హోమం చేయునప్పుడు ఆయా గ్రహములకు సంబంధించిన మంత్రములను ఉచ్చారణ చేసి అగ్నికి సమిధలు , అన్నం , నెయ్యి వేయుట అందరికి తెలిసిన విషయమే . మానవ శరీరం నందు ఒక్కో భాగమునకు ఒక్కో అధిదేవత ఉండును. మనిషి శరీరంలో ఏ భాగం రోగగ్రస్తం అగునో ఆ భాగమునకు సంబంధించిన దేవతను మంత్రోపాసన చేత సంతృప్తిపరిచిన ఆ రోగం శమించును . మంత్రములలోని అక్షరములలోని శక్తి మనిషిలోని అంతర్గత శక్తిని ప్రేరేపించును . సాధకుని శరీరంలో ముఖ్యంగా మెదడు , వెన్నుపాము వంటి భాగములో మార్పులు కలుగును.
మంత్రములు అన్నియు సంస్కృతంలోనే ఉండుటకు కారణం సంస్కృత భాషకు సంబంధించిన అక్షరాలలో భావము , అర్ధము రెండును ఇమిడి ఉన్నాయి. మంత్రాలన్నీ అర్ధాలతో నిండినట్టివే . మానవులకు ఉపయోగపడేవే. మంత్రప్రభావం మన సూక్ష్మగ్రంధుల పైన , షట్చక్రాలపైన శక్తికేంద్రాలపైన సూటిగా పడుతుంది. అప్పుడు సూక్ష్మ జగత్ శక్తికేంద్రం జాగృతమగును. మంత్రోచ్ఛారణ విధివిధానంగా అనుసరించుట వలన ఆ శబ్దాలు వానికి సంబంధించిన యౌగిక గ్రంధులకు సంచలనం కలిగిస్తాయి. అవి పోగొట్టుకొన్న శక్తిని మేల్కొలుపును. ఆ గ్రంధులలో చైతన్యం కలగడం వలన అవి పనిచేయును .
మంత్రోచ్చారణ నుండి ఉద్భవించిన శబ్దతరంగములు ఆ మంత్రం వినువారిపైన మంచి ప్రభావాన్ని చూపును. చెవికి సంబంధించిన నరములపైన ఈ మంత్రోచ్చారణ పడుటచేత నరములు మెదడుకు నేరుగా సంభంధం ఉండటం చేత మెదడు మూలకంగా శరీరము నందలి అన్ని అంగములకు సంబంధం ఉండటం వలన ఆ మంత్రాన్ని వినువారిపైన మంచిప్రభావాన్ని కలిగించును.
మంత్రశబ్ధం ధ్వనికి ప్రతీక . ధ్వని విభిన్న స్వరూపాలలో విభిన్న ప్రభావం చూపును . ధ్వనిపై ఆధారపడిన సంగీతం , శోకం , ఆనందం , ఉల్లాసం కలిగించును. ధ్వని గర్జన రూపములో భయమును ఉత్పత్తి చేయును .
వర్ణమాలలో ప్రతి అక్షరం ఒక బీజము . ప్రతి బీజము ప్రత్యేక మహత్వము , ప్రభావం కలిగి ఉండును. ఈ బీజముల ఏకీకరణమే మంత్ర నిర్మాణము . మంత్రము రెండు ధాతువుల కలయిక చేత ఏర్పడినది. మన్ + త్ర " మననాత్ త్రాయతే ఇతి మంత్రః " అనగా మననం వలన రక్షణ కలిగించును. " మంత్రాధీనంచ దైవతామ్ " దేవతలు మంత్రములకు ఆధీనులు . ఎందుకంటే దేవతలే మంత్రమయులు గాన .
నామరూపాత్మకులు అగు శబ్దము భావము వీనిని ఆధారము చేసుకొని సాధించు యోగమే మంత్రయోగము . అక్షరములను ఒక ప్రత్యేక స్వరముతో ఉచ్చరించిన అపూర్వశక్తి కలుగును. అదియే మంత్రశక్తి . మంత్రశక్తిని ఉద్భవింపజేయుటకు జీవుని యొక్క స్వయంకృషి అవసరం. జీవశక్తిలో జనించిన శబ్దములకే మంత్రశక్తి కలుగును.
మంత్రములు అన్నియు వర్ణాత్మకములే. ఈ వర్ణములు శక్తిస్వరూపములు. వక్షము , కంఠము , మూర్ధ , జిహ్వములము , దంతములు , నాసిక , ఓష్ఠములు , తాలువు ఈ ఎనిమిది వర్ణోచ్చారణకి స్థానములు . వర్ణములను తప్పుగా పలకరాదు. చక్కని వర్ణప్రయోగం చేయువారు బ్రహ్మలోకమున పూజించబడుదురు అని ఒక భావం కలదు. అ , ఇ , ఉ , ఋ , ఏ , ఐ , ఓ , ఔ అను తొమ్మిదియు మంత్రములే . వీనికి మాతృకామంత్రములు అని పేరు .
శబ్దోచ్చారణ మాత్రముచే పదార్ధములు సృజింపచేయగల శబ్దములను బీజాక్షరములు అనిరి. మంత్రమునకు శబ్దబ్రహ్మమే మూలస్వరూపము . వర్ణములకు అనుస్వరము (మ్ ) చేర్చిన పూర్ణ బీజాక్షరం అగును. బీజాక్షర శక్తి తెలుసుకొని వివిధ అక్షరములకు సంపుటీకరణ చేసి మంత్రమును జపించి దివ్యశక్తులను పొందవచ్చు. ఈ విజ్ఞానం అంతయు నిగూఢంగా ఉండును. అందువలనే గురువు లేనిదే మంత్రభాగం నందు ఏమియు సాధించలేము.
మన స్థూల శరీరానికి చాలా కొద్దిశక్తి మాత్రమే ఉండును. మన సూక్ష్మ శరీరములో ఎన్నో విధములైన శక్తులు ఉన్నాయి. అవి జాగృతి అయినప్పుడు మాత్రమే మానవులు శక్తివంతులు అయ్యి ఎన్నో అసాధారణ కార్యాలు చేయగలరు . మంత్రాల్లో సూక్ష్మశబ్దాలు ఎన్నో ఉన్నాయి. పంచతత్వాలలో ఆకాశతత్వం అన్నిటికంటే సూక్ష్మమైనది. శక్తివంతమైనది. అందువల్ల దీని ప్రభావం సూక్ష్మ శరీరంలో ఉండే శక్తి కేంద్రాలపైన పడుతుంది. అప్పుడవి జాగృతములు అయ్యి సాధకుణ్ణి నానావిధాలైన శక్తులు కలవానిగా చేస్తున్నాయి.
మంత్రసాధకుడు పాటించవలసిన నియమాలు -
* సాధకుడు మంత్రజపమునకు ఏకాంత ప్రదేశమును ఎంచుకొనవలెను. అతడు మంత్రమును జపించుచున్నప్పుడు మిగతావారి రాకపోకలు ఉండరాదు. పూజామందిరమున జపించుట అత్యంత శ్రేష్టకరం.
* సాధకుడు ఏకాగ్రతతో మంత్రజపం చేయవలెను . వేకువజామునే జపం చేయుట మంచిది .
* జపం , ధ్యానం చేయు సమయములో కదలకూడదు.
* జపం ఆచరించు కాలములో ఖచ్చితముగా బ్రహ్మచర్యం పాటించవలెను. కోపం , ఆగ్రహం దరిదాపుల్లోకి కూడా రాకూడదు.
* అసత్యము పలుకరాదు . చేయగూడని పనులు చేయరాదు . మద్యం , మాంసం వంటి వాటిని సేవించరాదు. ధూమపానం నిషిద్దం. శరీరమును , మనస్సును అన్నివేళలా శుభ్రముగా ఉంచుకొనవలెను.
* మంత్రజపం మొదలుపెట్టిన తరువాత మధ్యలో ఆపరాదు. అలా ఆపినచో అప్పటివరకు చేసిన జపము అంతా వృధా అగును. ఫలితం ఉండదు.
* సాధకుడు మంత్రజపము , ధ్యానసాధన మొదలుపెట్టిన తరువాత ఎటువంటి అనారోగ్యములు అయినను అతని కుటుంబసభ్యులకు కనిపించుచున్నను ధైర్యముతో జపము ఆపకూడదు. రోజులు గడుస్తున్నకొలది సమస్యలు అన్నియు తీరిపోవును.
* జపము చేయు సమయములో ఎటువంటి విచారకరమైన వార్తలు వినినను , ఇతర సమస్యలు ఎదురైనను జపాన్ని ఆపరాదు . గురువుని సంప్రదించ వలెను.
* మంత్రానుష్టానం చేయు రోజుల యందు సాధకుడు ఎక్కువుగా పండ్లు , తేలికగా జీర్ణం అయ్యే ఆహారపదార్థాలు తీసికొనవలెను . ఇలా చేయుట వలన శరీరం బద్ధకం , అనారోగ్యం వంటి సమస్యల పాలబడకుండా అత్యంత చురుకుదనంతో ప్రవర్తించగలరు.
* మంత్రానుష్టానం చేయు సమయంలో ఎదురయ్యే విచిత్ర సంఘటనలు కనిపించిన యెడల అధైర్యపడకూడదు.
* మంత్రజపం చేయు విషయము భార్య , ఇతర కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియపరచవలెను.
* మనస్సు నందు ఏదో ఒక కోరికతో మంత్రసాధన చేయుచున్నప్పుడు ఆ కోరిక నెరవేరుట కొంచం ఆలస్యం అయినను సాధకుడు నిరుత్సహ పడకుండా దైర్యముతో తన మంత్రసాధన కొనసాగించవలెను.
* మనస్సు నందు కోరిక లేకుండా ఏ మంత్రజపం అయినను చేస్తూ ఉన్నచో అన్ని కార్యముల యందు అడ్డంకులు తొలగి ప్రశాంతమైన జీవితం గడపగలరు.
* మంత్రజపం గాని , ధ్యానసాధన , స్తోత్రపఠనం వంటివి ఏవైనా గాని ఒక పర్యాయము దీక్షలో నెరవేరని ఎడల తాను నిర్వహించిన అనుష్టానములో ఏదో ఒక లోపం ఉందని గ్రహించి తిరిగి మరలా ఆ దీక్షనుబూని ఆ లోపం తెలుసుకొని మరలా ఆతప్పు జరగకుండా జాగ్రత్తపడవలెను. లేనిచో దీక్షని శక్త్యానుసారం నిర్వహించవలెను.
* పుస్తకములు చదివి లేదా వేరే వ్యక్తి ద్వారా మంత్రజపమును తెలుసుకుని గాని సాధకుడు దీక్షని మొదలుపెట్టక సరైన గురువు పర్యవేక్షణలోనే దీక్ష చేపట్టవలెను . సద్గురువు ఆశీర్వాదముతో దీక్ష మొదలుపెట్టిన ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యసిద్ధి పొందగలరు.
* అన్నింటికన్నా ముఖ్యమైనది సాధకుడికి తాను చేయబోయే మంత్రాధిష్టాన దేవత యందు , మంత్రము యందు , స్తోత్రము యందు నమ్మకం , సంపూర్ణ విశ్వాసం , భక్తిశ్రద్ధలు కలిగి ఉండవలెను అప్పుడే ఆ మంత్రజపం సిద్ధిస్తుంది.
▶మంత్రము :
24 ఓంకారములు ; ప్రతి ఓంకారము 20 సెకనులు తగ్గకుండ సాధన చేసిన యెడల మెదడులో ఏకాగ్రత ( తీటా అల ) పెరుగుతుంది .
▶యంత్రము :
కొంతకాలము రోజుకు 40 నిమిషములు తగ్గకుండ ఒక నిర్ధుష్ఠమైన , బిందువుపైన గాని , రూపముపై గాని , జ్యోతిపై గాని , "శాంభవీ ముద్ర" చేసిన యెడల మెదడులో తీటా అలలు పెరుగును .
▶తంత్రము :
ఒక నిర్ధుష్ఠమైన ధ్యేయముతో , అనుభవము కల్గిన వారి సమక్షములో మంత్ర , యంత్రముల సాధన చేసి స్వయముగా ఫలితము పొందుటయే తంత్రముగా మహర్షులు తెలుపుచున్నారు . యోగ శాస్త్రం ప్రకారము ఈ సృష్ఠి పంచ భూతములతోను , పంచతన్మాత్రలతోను నిండి యున్నది . ప్రతి అణువులోను ఒక బ్రహ్మాండం ఉన్నది . పూజ విధానములో అందరూ తెలిసో తెలియకో ఈ పంచతన్మాత్రలను పూజించుచున్నారు . ఇదియే తంత్రము .
▶పూజలో అగరువత్తులు , సాంబ్రాణి వాడుట వాసన తన్మాత్ర. ( గంధము - భూమి )
▶రుచికరమైన పదార్ధముల నైవేద్యము రుచి తన్మాత్ర ( జలం - నీరు )
▶దీపారాధన దృష్ఠి తన్మాత్ర ( అగ్ని )
▶గంధము బొట్టు పెట్టి అలంకరించుట స్పర్శ తన్మాత్ర ( వాయువు )
▶మంత్రములు ; గంటలు (శబ్ధ తన్మాత్ర - ఆకాశము )
▶మనము సాధారణ పూజ చేసిన కూడ మన మెదడులోని వాసన ; రుచి ; దృష్టి ; స్పర్శ ; శబ్ద కేంద్రములలో ఎరుక (awareness)పెరుగును . ఈ విధముగా వివరణలు తెలుసుకొని సాధన చేసి ఫలితము పొందుటయే తంత్రము .
▶ప్రపంచములోని అన్ని సంస్కృతులు వీటిని ఎదో ఒక రూపముగా అనుసరించుచున్నారు . ఈ సాధనల కొరకు దేవాలయములు కేంద్రములుగా ఏర్పరచుకున్నారు . సాధకులు ఈ కేంద్రములను చాలా శక్తి వంతముగా, పవిత్రముగా భావించుచున్నారు . ▶ బ్రిటన్లోని స్టోన్ హెంజ్ ; పిరమిడ్స్ ; సెంట్రల్ అమెరికాలోని మయాన్ పిరమిడ్స్ అన్నియు సాధన ( తాంత్రిక ) కేంద్రములే. తంత్ర విద్య మనిషి సంపూర్ణముగా ఎలా బ్రతకవలెనో తెలుపును .
▶ప్రసిద్ధ వైద్యులు PROF. K.N.UDUPA గారు పూజా విధానమును; శక్తివంతమైన మానసిక చికిత్సతో పోల్చినారు .
▶వరాహ తంత్రం మానవాళి పురోభివృద్దికి కావలసిన అంశములను ఈ విధముగా వివరించు చున్నది . 1) చైతన్యము 2) సృష్ఠి - ప్రళయము 3) దైవపూజలు 4) గ్రహములు , నక్షత్రములను గూర్చి 5) మానవ శరీరములోని నాడి వ్యవస్థ , మరియు చక్రములు 6) సాంఘిక ధర్మములు ; ఆచరణ 7) పుణ్యకార్యక్రమములు 8) మంత్ర - యంత్రములు 9) ముద్రలు 10) బాహ్య - అంతర్గత పూజలు 12) గృహములు , బావులు 13) పవిత్ర స్ఠలములు , గుడులు 14) దీక్షలు 15) యోగ 16) యోగ సాధనతో గూడిన ఆయుర్వేద వైద్యము 17) విజ్ఞానము మొ!! మహర్షులు తంత్ర విద్యయందు మానవాళికి కావలసిన సమగ్ర సమాచారమును వారికి కాలానుగుణముగా అందుబాటులో యున్న వానిని పొందు పరిచినారు . ప్రతి గుడి యందు ఈ సమాచారము అంతయూ యుండును .
▶భారత దేశములో ఆచరించు తంత్రములు 5 రకములు :
1) వైష్ణవ : ఉపాశ్య దైవము "విష్ణువు". వీరి గ్రంథములను "వైష్ణవ ఆగమాలు" (పంచాయతనం) అందురు.
2) శైవము : ఉపాశ్య దైవము : శివుడు
అధ్యయన గ్రంథములు :శైవ ఆగమాలు
3) శాక్తేయము :
ఉపాశ్య దైవం : శక్తి యొక్క బహు రూపాలు.
గ్రంథములు : శక్త్యాగమాలు
4) సౌరము :
ఉపాశ్య దైవము : సూర్యుడు
అధ్యయన గ్రంథములు : సూర్యాగమాలు.
5) గాణపత్యులు: ఉపాశ్య దైవము : గణపతి,
అధ్యయన గ్రంథములు : గాణపత్యా గమాలు.
▶భారతదేశములో కొన్ని ముఖ్యమైన తాంత్రిక కేంద్రములు కలవు. వీటిలో ఒకటి ఒరిస్సా రాష్ట్రములోని పూరి (పురి) .
▶తాంత్రిక కేంద్రములు ఏర్పరుచుటలోని ముఖ్య ఉద్దేశ్యము: సాధకులు, సాధనలో అంతర్గతమై తన శరీరమునే తాంత్రిక కేంద్రముగా భావించి సాధన చేయుట .
"దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః"
దేహమే దేవాలయము. అందులోని జీవుడే దేవుడు. అన్నధ్యేయమే ముఖ్యము .
ఏ దైవాన్ని పూజించిన కూడ ; ఆ దైవ లక్షణములను మనలో పెంపొందించు కొనవలయును ; అప్పుడు సాధకుడిలో సృజనాత్మకత పెరుగును . ఇదియే మహర్షుల యొక్క ముఖ్య ఉద్ధేశ్యము . దీనినే యోగ విద్యలో "సంయమము" అందురు . అగ్ని పురాణము : రుద్రుని పూజించిన వారు రుద్రులు అగుదురు , సూర్యుని పూజించిన వారు సూర్యులు అగుదురు ; విష్ణువుని పూజించు వారు విష్ణువు అగుదురు . శక్తిని పూజించు వారు శక్తి అగుదురు . తంత్రము మానవ వికాసమునకు సమగ్ర శాస్త్రము అగుట వలనే, దీనిని " భక్తి ముక్తి కారణిక " అని అందురు . ప్రసిద్ధ విజ్ఞాన వేత్తలు పురాణములను మానవ పరిణామ ప్రక్రియకు పునాధి రాళ్ళుగా పేర్కొనినారు.
చైనాలో ఒక సామెత కలదు " ఒక కళాకారుడు ఒక చెట్టు బొమ్మ వేయవలెనన్న ముందు తను ఆ చెట్టు కావలయును ; (MERGING : లయ) ; అప్పుడు చెట్టు పోలికలన్నియు తనలో వచ్చి ; చెట్టు బొమ్మకు సంపూర్ణ న్యాయము చేకూర్చును " రామకృష్ణ పరమహంస గారు అమ్మవార్ని పూజించేటప్పుడు అమ్మవారి వలె , ఆంజనేయ స్వామిని పూజించునప్పుడు ; ఆంజనేయ స్వామి వలె ప్రవర్తించేడి వారు . అన్ని సంస్కృతుల యందు తాంత్రికము కలదు .ఈ అన్ని తాంత్రిక ప్రక్రియలు వారందరూ సనాతన ధర్మము నుండియే గ్రహించినారు.
దక్ష ప్రజాపతి కుమార్తె సతి . సతి తండ్రి అభీష్ఠమునకు వ్యతిరేకముగా శివుడిని వివాహమాడింది . దక్ష ప్రజాపతి యజ్ఞము చేయుచున్నప్పుడు , శివుడి మీద యున్న వ్యతిరేకతతో అల్లుడైన శివుడిని, కుమార్తె అయిన సతిని యజ్ఞమునకు ఆహ్వానించలేదు . సతీదేవి ఇది అవమానముగా భావించి యజ్ఞమందు దూకి మరణించినది . శివుడి ఆనతితో వీరభద్రుడు వచ్చి దక్ష యజ్ఞమును నాశనము చేసెను. విష్ణుమూర్తి గరుడ వాహనముతో పై నుంచి ; చక్రముతో సతీదేవి శవాన్ని ముక్కలు చేసి అన్ని పైపులకు విసిరివేసి తరువాత శివుడిని శాంతింప చేసాడు . సతీదేవి శవము యొక్క ముక్కలు పడినవన్నియు తాంత్రిక (శక్తి) కేంద్రములు .
▶ నాభి స్థానము (SOLAR Plexus) (KONARK) పూరిలో పడింది . అందువలన పూరి ఒక తాంత్రిక కేంద్రము . ఇది పురాణ విషయము .
▶ నిత్య జీవితములో మనము ఎన్నో పనులు చేస్తాము . పనులు చేసేది, SYMPATHETIC NERVES Dystem.
ఆలోచన ఇచ్చేది,
PARASYMPATIC Nerves System.
▶PITUTARY (శివుడు) . ఈ మూడు కలసి చేస్తే గాని ఫలితము (యజ్ఞము ) యుండదు .
▶అప్పుడు (శివుడు) PITUTARY శరీరమునకు ;
B.P ; DIABETIC ; PSYCHIC PROBLEM ,DIGESTIVE PROBLEMS ఏర్పాటు చేస్తుంది . శరీరము చాలా అస్థవ్యస్థమునకు చేరుతుంది . (ENDROCLINE IMBALANCE) . విష్ణువు (THYMUS ;WILL POWER) ; చక్రము (CONCETRATION) తో అనారోగ్యము పై కేంద్రీకరించి ; తన వైద్య శక్తితో PARASYMPATHIC NERVE ను సాధారణ స్థితికి తెచ్చి అనారోగ్యములు సరిచేయును . మెదడు యందు యున్న విపరీతమైన ఆలోచనలను చెల్లాచెదరు చేయుటయే సతీదేవి శవమును ముక్కలు ముక్కలుగా చేసి విసిరివేయుట . ఇది ప్రతి వ్యక్తియందు ప్రతి క్షణము జరిగెడి తంత్రము . (సశేషము)

No comments:
Post a Comment