యోగశాస్త్రమున షట్చక్రములను గురించి వివరణ కనిపించుచున్నది. యోగముతో ఆత్మ , పరమాత్మను కలియుటకు చేయు ప్రయత్నము లేక కొన్ని అతీంద్రియ శక్తులను పొందుటకు యోగాభ్యాసములో అనేక విధములుగా వీటిని గురించి వివరించడం జరిగింది. యోగశాస్త్రములో ఈ షట్చక్రములను పద్మములు అనియు , కమలములు అనియు అందురు.
ఇప్పుడు మీకు షట్చక్రముల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. ఈ చక్రాలు మొత్తం 7 .
* మూలాధార చక్రము -
ఇది గుదస్థానము నందు ఉండును. ఈ చక్రము నుండి గుద , వస్తి , వృషణాలకు దీని నుండి శాఖలు వెడలును . దీనిని కుండలినీ శక్తి కేంద్రముగా చెప్పెదరు . అధోముఖ రక్తపద్మముగా ఉండును. యోగ పద్దతిలో మూలాధార చక్రమును స్వాధీనము చేసుకొనిన వానికి వాక్కు మీద శక్తి , మానవేతర ప్రాణుల సంభాషణలను గ్రహించు శక్తి , సమస్త విద్యల యందు పాండిత్యము , ఆరోగ్యము , నిరవధిక మహదానందం కలుగును.
రక్తవర్ణములో నాలుగు దళములను కలిగి ఉండి ఆ దళములపై "వ , శ, ష , స అను నాలుగు స్వర్ణమయమైన నాలుగు అక్షరములను కలిగి ఉండును. ఈ పద్మము యొక్క కర్ణికలో నాలుగు కోణములు కలదియు , ఎనిమిది శూలములచే ఆవరించబడి , పీతవర్ణము కలిగి భూమండల తత్వము ఉన్నది. భూమండల మధ్యయందు ఐరావతం అను వాహనం ఎక్కి " లo " అనెడి పృథ్వి బీజాక్షరము కలదు. దీనికి శక్తి డాకిని . అధిపతి బ్రహ్మ , కర్ణిక యొక్క మధ్యభాగమున తేజోస్వరూపమైన త్రికోణం ఉండును. దాని మధ్యన రక్తవర్ణమగు కామబీజమును దానిపై నల్లనిరంగు గల స్వయం భూలింగమును , ఆ లింగము చుట్టూ మూడున్నర చుట్లు తిరిగి ఉండు కుండలిని శక్తియు , దానిపై దండాకార చిత్కళ ఉన్నట్టుగా యోగశాస్త్రమున చెప్పబడెను .
* స్వాదిష్టాన చక్రము -
ఇది మూలాధార చక్రమునకు ఊర్ధ్వముగా ఉండును. దీనిని స్వాధీనం చేసుకొనిన యోగి అరిష డ్వర్గాలైన కామ,క్రోధ , లోభ , మద , మాత్సర్యాదులను జయించి ఆత్మజ్ఞానం కలిగి మానవాతీత అద్భుతశక్తులను సాధించి అనుభవించి ప్రసాదించగలడు.
దీనిస్థానము లింగమూలము , సింధూరవర్ణమైన ఆరు దళములను , కలిగివుండి దేదీప్యమానప్రకాశములై బ , భ , మ , య , ర , ల అనెడి ఆరు భీజాక్షరములను కలిగి ఉండి కర్ణిక యందు అర్ధచంద్ర స్వరూపమైన అష్టదళములు కలిగిన శ్వేత జలమండలం ఉండును. వాని మధ్య మకరవాహనం అధిష్టించిన " వం " అనెడి బీజాక్షరం ఉండును. బీజాక్షర మధ్యమమున అధిపతి అయిన విష్ణువు కలడు .
* మణిపూరక చక్రము -
యోగి ఈ చక్రమును వశపరుచుకున్న ఇహ లోకపరమైన బాధలు అన్నింటి నుండి విముక్తినొంది శివసాక్షత్కారమును పొందును. అని చెప్పబడినది. దీని స్థానం నాభి . ఇది మేఘ వర్ణము కలిగి " డ , ఢ , ణ , త, ధ , ద , ధ , న , ప , ఫ అనెడి బీజాక్షరములు కలిగిన పది దళములు కలిగి ఉన్నది. కర్ణిక యందు త్రికోణాకృతియు ఆ త్రికోణమునకు వెలుపల మూడు స్వస్తికములతో కూడి రక్తవర్ణము కలిగి అగ్నిమండలం ఉండును. దానిపైన మేషవాహనరుఢమైన " రం" అనెడి అగ్నితత్వ బీజాక్షరమును , దాని మధ్య వృషభారూఢుడగు రుద్రుడు కలడు. లాకిని అనెడి శక్తి కర్ణిక కలదు.
* అనాహత చక్రము -
దీనికి స్థానము హృదయము . దీనిని స్వాధీనము చేసికొనిన యోగి నవమోహనకారుడై , ఆదర్శ యవ్వనవంతుడు అయ్యి ఆకాశగమనము చేయగల శక్తిని పొందును. కదంబ పుష్పము వలె అరుణవర్ణం కలిగి " క, ఖ , గ, ఘ , జ , చ , ఛ, జ , జు , ఇ , ట , ఠ అనెడి పండ్రెండు బీజాక్షరములు కల పన్నెండు దళములు కలవు. కర్ణిక యందు ధూమవర్ణము కలిగి షట్కోణాకృతి గల వాయుమండలం దాని మధ్యన కోటిమెరుపులతో సమాన కాంతి గల త్రికోణమును దాని మీద కృష్ణమృగమును అధిష్టించియున్న " యం " అనెడి వాయుబీజాక్షరము , దీనికి అధిపతి ఈశుడు . కాకిని అను శక్తి ఉండును.
* విశుద్ధ చక్రము -
దీనిని స్వాధీనం చేసుకోనిన యోగి పరిపూర్ణజ్ఞానియై మామూలు జీవనము కన్న అధిక జీవన ప్రమాణము కలిగి , త్రికాలజ్ఞుడై ఏ రకమైన శారీరక ప్రయత్నము లేకయే , మనస్సు నందు తలుచుకొనగానే ఆకార్యములను నిర్వహించగల సామర్ధ్యమును పొందును.
దీని స్తానము కంఠమునకు అధోభాగము నందు ఉండును. ఇది రక్తవర్ణం కలిగి పదహారు దళములను కలిగి ఉన్నది. కర్ణిక యందు వర్తులాకారమైన ఆకాశమండలం ఉన్నది. దాని మధ్యన త్రికోణమును , అందు చంద్రమండలమును దానిపైన శ్వేతగజము అధిష్టించిన "హం" అనెడి ఆకాశ బీజము కలవు . దీనికి అధిపతి సవాశివుడు . శక్తి శాకినీ .
* ఆజ్ఞాచక్రము -
దీనిస్థానము భ్రు మధ్యమము . ఇందు చిత్రవర్ణములు గల హ , క్ష అనెడి రెండు అక్షరములు కలిగిన తెల్లని వర్ణము కల రెండు దళములను కలిగి ఉన్నది. త్రికోణము నందు విద్యుత్ కాంతిని పోలిన శ్వేతవర్ణము కల లింగమున్నది. దానిపైనున్న త్రికోణము నందు ప్రణవ స్వరూపమైన అంతరాత్మ జ్యోతివలె ఉండును. దాని నలుదిక్కుల యందు అంతరిక్షమందు అగ్నికణములచే ఆవృతమైన జ్వలించుచుతూ తన తేజస్సు వలన మూలాధారం నుండి బ్రహ్మరంధ్రము వరకు ప్రకాశించునది అగు జ్యోతి ఉన్నది. దాని మీద సూక్ష్మరూపమగు మనస్సు కలదు. దాని మీద చంద్రమండలం నందు శక్తితో కూడిన " హంస" అనెడి పరమశివం ఉన్నది. దానిపై కారణ అవాంతర శరీరం , సహస్ర దళములతో కూడిన కమలము మొదలైనవాని పాదములు కలవు.
* సహస్రారము - ( CEREBRUM) .
కపాలము మధ్యగా , పురః సీమంతము , మధ్య సీమంతముల మధ్య దీని ప్రదేశము అని చెప్పెదరు. దీనిని సహస్రదళ కమలము అనియు అందురు. సహస్రదళములు కలిగి అధోభాగమున సుషుమ్నతోడను , ఊర్ధ్వమున బ్రహ్మరంధ్రము తోడను కలియుచున్నది . ఆత్మతత్వము ఇందులో ఉండునని చెప్పుదురు. ఇందుగల తత్వకాంతులు అనంతము . అక్షరములు , వర్ణములు వేయి కలవు. "అ .మ " అనెడి చంద్రుడి పదనారవ కళ ఉండును. ఈ కళ బాలసూర్య ప్రకాశ సమానంగా ఉండును. నిర్వికార , నిర్మలమైనది. పద్మనాళము నందలి సూక్ష్మమైన దారమును వంద భాగములుగా చేయగా అందలి యొక భాగము ఎంత సూక్ష్మంగా ఉండునో అంత సుక్ష్మమైనది , శ్రేష్టమైనది. కోట్లకొలది మెరుపు తీగవలె ఉండును. కోమలమైన ఆకృతి కలిగి ఉండి అధోముఖమై నిత్యప్రకాశము కలిగి ఉండును. పూర్ణానంద పరంపర నుండి అధికంగా స్రవించుండెడి అమృతమును ధరించుచున్నది.
ఈ సహస్రారాన్ని సాధించిన వ్యక్తి అత్యద్భుత శక్తులను సాధించి ఈశ్వర సమానుడు అవుతాడు. భగవంతుడు తన శక్తులనన్నింటిని మనిషినందే నిక్షిప్తం చేశాడు . ఈ శక్తులన్నీ మానవుని వెన్నుపాము కింద భాగములో నిక్షిప్తం అయి నిద్రాణ స్ధితిలో ఉండును అని కొన్ని పురాతన తంత్రశాస్త్ర గ్రంధాలలో విపులంగా ఉన్నది. కుండలిని శక్తి వెన్నుపాము క్రిందభాగములో చుట్టలు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉండును. యోగి ధ్యాన పద్దతిలో కుండలిని శక్తిని ఉత్తేజితం చెందించినప్పుడు ఆ శక్తి ఒక్కో చక్రమును దాటుకుంటూ ఊర్ధ్వభాగమును చేరుకొని సహస్రారమును చేరుకున్నప్పుడు యొగి అత్యద్బుత శక్తులను సాధించును.
మొదటి రెండు చక్రాలు ఉత్తేజితం అయినవెంటనే యోగికి కొన్ని రకాల శక్తులు సంప్రాప్తిన్చును . దానితో తన సాధన విరమించక పూర్తి చేయవలెను . ఈ సాధన పూర్తిగా గురువు యొక్క సూచనలు పాటిస్తూ చేయవలెను . సొంత సాధన పనికిరాదు. అలా చేసిన ఆ శక్తిని తట్టుకునే శక్తి లేక పిచ్చివాళ్ళు అయ్యే ప్రమాదం ఉండును.

No comments:
Post a Comment