Sunday, January 19, 2020

కీళ్ల నొప్పులు కాళ్లు తీపులు joint pains

 వాయు లాకులు దంచి ముద్దకు సమానంగా నువ్వుల నూనె తీసుకొని అందులో వేసి తడి పోయేవరకు కు కాచి నూనెను చల్లార్చి ఆ నూనె పైన మర్దన చేసిన కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
👉 ఒక గ్లాసు పాలలో, వెల్లుల్లి రెండు మూడు పాయలు దంచి వేసి బాగా మరిగించి, రాత్రి నిద్రించే ముందు త్రాగుట వలన, కీళ్ల వాపులు కీళ్ళ నొప్పులు తగ్గును.
👉 కానుగ చెట్టు పట్ట దంచి రసం తీసి 20 మి. లీ రోజుకు ఒకసారి తాగితే కీళ్లనొప్పులు తగ్గుతాయి
👉 నల్లేరు కాడలు లేతది పచ్చడి చేసుకుని తింటే, కీళ్ల నొప్పులు వాపులు తగ్గుతాయి.
👉 తుమ్మ బంక ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని రోజూ రెండు పూటలా తింటుంటే మోకాళ్ళ లో గుజ్జు తయారు అవుతాయి మరియు నొప్పులు కూడా తగ్గుతాయి.
👉 ఒక గ్లాసు నీళ్ళలో ఐదు పారిజాతం ఆకులు వేసుకొని ఐదు నిమిషాలు మరిగించి వడపోసుకొని రోజూ రెండు పూటలా తాగుతున్న మోకాళ్ళ నొప్పులు అన్ని రకాల నొప్పులు తగ్గును

No comments:

Post a Comment