Sunday, January 19, 2020

సూర్యగ్రహణం గురించి వివరణ sun eclipse

గ్రహణ సమయంలో మన ఇంటిలో నిలువయుండు ఊరగాయలు , పచ్చళ్ళు , చింతకాయ పచ్చడి మొదలగు వాటియందు దర్భలు వేసి ఉంచుతారు. 
     
               విక్రం సారాబాయి పరిశోధనా కేంద్రం n .s వైద్యశాల సహకారంతో ఎన్విరాన్మెంట్ బయాలజీ విభాగం వారు నిర్వహించిన పరిశోధనలో  సంపూర్ణ సూర్యగ్రహణ సందర్భములో సూర్యకిరణాలు సోకితే నీటిశ్రేష్ఠత తగ్గింది. దర్భలు గ్రహణ సమయంలో తులసి దళాలకంటే నీటిని ఎక్కువ శుభ్రం చేస్తాయని రుజువైంది. అదేవిధంగా సూర్యగ్రహణ సమయంలో కొన్నికొన్ని జంతువులపై పరిశోధన చేసినప్పుడు రేడియోధార్మిక వాతావరణ ప్రభావానికి లోనైన  కడుపుతో ఉన్న ఎలుకలపై పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో ఆ ఎలుకలు చిన్నచిన్న పిల్లలుపెట్టడం , వికారంగా పుట్టడం , కొన్నిటికి గర్భస్రావం కలగడం , ఎముక యొక్క మజ్జలో వికారంగా పుట్టడం జరిగింది. అదేవిధంగా ఉల్లి , జొన్న మొదలగు పంటలలో కూడా మార్పులు సంభవించాయి. కొంతమంది పరిశోధకులు సముద్ర జంతువుల పైన చేసిన పరిశోధనలలో వాటిలో కొన్నిరకాల వికారాలు కనిపించాయి. సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో X కిరణాలు వృద్ధిపొందుతాయి అవి హాని కలుగచేయును దీనిని ఆంగ్లము నందు కాస్మిక్ రేడియేషన్  అంటారు. సుప్రసిద్ధ కంటి వైద్యురాలు డాక్టర్ పద్మశ్రీ శివారెడ్డి గారు చేసిన పరిశోధన చేసిన ప్రకారం సూర్యగ్రహణాన్ని చూడకూడదు అని అలా సరాసరి చూసిన కన్నులకు హాని జరుగుతుందని అవి చికిత్స కు కూడా లొంగలేదని తనపరిశోధనలో తేలినట్లు వివరించారు.

         సూర్యగ్రహణ సమయంలో జంతువులు మాంసం ముట్టుకోకపోవడం జయపూర్ జంతుప్రదర్శనశాలలో రుజువైనది. రూపాన్ని గ్రహించే సుర్యరశ్మి ఏదైతే ఉందో అదే ఫొటొగ్రాఫ్ లో ఉన్న నెగిటివ్ ఫిల్మ్ నకు సోకితే రూపాన్ని గ్రహించే శక్తి పోతుంది. అట్లాగే గ్రహణసంబంధమైన తేజస్సు అపరిపక్వ దశలో ఉన్న శిశువు మీద పడినప్పుడు  ఆయా భాగాల అభివృద్ధికి ఆటంకం తప్పక కలిగించును. 

No comments:

Post a Comment