Sunday, January 19, 2020

వృక్షాయుర్వేద రహస్యాలు ( about trees

 *  మనుష్యులకు వలనే చెట్లకు కూడా వాతము , పిత్తము , కఫ దోషాలు ఉండును. ఈ త్రిదోషాల వలనే వృక్షములకు రోగములు సంప్రాప్తినిచ్చును. వచ్చిన రోగాన్ని ఏ దోషము వలన వచ్చినదో గుర్తించి సరైన చికిత్స చేయవలెను .

 *  వాతప్రకృతి కలిగిన చెట్టు సన్నబారి పొడుగ్గా పెరుగును . అనగా పొడుగు తగ్గట్టు కాండం లావుగా ఉండదు. స్పర్శజ్ఞానం తగ్గును. పూస్తుంది మరియు కాస్తుంది.

 *  పిత్తప్రకృతి కలిగిన చెట్టు ఎండకి ఓర్చుకోలేదు . తెల్లబారుతుంది. తరచుగా కొమ్మలు విరిగిపోవును. సమయం రాకముందే కాయలు పండిపోవును.

 *  కఫప్రకృతి కలిగిన చెట్టు ఆకులు మందంగా దట్టంగా ఉండి పూస్తూ , కాస్తూ ఉండును.

 *  వొగరు , చేదు , కారము రసాల వల్ల వాతము , వొగరు , ఉప్పు , పులుపు రసాల వలన పిత్తము , తీపి , పులుపు , ఉప్పు రసాల వల్ల శ్లేష్మము పోవును .

 *  చెట్టుకు వాతం వలన కంతులు ఎక్కువుగా పుట్టును . ఆవుపేడ , వస , కుణపజలం బాగా కలిపి పోస్తే కణుపులు తగ్గును.

 * ఒక్కో చెట్టుకు ఎటువంటి రోగము కనిపించదు. పగడపు రంగుతో నవనవలాడే చెట్టు ఒక్కసారిగా మోడువారటం , వికారంగా కనిపించడం జరుగును. అప్పుడు ఆ చెట్టు మొదలు దగ్గర తవ్వినచో పురుగులు ఉండును . వాటిని తీసివేసి ఆ పురుగులు తొలచినచోట ఆవుపంచితం , నెయ్యి , విడంగాలు , ఆవాలు , నువ్వులు కలిపి నూరి పూయవలెను . నిప్పులపై వేసి కొంత ధూపం వేయవలెను . ఇలా చేయుచున్న ఆ చెట్టు చిగిర్చి బాగుపడును .

 *  పిడుగు పడి మాడిపోయిన చెట్టు బూడిద మంచుతో దెబ్బతిన్న చెట్టుపైన చల్లిన దోషం పోవును . తోటకు అన్ని దిశలలో చల్లిన తోటకు మంచు బాధ ఉండదు.

 *  తెల్లని వరి అన్నంలో పెరుగు , సైన్ధవ లవణం కలిపి తోటకు అన్ని దిశలలో చల్లిన తోటకు దిష్టిదోషం కలగదు.

       పైన చెప్పినవే కాకుండా మరెన్నో విలువైన వృక్షయుర్వేద రహస్యాలు నా గ్రంథాలలో ఇచ్చాను. వాటిలో చదవగలరు . 

No comments:

Post a Comment