Sunday, January 19, 2020

అభ్యంగనం వలన ఉపయోగాలు MASSAGE ADVANTAGES

శరీరానికి ప్రతిదినం ఒంటికి ఆయిల్ మసాజ్ చేసుకోవడం తప్పనిసరి అని ఆయుర్వేదం తెలియచేస్తుంది. ఇది ఒక రకమైన వ్యాయామం వంటిది. దీనివలన ముసలితనం త్వరగా దరిచేరదు. ఒళ్లునొప్పులు ఉండవు. కళ్ళకి తేటదనం వస్తుంది. శరీరానికి నునుపుదనం , బలం కలుగుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. మంచినిద్ర పడుతుంది. శ్రమని తట్టుకొనే శక్తి పెరుగును .

             శరీరానికి ఆయిల్ మసాజ్ చేసుకొనుటకు ఆయుర్వేదం అనేక రకాల తైలాలను సూచించింది. ఇప్పుడు మీకు శరీరానికి ఆయిల్ మసాజ్ చేయడం వలన ఉపయోగాల గురించి మీకు వివరిస్తాను.

  ఉపయోగాలు  -

 *  తైలముతో శరీరానికి మసాజ్ చేయడం వలన చర్మానికి కాంతి వచ్చును.

 *  కండరాలు బలంగా తయారగును.

 *  కండరాలకు , టిష్యులకు మంచి పోషణ అందుతుంది.

 *  రక్తప్రసరణ బాగా ఉంటుంది. రక్తప్రసరణ బాగా జరగడం వలన శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది .

 *  శరీరంలో వ్యర్ధాలు బయటకి వస్తాయి.

 *  శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగును .

 *  శరీరం తేలికగా , ఉత్సాహంగా ఉంటుంది.

 *  శరీరంలోని అన్ని జాయింట్లలో పట్టుకుపోవడం తగ్గి అన్నివైపులకు తిరగడానికి వీలుగా ఉంటుంది.

 *  మసాజ్ శరీరంలో దృఢత్వాన్ని పెంచుతుంది.

 *  వెన్నుముక కు చాలా మంచిది . వెన్నుముక నుంచి వచ్చే స్పైనల్ నెర్వ్స్ కు సంబందించిన అవయవాలన్నీ బాగా పనిచేయడానికి అవకాశం ఉంది.

 *  శరీరంలోని ఎలక్ట్రో మేగ్నటిక్ శక్తి సక్రమంగా ప్రవహించడానికి మసాజ్ దోహదం చేస్తుంది.

       పైన చెప్పిన విధముగా ఎన్నొ ఉపయోగాలు ఉన్నాయి. మసాజ్ చేసుకొనే సమయములో అరికాళ్ళు మర్దన చేసుకోవడం మర్చిపోవద్దు. 

No comments:

Post a Comment