Sunday, January 19, 2020

అష్టాంగ హృదయం నందు వాగ్బటుడు విషాహారం పరీక్షల గురించి తెలియచేసిన క్రమం poisoness food

విషాహారం లక్షణాలు  -

 విషం కలిసినటువంటి అన్నము గట్టిగా, ఒక్కో కణము విభజించుటకు వీలు లేకుండా ఉండును. చిరకాలము మీద జీర్ణం అగును. పాకమైన తోడనే వుడకనట్టు కనిపించును. నెమలి కంటం వలే నానా వర్ణములుగా కనిపించును. వేడి లేనిదిగా కనిపించును. అట్టి అన్నం ఉపయోగించుట చేత సృహ లేకుండా ఉండుట, నోట నీరు కారుట మొదలయిన లక్షణములు కలుగును.

           విష సంబంధం గల అన్నముకు మంచి వర్ణం గంధం ( వాసన ) మొదలుగునవి కొరవడి ఉండును. జలమధ్యమం లొ వేయబడిన నూనె బిందువు వలే విచిత్రమైన బిందువులతో గూడి తడిగా ఉండును. ఈ ప్రకారం విష సంబందమైన ఆహారమును సరిగ్గా పరీక్షింప వలెను.

 విషం కలిసిన పదార్ధ లక్షణములు  -

   విషం కలిసిన మాంసం లో నీలరేఖ , పాలలో కలిసిన ఎర్రని రేఖ , పెరుగు లొ విషం కలిసిన కొతి రంగులొ గల రేఖ , తక్రము లొ పసుపు వర్ణం గల నల్లగా ఉండు రేఖ , నెయ్యిలొ జలతుల్యమైన రేఖ మద్యం , ఉదకం లొ కృష్ణ వర్ణం గల రేఖ కండ్లకు కనిపించును.

            విషసంబంధం వలన పెరుగు మీద మీగడ లో పావుర పిట్టతో సమాన వర్ణం గల రేఖ , ద్రవ ఔషధములలో విషం కలిసిన నల్లటి వర్ణం గల రేఖ , పండ్లలో కలిసిన మురిగిపోవుట , మృదువుగా ఉండు వస్తువులు కటినం గా ఉన్నట్టు, కటినంగా ఉండు వస్తువులకు మృదువుగా ఉన్నట్టు కనిపించును.

 విషము ఇచ్చువాడి లక్షణము  -

    విషము ఇచ్చు మనుజుడు ముఖము నందు ఒకరకమయిన రంగు కలిగి ఎండి యుండి ముఖమును భయము గలవాడై లజ్జతో గూడి నలుదిక్కులా యందు పలుమారు జుజుచు నుండుటయే గాక చెమట, వణుకు, అధైర్యం అను వానితో గూడి తనను మరుగుపరుచుకోనుటకు ప్రయత్నించును. నడుచునప్పుడు నిష్కారణంగా కాలు తడబడుచు పలుమారులు ఆవలింతలు విడుచుచుండును.

               అకారణంగా నవ్వుతూ , ప్రశ్నకు సరియయిన సమాధానం ఇచ్చుచుండును . ఒక సంగతి చెప్పబోయి ఆగుచుండును. వ్రేళ్ల యందు మెటికలు విరుచుచుండెను. తలను గోకుచు , వ్రేళ్ల యందు మెటికలు విరుచు చుండెను. తలను గోకినను పెదవులు నాకును . కాలితో భూమి యందు గీచుచుండెను. ఒకచోట స్థిరముగా నిలువకుండెను . కావున ఈ లక్షణములను బట్టి విషమును ఇచ్చువానిని తెలుసుకోన వలెను అని వాగ్బటా చార్యుడు తన అష్టాంగా హృదయం నందు వివరించెను.

 అగ్ని సహాయంతో విషం కలిసిన ఆహారాన్ని పరీక్షించుట  -

  విషముతో కూడినటువంటి అన్నమును అగ్ని యందు వేచినచో ఒక్కసారిగా జ్వాల పెద్దగా లేచి చట చట అని శబ్దము కలుగును. అగ్ని యెక్క జ్వాలయు, పోగయు , నెమలి కంటం వలే చిత్రవర్ణం
 గలవిగా ఉండును. ఆ పొగ పీల్చినచో గగుర్పాటు, శిరము నందు వేదన, ముక్కు నుంచి నీరు కారడం , నేత్రబాధ వీనిని కలగజేయును.

No comments:

Post a Comment