Sunday, January 19, 2020

some motivational quotes

**సాలెపురుగు తనలోంచి వస్తున్నా జిగురు తో గూడు
సృష్టించుకొని , ఆ గూగు లోనే చిక్కుకొని , దాని వల్లే
మరణిస్తుంది . అలానే నీవు , నీ యిల్లు , నా కుటుంబము ,
నా బంధువులు , అని నీవే బంధాలను అల్లుకొని , సృష్టించుకొని
అజ్ఞానము తో అదే నిజాము అనుకోని , అసలు జ్ఞానం
తెలుసుకోకుండా చచ్చిపోతున్నారు .
**ఎవరు నువ్వు ? ..నీవు శరీరం కాదు . మనస్సు కాదు .
బుద్ధి కాదు . ఇంద్రియాలు కాదు . మరి ఎవరు నువ్వు  ?
నువ్వు పరమాత్మా అంశవు.నీకు పరమాత్మకు భేదమే లేదు .
ఒక్కడివే వచ్చావు . ఒక్కడివే పోతావు . వచ్చినపుడు ఏమీ
తేలేదు . పోయినపుడు ఏమీ తీసుకు పోలేదు . ఎవరికి వారే
యమునా తీరే . ఎవడి కర్మానుసారం వాడు ప్రవర్తిస్తాడు .
వాడు ఏమి చేయాలనీ నిర్ణయించుకొని వచ్చాడో  ..అదే
చేస్తాడు . నువ్వు చెప్పినమాట ఎవడు వినడు .
**నీ గుండె నువ్వు చెప్పినట్లు వినడం లేదు . నీ రక్త ప్రసరణ
నువ్వు చెప్పినట్లు వినడం లేదు . నీ శ్వాస నువ్వు చెప్పినట్లు
వినడం లేదు ....అందరూ నేను చెప్పినట్లు వినాలి అంటావేంటి ?
ఎవర్నీ కంట్రోల్ చేయాలనీ చూడకు . నీ సంగతి నువ్వు చూసుకో .
మనస్సు చేసే మాయ గారడీ నుండి తప్పించుకొని బ్రహ్మం గా
జీవించు .
**ఈ సృష్టి అంతా భగవంతునిది . ఈ ప్రపంచం లో ఉన్న
వస్తువులు ఎవరివి ? ...భగవంతుడివి . మరి నాది ..నాది ..
అంటావేంటి . ఈ పొలం ఎవరిది ? ..నాది అంటావు . 100  సం
క్రిందట ఈ పొలం ఎవరిది ? ...యింకొకరిది . ..యిప్పుడు నీది .
100 సం తర్వాత  మరొకరిది . ఆలోచించు . నీదంటూ ఏమీ
లేదు యిక్కడ .
**ఈ ప్రపంచంలో నీవు ఒక అతిధి లా ఉండాలి . హైదరాబాద్ లో
చుట్టాలు యింటికి వెళ్లవు . వాళ్ళ యింటిలో యెంత జాగ్రత్త గా
ఉంటావు ? ఎంతవరకు అవసరమో అంతవరకూ మాత్రమే
మాట్లాడతావు . నీ పనులు నీవు ఎవరికి యిబ్బంది కలుగకుండా
చేసుకొంటావు . వారికి ఏమాత్రం బాధ కలగా కుండా ప్రవర్తిస్తావు .
అలాగే ఈ సమాజం లో నీవు ఒక అతిధి లా జీవించాలి .
దేన్నీ పట్టించుకోకూడదు .ఏది ఎంతవరకు అవసరమో , అంత
వరకు మాత్రమే చేయాలి . ఉదాసీనం గా ఉండాలి . నీవు
బ్రహ్మానివి అనే ఎరుక నిరంతరం ఉండాలి . అందర్నీ ఆత్మ
ద్రుష్టి తో చూడాలి . నీకు చేతనయినంత సహాయం
అందరికి చేయాలి . 
బ్రహ్మార్పణం .

No comments:

Post a Comment