Sunday, January 19, 2020

మధుమేహం గురించి సంపూర్ణ వివరణ ( diabetic ,sugar )

షుగర్ అంటే ఏమిటి?!
_________
మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు.  "ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు."

చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది...
ⓐⓡⓐ

(1) - చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్!


(2) - సల్ఫర్ చాలా భారీ రసాయన మూలకం. అది మానవ శరీరంలోకి వెళ్ళిన తర్వాత, దాన్ని బయటకు తీయడం అసాధ్యం అవుతుంది.


(3) - చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, దీనివల్ల గుండెపోటు వస్తుంది.


(4) - చక్కెర శరీర బరువును అధికంగా పెంచుతుంది, దీనివల్ల es బకాయం వస్తుంది.


(5) - చక్కెర రక్తపోటును పెంచుతుంది.


(6) - మెదడు దాడికి చక్కెర ప్రధాన కారణమని నిరూపించబడింది.


(7) - ఆధునిక వైద్య శాస్త్రం చక్కెరలో తీపి రుచిని సుక్రోజ్‌గా గుర్తిస్తుంది. సుక్రోజ్ మానవులకు మరియు జంతువులకు జీర్ణించుకోవడం కష్టం.


(8) - చక్కెర తయారీ ప్రక్రియలో ఇరవై మూడు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు.


(9) - డయాబెటిస్‌కు ప్రధాన కారణం చక్కెర.


(10) - కడుపు పుండుకు చక్కెర ప్రధాన కారణం.


(11) - శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది.


(12) - పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం.


(13)  సాధ్యమైనంతవరకు, చక్కెరను వదిలివేసి, స్వచ్ఛమైన బెల్లం తినడం ప్రారంభించండి.

దయచేసి  ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ స్నేహితులు, బంధువులు మరియు సమూహాలలో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయండి. ...

షుగర్ కు NO చెప్పండి..

మధుమేహం రక్తంలో ఉంటే ఉన్నట్లు కాదు, ఏ ఆయుర్వేద గ్రంథాలలోనూ దీని గురించి వివరణ లేదు. చరక సంహిత లో చాలా వివరంగా ఇచ్చినారు. దాని ఆధారం యథాతథంగా మీకు తెలియజేస్తున్నాను. మూత్రం లో
 ఉంటే ఉన్నట్లు, చరక సంహిత గ్రంథం లో, చరక మహర్షి  వివరించిన విధానం చూడండి

వ్యా, "సప్త పీడకామధుమేహికా "ఆనినిర్దేశింకబడినయేడునిధములైన ప్రమేహపి డకల వివరించుటకై వానికి హేతువులగు ప్రమేహముల నిదానసంప్రాప్తిస్వరూపములు
చెప్పబడుచున్నవి. గురుపదార్థముల నైనను( మిక్కిలి బలము కరమైన పదార్థం), స్నిగ్ధ పదార్థముల నైనను( జి డ్డు  గల పదార్థములు),ఆమ్లలవణరసములు కలపదార్థములనైనను( పులుపు ఉప్పు) విశేషముగ భుజించుట, కొత్త ధాన్యముల యన్న మును( అన్నము గంజి  వంచకుండా తింటే కొత్త ధాన్యం తో సమానము) ఆధిక ముగతినుట, కొత్త మద్యం ను త్రాగుట, అధికముగ నిద్ర సేవించుట, (పగటి నిద్ర )అధికముగ కూర్పునియుండుట(ఎటు వంటి శారీరక శ్రమ లేకుండా కూర్చొని ఉండుట,)దేహపరిశ్రమమును చింతనమును (మానసిక వ్యాపారమును) బొత్తుగమానుటవమనవి రేచశాది శోధనముల సేవించకుండుట,( అప్పుడప్పుడు వాంతి చేసుకోవాలి
, మరియు విరేచనాలకు మందు వాడాలి ఈ కారణాల చేత శరీరమునందలి శ్లేషబును పిత్తంబును మేదోధాతువును( ఒబిసిటీ) మాంసంబును( కండలు పెంచడం) ఆధికముగ (స్వప్రమాణమునకననధికముగ) వృద్ధినో oది. ( ఉండవలసిన దానికన్నా అధికంగా ఉంటే)వాత నంచార మార్గ మును అడ్డగించును.
( మనము తీసుకున్న వాయువు, శరీరంలోని ప్రతి అవయవానికి లోపలికి వెళ్లాలి మరియు బయటికి రావాలి) దానం జేసి వాతము,ప్రకోపించి ( వాతము ఎక్కువయ్యి)శరీరమునందలి యోజస్సును(శక్తి ) కూడ దీసికొని వస్తి (మూత్ర పుసంచి) యండి
చేరినపుడు మిక్కిలి కష్ట సాధ్యమైన మధుమేహం సంభవించును. అట్టి మధుమేహంవాతపిత్త కఫములయొక్క లక్షణములు మాటిమాటికిని కనబడును. అట్టియెడ మూత్రం ప లుమారు వెడలుచున్న ను మాటిమాటికి అప్పుడప్పుడునువృద్ధియగుచుండును. ఆట్టిక్రూ రమగు ప్రమేహము తనంత నే యొక సమయమున శాంతినొందియుండును.
 మిక్కిలి కష్ట సాధ్యము అంటే
 కష్టంగా బాగవుతుంది.
 అంటే మధుమేహం బాగా అవుతాది అని అర్థం.

 ఆధారం:చరక సంహిత
సూత్ర స్థానము
పేజీ 400
👉 దీనిని ఏ ఆయుర్వేద వైద్యులు కానీ, ఆయుర్వేదం బోర్డు కాని కాదనగలదా. ఆయుర్వేద కాలేజీలో చరకసంహిత సబ్జెక్టు ఉన్నది.
 దీనిని కాదంటారా?
👉 ఏ ఆధారం లేకుండా నేను ఊరికే సొల్లు కబుర్లు చెప్పడం లేదు.
👉  ఏ వ్యాధి అయినా, ఆ వ్యాధి
 లక్షణములు ఉండేవో వల్ల కదా !
 అలాంటి లక్షణాలు లేకుండానే
 కేవలం ల్యాబ్లో ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే, మీరు షుగర్ పేషెంట్ అని ఎలా టైటిల్ ఇస్తున్నారు.
 డాక్టర్లు, అనవసరంగా లేని రోగాన్ని
 అంటగట్టి, బ్రతికి నన్ని రోజులూ
 మధుమేహం అనే రోగాన్ని అంటగడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం.?
 మూత్రం లో ఉంటేనే షుగర్ పేషెంటు..!
 👉మీ బ్లడ్ లో ఎంత షుగర్ ఉన్న షుగర్ పేషెంట్ కాదు !
👉 ఆ లక్షణాలే లేనప్పుడు మీరు ఎలా షుగర్ పేషెంట్ అవుతారు.
👉 మీరు ఎప్పుడైనా డాక్టర్లను షుగర్ యొక్క లక్షణాలు ఏమిటని ప్రశ్నించార??
👉 వేరే వాళ్ళు రిపోర్టు తీసుకుని మీరు వెళ్లి చూడండి ఒకసారి,?
 మీకు నిజంగా మధుమేహం లేదు
 ఇతరల  రిపోర్టు తీసుకుని మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చూడండి. అతను మందు ఇస్తాడా లేదా చూడండి.అంటే  అర్థం ఏంటి కేవలం మనిషిని చూడకుండా మనిషి యొక్క లక్షణాలు చూడకుండా, ఆ వ్యక్తి యొక్క నాడీ చూడకుండా, గుడ్డిగా వైద్యం చేస్తున్నారు. ప్రశ్నించేవారు లేనంత వరకు, దేశమంతా, మధుమేహగ్రస్తులు గా ఈ డాక్టర్లు తయారు చేస్తున్నారు.
 👉 దీనివలన ల్యాబ్  వాళ్ళు, మందుల కంపెనీలు, హాస్పిటల్స్
 బాగు పడుతున్నారు. లక్షల ఆస్తులు కూడా క డుతున్నారు
👉ప్రజలను, మానసికంగా శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు.
👉 దీనివల్ల మనిషి యొక్క ఆయుషు కూడా తగ్గిపోతుంది
👉 మూత్రపిండ వ్యాధులు
 కంటి సమస్యలు గుండె సమస్యలు
 అల్లోపతి మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతుంది


మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును.  ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు.

              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర  మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును.

              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ  గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును.

 మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది .

      1 - సహజము .

      2 - అపథ్య నిమిత్తజము .


 *  సహజము  -

        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును.

 *   అపథ్య నిమిత్తజము  -

        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును.

                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును.

       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు    గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును.

అంతకు ముందు పోస్టులలో మధుమేహం రావడానికి గల కారణాలు మరియు అందులోని రకాల గురించి సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు నేను చెప్పబోయే సిద్ధయోగాలు అత్యద్బుతముగా మధుమేహ నివారణ చేయును . వీలైంతమందికి ఈ పోస్టు పంపండి. ఇది అత్యంత ముఖ్యమైన మరియు విలువైన సమాచారం . కొంతమంది అయినా వీటిని పాటించి రోగవిముక్తులు అవ్వాలని కోరుకుందాం. 


  మధుమేహ నివారణ కొరకు సిద్ధయోగాలు  -  

 *  ఉసిరిక వలుపు , పసుపు సమంగా కలిపి ఉదయం , సాయంకాలం నందు 2 నుంచి 3 గ్రాములు సేవించుచున్న యెడల మధుమేహము శమించును . 

 *  పొడపత్రి ఆకు , తంగేడు గింజలు లేక తంగేడు పువ్వులు సమానంగా కలిపి నీడలో ఎండించి మెత్తటి చూర్ణం సిద్ధము చేసుకుని ఉదయం , సాయంకాలం 3 గ్రాముల చొప్పున మంచినీటితో సేవించవలెను. 

 *  మెంతులు మొలకెత్తించి నీడలో ఎండించి చూర్ణము చేసుకుని రోజు రెండుపూటలా 6 గ్రాముల నుండి 12 గ్రాముల వరకు సేవించుచున్న ఎడల మధుమేహం తగ్గును. 

 * నేరేడు గింజలను దోరగా వేయించి పొడిచేసుకోని నీళ్లను చేర్చి కషాయం సిద్దము చేసుకుని ఉదయము నిత్యము ఒక టీ కప్పు ప్రమాణం సేవించుచున్న ఎడల మధుమేహము నందు అత్యంత ఉపకారిగా పనిచేయును . 

 *  మర్రి పండ్లలో నుండు సన్నటి గింజలను నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకుని 2 నుంచి 3 గ్రాముల మోతాదు చొప్పున ఉదయం మరియు రాత్రివేళల్లో సేవించుచున్న  ఎడల మధుమేహము నందు వచ్చు అతిమూత్ర వ్యాధి నివారణ అగును. 

 *  మోదుగ బంక , నల్లతుమ్మ బంక , తంగేడు బంక వీటిని చూర్ణం చేసుకుని 2 నుంచి 3 గ్రాముల చొప్పున ఉదయం మరియు సాయంకాల వేళల్లో సేవించుచున్న ఎడల బహుమూత్రం నివారణ అగును. 

 *  తిప్పతీగ , ఉసిరికాయలు , పచ్చిపసుపు మూడింటిని సమానంగా కలిపి రసం తీసి 10 నుంచి 15 మిల్లీలీటర్ల మోతాదు ఉదయం , సాయంకాలం నందు సేవించుచుండిన ఎడల మధుమేహం నందు ఉపయోగకారి. 

 *  నేల ఉశిరి ఒక భాగము , మిరియాలు 3 భాగములు గ్రహించి చూర్ణం చేసుకుని 2 నుంచి 3 గ్రాములు ఉదయం , సాయంకాలం నందు సేవించుచుండిన యెడల మధుమేహము హరించును. 

 *  తంగేడు మొగ్గలు , ఉశిరిక వలుపు , పసుపు సమానంగా కలిపి చూర్ణము సిద్దము చేసుకుని 3 గ్రాముల చొప్పున రోజు రెండు నుంచి మూడు సార్లు సేవించుచున్న ఎడల మధుమేహము హరించును . 

 *  రాగిజావలో మజ్జిగ కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగుచున్న ఎడల మధుమేహము , అతిమూత్రము హరించిపోవును . 

          పైన చెప్పిన యోగాలు అత్యంత సులభమైనవి మరియు అత్యంత శక్తివంతమైనవి . వీటిలో మీకు ఏది సులభముగా అనిపిస్తే ఆ యోగాన్ని ఆచరించి మధుమేహా సమస్యని నివారించుకోగలరు. 

               మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 

   తినవలసిన ఆహారపదార్ధాలు  - 

       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 

  తినకూడని ఆహార పదార్దాలు  - 

      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు.  అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర  వేగాలను నియంత్రించరాదు.   

        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను.  శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను

మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది.  మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది .  మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము.  జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.

   మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -

   పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద  గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.

  తీసుకోకూడని ఆహారపదార్థాలు -

       తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు .

 మధుమేహంలో ఉపయోగపడు ఔషధాలు -

 *  పొడపత్రి ఆకు రసాన్ని రోజుకి పావుకప్పు తాగుతుంటే ఈ వ్యాధి తగ్గును.

 *  ఇండుప గింజ సగం వరకు అరగదీసి ఆ గంధాన్ని  ప్రతినిత్యం నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

 *  నేరేడు గింజల చూర్ణం పావు చెంచా ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీటితో కలిపి సేవించుచున్న మధుమేహం నియంత్రణ అగును.

 *  మధుమేహం అతిగా ఉన్నవారు పూటకి ఒక  లవంగ మొగ్గ చప్పరిస్తూ ఉన్న మధుమేహం నియంత్రణ అగును.

 *  ప్రతినిత్యం ఒక కప్పు ఉలవలు ఉడకపెట్టిన నీటిని తీసుకొనవలెను .

 *  త్రిఫల చూర్ణమునకు మధుమేహం తగ్గించే గుణము కలదు. కాకపోతే బయట దొరికే త్రిఫల చూర్ణం లో కరక్కాయ, తానికాయ, ఉశిరికాయ సమపాళ్లలో ఉంటాయి . అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మోతాదులో తయారుచేసుకొని రోజు రాత్రిపూట అరచెంచా చూర్ణం అరకప్పు నీటిలో వేసుకొని రాత్రిపూట పడుకునేప్పుడు తాగవలెను . కరక్కాయ పెచ్చులు చూర్ణం ఒక భాగము , తానికాయ చూర్ణం రెండు భాగాలు , ఉశిరికాయ చూర్ణం మూడు భాగాలు కలిపి ఒకే చూర్ణంగా రూపొందించుకొని రాత్రిపూట వాడుచున్న మధుమేహం త్వరగా నియంత్రణకు వస్తుంది.

 *  తంగేడు పువ్వుల కషాయం ఉదయం , సాయంత్రం సేవించుచున్న మధుమేహము తగ్గును.

 *  రోజూ అరటిపువ్వుని ఉడకబెట్టి అల్పహారంగా తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

 *  మర్రిచెట్టు బెరడు చూర్ణం అరచెంచా కాని లేక బెరడు కషాయం పావుకప్పు కాని ప్రతినిత్యం సేవించుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును.

 *  ఉసిరికాయల కషాయం కాని లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పు తాగుచున్న మధుమేహం తగ్గును.

 *  లేత మామిడి ఆకులు ఎండించి చూర్ణం చేసి రోజుకి అరచెంచా తీసుకున్నచో మధుమేహం తగ్గును.

  నా అనుభవ యోగాలు  -

 *  మధుమేహం 300 వరకు ఉంటే మూడు మారేడు దళాలు అనగా 9 లేత ఆకులు ఉదయాన్నే పరగడుపున , సాయంత్రం ఆహారానికి గంట ముందు తినుచున్న కేవలం 15 నుంచి 20 రోజుల్లో 170 నుంచి 190 వరకు వచ్చును. ఆ తరువాత రెండు మారేడు దళాలు చొప్పున ఉదయం , రాత్రిపూట పైన చెప్పిన సమయాల్లో తీసికొనవలెను. త్వరలోనే సాధారణ స్థితికి వస్తారు.

 *  పొడపత్రి చూర్ణం ఒక స్పూన్ , నేరేడు గింజల చూర్ణం ఒక స్పూన్ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి రాత్రి సమయంలో ఆహారానికి గంట ముందు సేవించవలెను . అదేవిధముగా రాత్రిపూట పైనచెప్పిన మోతాదులో గ్లాసు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున సేవించవలెను .

        పైన చెప్పినవన్నీ నేను కొంతమంది వ్యాధిగ్రస్తుల చేత వాడించాను . చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఒకేసారి అల్లోపతి ఔషధాలు ఆపి ఇవి వాడవద్దు. ఇవి వాడుతూ అల్లోపతి ఔషదాల మోతాదు తగ్గించుకుంటూ చివరకి పూర్తిగా ఆపివేయవచ్చు .

         ఈ ఔషధాలు వాడు సమయంలో టీ , కాఫీ , మద్యం , మాంసాహారం ముట్టుకోరాదు. త్వరగా గుణం కనిపించును.

మధుమేహం రావడానికి గల కారణాలు - పాటించవలసిన ఆహార నియమాలు - ఔషదాలు.


మధుమేహము కలిగినటువంటి మనుష్యుని యొక్క మూత్రం తేనె వలే తియ్యటి మరియు చిక్కటి మూత్రం వెలువరించును. ఈ మధుమేహము రెండు రకాలుగా ఉంటుంది.  మొదటిది శరీరం నందలి రస,రక్త ధాతువులు కొన్ని కారణాలచే క్షీణించడం వలన వాతం ప్రకోపించడం వలన కలుగునది. రెండోవది శరీరం నందు వాతం సంచరించు మార్గములలో కొన్ని దోషములు అడ్డగించునపుడు వాతం ప్రకోపం చెంది కలుగునది .  మొదటి రకమైన ధాతు క్షయముచే వచ్చు మధుమేహము తగ్గుట అసాధ్యము.  జీవితాంతం ఔషధాలు వాడుతూ ఉండవలెను.

   మధుమేహ రోగులు తీసుకోవలసిన ఆహార పదార్థాలు -

   పాతబియ్యం , పాత గోధుమలు, రాగిమాల్ట్, మేకమాంసం , మజ్జిగ, కందిపప్పు కట్టు, పెసర కట్టు, పాత చింతపండు, ఉసిరికాయ, వెలగపండు, తోటకూర, పాలకూర, మెంతికూర , కొయ్యతోటకూర, పొన్నగంటికూర, లేత మునగ కూర, లేత బీరకాయ, లేత సొరకాయ, లేత పొట్లకాయ, లేత బెండ , లేత క్యాబేజి, లేత టమాటో లేతవి మాత్రమే తీసుకోవాలి . బూడిద  గుమ్మడి , కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి .జొన్నరొట్టె చాలా మంచిది.

  తీసుకోకూడని ఆహారపదార్థాలు -

       తేలికగా అరగని ఆహారం నిషిద్దం, చేపలు , రొయ్యలు తినరాదు. మద్యపానం , ధూమపానం నిషిద్దం , పెరుగు వాడరాదు , ఇంగువ, వెల్లుల్లి వాడకూడదు, నువ్వులు , నువ్వుల నూనె , ఆవాలు, ఆవనూనె వాడరాదు. ఎర్రగుమ్మడి తీసుకోరాదు, శనగపిండి తినరాదు, నూనెతో వేపిన పదార్థాలు వాడరాదు, కొబ్బరి ముట్టుకోకూడదు, పనస, ద్రాక్ష, కమలా పండ్లు నిషిద్దం, దుంపకూరలు పూర్తిగా మానివేయాలి, భోజనం చేసిన వెంటనే నిద్రించరాదు, బెల్లము , కొత్త చింతపండు వాడరాదు .

 మధుమేహంలో ఉపయోగపడు ఔషధాలు -

 *  పొడపత్రి ఆకు రసాన్ని రోజుకి పావుకప్పు తాగుతుంటే ఈ వ్యాధి తగ్గును.

 *  ఇండుప గింజ సగం వరకు అరగదీసి ఆ గంధాన్ని  ప్రతినిత్యం నీటిలో కలిపి తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

 *  నేరేడు గింజల చూర్ణం పావు చెంచా ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీటితో కలిపి సేవించుచున్న మధుమేహం నియంత్రణ అగును.

 *  మధుమేహం అతిగా ఉన్నవారు పూటకి ఒక  లవంగ మొగ్గ చప్పరిస్తూ ఉన్న మధుమేహం నియంత్రణ అగును.

 *  ప్రతినిత్యం ఒక కప్పు ఉలవలు ఉడకపెట్టిన నీటిని తీసుకొనవలెను .

 *  త్రిఫల చూర్ణమునకు మధుమేహం తగ్గించే గుణము కలదు. కాకపోతే బయట దొరికే త్రిఫల చూర్ణం లో కరక్కాయ, తానికాయ, ఉశిరికాయ సమపాళ్లలో ఉంటాయి . అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే మోతాదులో తయారుచేసుకొని రోజు రాత్రిపూట అరచెంచా చూర్ణం అరకప్పు నీటిలో వేసుకొని రాత్రిపూట పడుకునేప్పుడు తాగవలెను . కరక్కాయ పెచ్చులు చూర్ణం ఒక భాగము , తానికాయ చూర్ణం రెండు భాగాలు , ఉశిరికాయ చూర్ణం మూడు భాగాలు కలిపి ఒకే చూర్ణంగా రూపొందించుకొని రాత్రిపూట వాడుచున్న మధుమేహం త్వరగా నియంత్రణకు వస్తుంది.

 *  తంగేడు పువ్వుల కషాయం ఉదయం , సాయంత్రం సేవించుచున్న మధుమేహము తగ్గును.

 *  రోజూ అరటిపువ్వుని ఉడకబెట్టి అల్పహారంగా తీసుకొనుచున్న మధుమేహం తగ్గును.

 *  మర్రిచెట్టు బెరడు చూర్ణం అరచెంచా కాని లేక బెరడు కషాయం పావుకప్పు కాని ప్రతినిత్యం సేవించుచున్న మధుమేహం నిశ్చయంగా తగ్గును.

 *  ఉసిరికాయల కషాయం కాని లేక ఉసిరిగింజల కషాయం రోజుకి అరకప్పు తాగుచున్న మధుమేహం తగ్గును.

 *  లేత మామిడి ఆకులు ఎండించి చూర్ణం చేసి రోజుకి అరచెంచా తీసుకున్నచో మధుమేహం తగ్గును.


  ఉసిరిక వలుపు , పసుపు సమంగా కలిపి ఉదయం , సాయంకాలం నందు రెండు నుంచి మూడు గ్రాములు సేవించుచుండిన యెడల మధుమేహం శమించును .

 *  పొడపత్రి ఆకు , తంగేడు పువ్వులు సమానంగా తీసుకుని నీడలో ఎండించి చూర్ణం చేసుకుని నిలువచేసుకొని ఉదయం మరియు సాయంత్రం మూడు గ్రాముల చూర్ణం మంచినీళ్ల అనుపానంతో సేవించుచున్న మధుమేహం హరించును .

 *  మెంతులు మొలకెత్తించి నీడలో ఎండించి చూర్ణం సిద్ధం చేసుకుని రోజు రెండుపూటలా ఐదు నుంచి ఆరు గ్రాముల నుండి మధుమేహం స్థాయిని బట్టి పది నుంచి పన్నెండు గ్రాముల వరకు తీసుకుని సేవించుచున్న మధుమేహం శమించును .

 *  నేరేడు విత్తనములు దోరగా వేయించి పొడి చేసి నీళ్లను చేర్చి కషాయం చేసుకుని ఉదయం ఒక కప్పు ప్రమాణం సేవించుచున్న మదుమేహం నందు అద్బుతముగా  పనిచేయును .

 *  మర్రిపండ్లలో ఉండు సన్నటి గింజలను నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకుని రెండు నుంచి మూడు గ్రాముల మోతాదు ఉదయం మరియు రాత్రివేళ యందు సేవించుచున్న యెడల మధుమేహ రోగులకు వచ్చు అతిమూత్ర సమస్య తగ్గును.

 *  రాగిజావలో మజ్జిగ పోసుకొని ప్రతిరోజూ ఉదయం పూట తాగుచున్న ఎడల మధుమేహం , అతిమూత్ర సమస్య తగ్గును.

 *  తిప్పతీగ రసం నిత్యము ప్రాతఃకాలం నందు అరవై నుంచి తొంబై మిల్లి లీటర్ల కషాయం నిత్యం ప్రాతఃకాలం నందు సేవించుచుండిన ఎడల మధుమేహం హరించును .

 మధుమేహరోగులు పాటించవలసిన ఆహార నియమాలు  -

 తీసుకోవలసిన ఆహారపదార్థాలు  -

    యావలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యం , పెసలు , చేదు గల ఆహారపదార్దాలు , కాకర, చేదుపోట్ల , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉశిరికపండు , పసుపు , వ్యాయమం ఆచరించవలెను .

  తీసుకోకూడని ఆహారపదార్థాలు  -

      నెయ్యి , బెల్లం , తీపిపదార్థాలు , మద్యము , గంజి , చెరుకు రసం , పుల్లటి ద్రవ్యములు , కొత్తబియ్యముతో చేసిన అన్నం , పెరుగు , పాలపదార్థాలు , దుంపకూరలు , కొవ్వులు అధికంగా ఉండే పదార్దములు బాగుగా తగ్గించవలెను .

      పగటినిద్ర , పొగతాగటం , మలమూత్ర వేగాలను నిరోధించరాదు.

No comments:

Post a Comment