Sunday, January 19, 2020

వ్యాధుల నివారణ కొరకు రహస్య తాంత్రిక ప్రయోగాలు tantric solutions for some problems

 *  అపస్మారక వ్యాధి -

        21 ఉప్పురాళ్లు తీసుకుని వాటిని పట్టువస్త్రంలో కట్టి రోగి మెడలో ధరింపచేయాలి. దీనివలన ఫలితం కనిపిస్తుంది.

 *  రోగబాధ నివారణ కొరకు  -

      పడకగదిలో నిద్రించేప్పుడు తలగడ తూర్పుదిక్కున ఉంచాలి. లేదా నాలుగు గురిగింజల బరువుగల సునైలా రాయిని వెండి ఉంగరంలో పొదిగించి ఏదైనా నెలలో శుక్లపక్షం గురువారం నాడు కుడిచేతి చూపుడు వేలికి ధరించాలి. రోగబాధ నివారణ అగును.

 *  తీరని వ్యాధితో బాధపడేవారికి  -

      ఎవరైనా దుష్టప్రయోగాలు జరిగాయని బాధపడేవారికి పిప్పలి చెట్టుకి నీరుపోసి , హనుమాన్ కవచం నిత్యం పారాయణం చేయాలి . వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

 *  మూత్రపిండములలో రాళ్ళ నివారణ కొరకు -

      శనివారం నాడు నల్ల గుర్రం నాడా తెచ్చి దాన్ని చిన్న ఉంగరంగా చేయించి చిటికెన వ్రేలికి ధరించడం వలన రోగవిముక్తి కలుగును.

 *  కడుపు నొప్పి నివారణ కొరకు  -

      కడుపు నొప్పి నివారణ కొరకు ఉత్తరాభిముఖంగా దర్భాసనం వేసుకొని కూర్చోవాలి. కొంచం కర్పూరం చేతిలో ఉంచుకొని ఆ కర్పూరాన్ని చూస్తూ 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. తరువాత ఆ కర్పూరాన్ని రోగిచేత తినిపించాలి  కడుపునొప్పి తగ్గుతుంది. కర్పూరం అందుబాటులో లేకున్న ఒక పాత్రలో నీళ్ళని ఉంచి పంచాక్షరీ మంత్రాన్ని జపించి రోగి చేత ఆ నీటిని తాగించాలి.

 * చెవినొప్పి  -

       ఉదయం లేవగానే సూర్యభగవానునికి నమస్కరించాలి. ఉత్తరాభిముఖంగా కూర్చొని ప్రాణాయామం చేయాలి . " వాసుదేవాయ మంత్రం గట్టిగా చదవాలి.ఇలా 51 సార్లు మంత్రాన్ని చదువుతూ చెవులు శుభ్రం చేసుకోవడం వలన చెవివొప్పి దూరం అగును.

 *  నడుమునొప్పి నివారణ కొరకు  -

      సూర్యుడు అస్తమించేప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలుచుని శరీరంలో నొప్పి ఉన్నచోట వేపకొమ్మతో రాస్తూ " ఓం భైరవాయ నమః " మంత్రాన్ని జపించాలి . తరువాత ఆ కొమ్మని బావిలోగాని చెరువులోగాని వొదలాలి .

 *  గుండెపోటు -

          జాతక చక్రంలో గుండెపొటు సంభవించే యోగం ఉంటే ఏకముఖి లేదా పంచముఖి లేదా నవముఖి రుద్రాక్షను తప్పక ధరించాలి . ఆదివారం ఉపవాసం , సుర్యుడికి అర్ఘ్యం అర్పించాలి. ఆదిత్యహృదయం పారాయణం చేయాలి .

 *  మోకాళ్ళ నొప్పులు  -

        నిద్రించేప్పుడు దక్షిణదిశగా తలగడగా ఉండవలెను . ఐదుంపావు గురిగింజల ఎత్తు ముత్యం , అంతే బరువుగల పగడం ధరించాలి . పడక గదిలో ఒక కిలో సైన్ధవ లవణం మూతలేని గిన్నెలో ఉంచాలి. ప్రతిరోజూ భోజపత్రం ముక్క ఒకప్లేటులో ఉంచి కాల్చాలి. తప్పక ఫలితం కనిపించును.

 *  మధుమేహం  -

       నిద్రించేప్పుడు దక్షిణదిశగా తల ఉంచాలి. గదిలో లేత నీలం రంగు లైటు ఉంచాలి. గదిలో సాయంకాలం నేతితో దీపం వెలిగించాలి. తలగడ కవరు ఆకాశం రంగులో ఉంచాలి.

 *  వాస్తు దోషాల వలన పిల్లలకు జబ్బుచేస్తే  -

        రోజు రావిచెట్టుకి నీయుపోయాలి. ఆవుకి తవుడు తినిపించాలి.

 *  నేత్రదోష నివారణ కొరకు  -

           కంటికి సంబంధించిన సమస్య నివారణ కొరకు సూర్యుణ్ణి ప్రార్ధించాలి. కళ్ళకు వచ్చిన దోషం పోతుంది. పొద్దున్నే లేచి పొద్దుతిరుగుడు పువ్వు వాసన చూసి రోజ్ వాటర్ తో కళ్ళు కడుక్కోవాలి.

 *  పార్శ్వపు నొప్పి నివారణ కొరకు -

        తెల్లని ముల్తాన్ మట్టి తీసుకుని నున్నగా నూరాలి. దానిని వస్త్రగాలితం చేసి అందులో గంగాజలం కలిపి ముద్ద చేయాలి . ఆ ముద్దను కొంతసేపు వాసన చూడాలి. 21 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం జపించాలి .

 రామదూతాయ హనుమాన్ , పవనపుత్ర హనుమాన్ !

      కొంతసేపటికి పార్శ్వపు నొప్పి తగ్గును.

 *  లావు తగ్గుటకు  -

        అదివారం నాడు నల్లటి దారాన్ని చూపుడువేలుకు కట్టి దానిపైన రంగు ఉంగరాన్ని ధరించండి. క్రమంగా శరీరం లావు తగ్గును.

 *  మెడమీద నలుపు తగ్గుటకు  -

      మెంతులు నానబెట్టి మర్నాడు ముద్దగా చేసి , పిండితే రసం వస్తుంది. అందులో తగినంత సెనగపిండి కలిపి మెడకు పూతలా వేసి పావుగంట అయ్యాక కడిగివేస్తే మెడ నలుపు క్రమంగా తగ్గును.

 *  ఇంట్లో రోగాలు ప్రవేశించకుండా -

     ప్రతిరోజూ పెనంపైన రొట్టెలు కాల్చడానికి ముందు పాలచుక్కలు పెనంపైన చల్లండి దీనివల్ల ఇంట్లో రోగాలు ప్రవేశించవు. సుఖసంవృద్ది జరుగును.

              పైన నేను మీకు వివరించిన యోగాలన్నీ కొన్ని ప్రాచీన తాంత్రిక గ్రంథాలలో నిక్షిప్తం అయి ఉన్నవి. వాటిని సరళ భాషలో అనువదించి మీకు వివరిస్తున్నాను.  

No comments:

Post a Comment