం , రజతభస్మం మొదలైనవి వాడవలెను .
పాటించకూడని ఆహార నియమాలు -
అతిగా బాధపడటం , వాంతి , ఉపవాసం , అతివ్యాయామం , ఏనుగులు , గుర్రాలపైన స్వారీచేయుట , మలమూత్రాలను నిరోధించరాదు. అతి సంభోగం నిషిద్ధం , విరుద్ధ ఆహారసేవన చేయరాదు , కొర్రలు , యవలు , సామలు , జొన్నలు , చద్ది అన్నం , అడివి పెసలు , శెనగలు , శెనగ పిండి , బఠాణీలు , కాకరకాయలు , దోసకాయ , తాటికల్లు , తాటిముంజలు , నదీజలం , గానుగ పిండి , చల్లటినీరు , చేప , ఎండిన మాంసములు .
పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ సేవన చేయవలెను.

No comments:
Post a Comment